By: Ram Manohar | Updated at : 20 Aug 2023 03:59 PM (IST)
రష్యా లానా 25 మిషన్ విఫలమైనట్టు అధికారికంగా వెల్లడించారు.
రష్యా లూనా 25 మూన్ మిషన్ విఫలమైంది. చంద్రుడిపై దిగే క్రమంలో క్రాష్ అయినట్టు బలంగా ఢీకొట్టడం వల్ల మిషన్ ఫెయిల్ అయింది. ఆగస్టు 11న ఈ Russia Luna-25 Moon Mission లాంఛ్ చేసింది రష్యా. ఆగస్టు 21న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవ్వాల్సి ఉన్నా...ఢీకొట్టడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. రష్యా స్పేస్ కార్పొరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...రోబో ల్యాండర్ అన్‌కంట్రోల్డ్ ఆర్బిట్‌లోకి ప్రవేశించి క్రాష్ అయింది. "రోబో ల్యాండర్ అనుకోకుండా ఓ ఆర్బిట్‌లోకి ఎంటర్ అయ్యింది. ఆ తరవాత చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది" అని వెల్లడించింది. Roscosmos హెడ్ యురి బొరిసోవ్ జూన్‌లోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. లూనార్ మిషన్స్ చాలా రిస్క్‌తో కూడుకుని ఉంటాయని, సక్సెస్ రేట్ 70% మాత్రమే ఉంటుందని వెల్లడించారు. ఆ అనుమానానికి తగ్గట్టుగానే ఈ మిషన్ ఫెయిల్ అయింది. భారత్ చంద్రయాన్ 3తో పాటు రష్యా లూనా 25 మిషన్ కొనసాగింది. అయితే...ఆగస్టు 19న లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్‌లో టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. అప్పటి నుంచి దీనిపై అంచనాలు తలకిందులయ్యాయి. రష్యా స్పేస్ ఏజెన్సీ ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించింది. అటు చంద్రయాన్ 3 చంద్రుడికి దగ్గర్లో ఉండటం ఉత్కంఠ రేపుతోంది. లూనా 25 మిషన్ ఫెయిల్ అయిన నేపథ్యంలో చంద్రయాన్ 3పై అంచనాలు భారీగా పెరిగాయి.
Russia's Luna-25 spacecraft has crashed into the moon, reports Germany's DW News citing space corporation Roskosmos pic.twitter.com/ZtxYkFHUp2
— ANI (@ANI) August 20, 2023
50 ఏళ్ల క్రితం..
1976లో రష్యా Luna-24 మిషన్‌ని లాంఛ్ చేసింది. అది కూడా అప్పట్లో ఫెయిల్ అయింది. ఫలితంగా రష్యా ప్రతిష్ఠకు భంగం కలిగింది. అందుకే...మళ్లీ ఇన్ని దశాబ్దాల తరవాత లూనా 25 మిషన్‌తో సక్సెస్ అయ్యి గట్టిగా బదులివ్వాలని చూసింది ఆ దేశం. కానీ...ఈ సారి కూడా విఫలమైంది. 1957లో రష్యా తొలి శాటిలైట్ Sputnik-1 ని ప్రయోగించింది. అప్పటి సోవియట్ కాస్మొనాట్ యురి గగారిన్ (Yuri Gagarin)1961లో అంతరిక్షానికి వెళ్లారు. స్పేస్‌లోకి వెళ్లిన తొలి ఆస్ట్రోనాట్ ఈయనే. దాదాపు 50 ఏళ్ల క్రితం ఆపేసిన చంద్రుడిపై అన్వేషణను లూనా 25తో మళ్లీ రష్యా మొదలుపెట్టింది. కేవలం 11 రోజుల్లోనే చంద్రుడిపై రష్యా దిగడానికి ప్లాన్ చేసింది. ఇక భారత్ చేపట్టిన చంద్రయాన్ 3 ఆఖరిదశలో ఉన్న సంగతి తెలిసిందే. ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ చంద్రుడికి మరింత దగ్గర అయి దక్షిణ ధ్రువంపై దిగడానికి రెడీ అవుతోంది. అన్ని సవ్యంగా జరిగితే ఆగస్టు 23 సాయంత్రం సమయంలో చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగాల్సి ఉంది. ఈ క్షణాల కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చేస్తోంది. ఈ మిషన్ నుంచి కొంత ప్రాథమిక సమాచారం అందిందని, దాన్ని పరిశీలిస్తున్నామని రష్యా స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. చంద్రుడి జీమన్ క్రాటర్కి సంబంధించిన ఫొటోలనూ షేర్ చేసింది.
Also Read: Chandrayaan 3 Landing: జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ డేట్, టైమ్ ఫిక్స్ చేసిన ఇస్రో
Khalistani Issue: ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌కు లష్కరే తోయిబాతో సంబంధాలు?
Disease X: దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో మహమ్మారి, 5 కోట్ల మంది ప్రాణాలు బలి!
మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్! సర్వేల్లో బైడెన్ కన్నా ఎక్కువ పాయింట్స్
India Canada News: భారత్‌తో బంధం మాకెంతో కీలకం, కానీ.. - కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్
Tesla Optimus : 'నమస్తే', యోగా చేసిన టెస్లా రోబో ఆప్టిమస్
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
/body>