అన్వేషించండి
Russia-Ukraine Crisis: మనల్ని ఆపేదెవడ్రా, రష్యా సేనలు శభాష్: సైనిక చర్యపై పుతిన్ ప్రకటన
ఉక్రెయిన్‌లో తమ సేనలు వీరవిహరం చేస్తున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఈ ఆపరేషన్ చేపట్టిన ప్రత్యేక దళాలను అభినందించారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం
ఉక్రెయిన్‌లో ప్రత్యేక ఆపరేషన్ చేపడుతోన్న రష్యా ప్రత్యేక దళాలను ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందించారు. ఉక్రెయిన్‌లో తమ మిషన్‌ను ఆర్మీ వీరోచితంగా నిర్వహిస్తోందని ప్రశంసించారు. ఈ మేరకు దేశ ప్రజలనుద్దేశించి పుతిన్ ప్రసంగించారు.
VIDEO: Russian President Vladimir Putin congratulates members of special forces, saying they are fighting "heroically" in Ukraine pic.twitter.com/y3hF6yGlT6
— AFP News Agency (@AFP) February 27, 2022
" ఉక్రెయిన్‌లో మేం చేపట్టిన సైనిక ఆపరేషన్ దిగ్విజయంగా సాగుతోంది. ఇందులో వీరోచితంగా పోరాడుతోన్న మా దేశ ప్రత్యేక దళాలకు అభినందనలు. త్వరలోనే మేం అనుకున్న లక్ష్యం చేరుకుంటాం. "
- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
దిగొచ్చిన ఉక్రెయిన్
శాంతి స్థాపన కోసం రష్యా చేసిన ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకరించింది. చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ అంగీకరించారు. బెలారస్ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. అంతకు ముందు బెలారస్ వేదికగా చర్చకు జెలెన్‌స్కీ ఒప్పుకోలేదు.
" బెలారస్ వద్దనున్న మా సరిహద్దులోనే రష్యా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. చెర్నోబిల్ జోన్ దగ్గర ఈ సమావేశం జరగనుంది. బెలారస్ నేత అలెగ్జాండర్‌తో మాట్లాడిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ ఇందుకు అంగీకారం తెలిపారు. "
- ఉక్రెయిన్
198 మంది
రష్యా చేస్తోన్న భీకర దాడిలో ఇప్పటివరకు ముగ్గురు పిల్లలు సహా 198 మంది మృతిచెందారని ఉక్రెయిన్ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. 1000 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ఇందులో ఎంతమంది సైనికులు, ఎంతమంది పౌరులు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు.
Also Read: Russia-Ukraine Crisis: 'అణ్వాయుధాలు రెడీ చేయండి'- మరో బాంబు పేల్చిన పుతిన్, అంతా హైటెన్షన్
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















