అన్వేషించండి

Pak Power Bills: పాక్‌ను కుదిపేస్తున్న పౌర నిరసనలు, అధిక విద్యుత్ బిల్లులపై ఆందోళనలు

Pak Power Bills: విద్యుత్ బిల్లులపై పాకిస్థాన్ వ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి.

Pak Power Bills: అధిక విద్యుత్ బిల్లులపై ఆగస్టు 3వ తేదీన పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మొదలైన నిరసనలు క్రమంగా పాకిస్థాన్ అంతటా దావానలంలా వ్యాపించాయి. పలు నగరాలు, పట్టణాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల భారీ ధరల పెరుగుదలతో పీకల్లోతు కష్టాలు పడుతున్న సామాన్యులపై ఈ విద్యుత్ గుదిబండ మోపడంతో వారిలో ఓపిక నశించి రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు.  నిరసనల తీవ్రత కారణంగా పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ అత్యవసర సమావేశం నిర్వహించిన 48 గంటల్లో పరిష్కారం కనుక్కోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 

3 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని ఆమోదించే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి విధించిన కఠినమైన షరతుల వల్ల పాక్ లో ద్రవ్యోల్బణంలో విపరీతంగా పెరిగిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పూట గడవడం కూడా గగనంలా మారింది. అలాంటి సమయంలో కరెంటు ఛార్జీల పెంపు సమస్యను తీవ్రతరం చేసింది. దీంతో ఓపిక నశించిన పౌరులు.. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. పాక్ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అలాగే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తీవ్రమైన కరెంటు కోతలు వేధిస్తున్నాయి. అధిక కరెంటు బిల్లులపై నిరసనగా రోడ్లపైకి వస్తున్న ప్రజలు.. ఇతర సమస్యలపైనా గళం విప్పుతున్నారని చరిత్రకారుడు అమ్మర్ అలీ జాన్ చెప్పుకొచ్చారు. 

రాజకీయ అస్థిరత, నిరంకుశత్వం, సామాజిక వైరుధ్యాలు, ప్రకృతి విపత్తులతో ప్రజల జీవితం అగమ్యగోచరంగా మారిందని, సామాన్యులను అన్ని వైపుల సమస్యలు వేధిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అధిక విద్యుత్ బిల్లులు ఆ సమస్యలకు ఆజ్యం పోసి, ప్రజలను రోడ్లపైకి వచ్చి నిరసనలు చేసేలా ప్రేరేపించిందని పంజాబ్ యూనివర్సిటీ హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అమ్మర్ అలీ తెలిపారు. 

Also Read: UP Teacher: 'నేను తప్పు చేశాను, కానీ అందులో మతపరమైన విద్వేషమేమీ లేదు'

ఆగస్టు 3వ తేదీన పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ప్రారంభమైన నిరసనలు కరాచీ, ఖైబర్ వరకు వ్యాపించాయని చెబుతున్నారు. ప్రజలు తమ నెలవారీ ఆదాయంలో 20 నుంచి 50 శాతం వరకు విద్యుత్ బిల్లులు కట్టాల్సిన దుస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి బిల్లుల ఫోటోలను సోషల్ మీడియాల్లో పోస్టు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కరాచీ, పెషావర్, రావల్పిండిలో సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పౌరులు రోడ్లపైకి వచ్చి విద్యుత్ బిల్లులను తగలబెడుతున్నారు. ప్రజలు తమ విద్యుత్ బిల్లులను తగలబెడుతున్న వీడియోను నేషనల్ ఈక్వాలిటీ పార్టీ జమ్మూ కాశ్మీర్ గిల్గిత్ బాల్టిస్థాన్ అండ్ లడఖ్ (NEPJKGBL) ఛైర్మన్ సజ్జాద్ రాజా షేర్ చేశారు. గుజ్రాన్ వాలాలో ఆందోళనకారుల నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. గుజ్రాన్ వాల్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ కార్యాలయాన్ని చుట్టుముట్టి దాడి చేశారు. నరోవల్, అటాక్, సర్గోధా, హరిపూర్ సహా అనేక నగరాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget