Russia-Ukraine Crisis: 'అణ్వాయుధాలు రెడీ చేయండి'- మరో బాంబు పేల్చిన పుతిన్, అంతా హైటెన్షన్
Russia-Ukraine Crisis: నాటో దేశాల హెచ్చరికల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అణ్వాయుధాలను సంసిద్ధం చేయాలని రక్షణ శాఖకు ఆదేశాలిచ్చారు.

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌పై భీకర దాడి చేస్తోన్న రష్యా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ, నాటో సభ్య దేశాలు రష్యాకు సవాల్ విసురుతున్నాయని, అణ్యాయుధాలను వినియోగించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని పుతిన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా చీఫ్ ఆఫ్ ద జనరల్ స్టాఫ్ (సీజీఎస్)కు పుతిన్ ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
భయంభయం
ప్రపచం దేశాలు వారిస్తోన్న ఉక్రెయిన్‌పై దాడి విషయంలో పుతిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా అణ్వాయుధాల ప్రకటనతో మరోసారి ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నారు. ఉక్రెయిన్ విషయంలో ఇతర దేశాలు తలదూరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సైనిక చర్యకు దిగెటప్పుడే పుతిన్ హెచ్చరించారు.





















