అన్వేషించండి

Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో అంతర్గత కుట్రలు - మునీర్‌కు వ్యతిరేకమని మాజీ చీఫ్ పై దాడి జరిగినట్లుగా అనుమానాలు

Military Bajwa injury: పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా పరిస్థితి విషమంగా ఉంది.రిటైరైనా ఆయన మునీర్ కు వ్యతిరేకంగా ఓ గ్రూపును నడుపుతున్నారు

Pakistan internal military clash: పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా   ఆసుపత్రిలో చేరడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద మిస్టరీగా మారింది. అధికారికంగా ఇది ఒక సాధారణ ప్రమాదమని చెబుతున్నప్పటికీ, దీని వెనుక పాక్ సైన్యంలోని అంతర్గత కుట్రలు ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.  

బాత్‌రూమ్‌లో ప్రమాదం.. ఐసీయూలో బాజ్వా 

పాకిస్థాన్ మిలిటరీ మీడియా వింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, రావల్పిండిలోని తన నివాసంలో జనరల్ బాజ్వా తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో బాత్‌రూమ్‌లో జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆయన  కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్  లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారని  ప్రకటించారు. ఆయనకు అనేక రకాల పరీక్షలు నిర్వహించినట్లు, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన బంధువులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

 ప్రమాదమా? కుట్రనా? - ఇంటెలిజెన్స్ అనుమానాలు 

అయితే, ఇంటెలిజెన్స్ వర్గాలు ,  సోషల్ మీడియాలో ఈ ఘటనపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒక మాజీ ఆర్మీ చీఫ్, అత్యంత భద్రత ఉండే నివాసంలో ఇలాంటి ప్రమాదానికి గురవ్వడం వెనుక ఏదో మిస్టరీ ఉందనే చర్చ నడుస్తోంది. పాకిస్థాన్ సైన్యంలోని ప్రస్తుత నాయకత్వానికి, బాజ్వా వర్గానికి మధ్య నెలకొన్న  అంతర్గత విభేదాల కారణంగానే ఇది జరిగి ఉండవచ్చని కొన్ని వర్గాలు అనుమానిస్తున్నాయి. బాజ్వాను రాజకీయంగా లేదా భౌతికంగా పక్కన పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ  ప్రమాదం జరిగిందా? అన్న కోణంలో చర్చ సాగుతోంది.  

 సైనిక వర్గాల్లో చీలిక 

రిటైర్మెంట్ తర్వాత కూడా బాజ్వా పాక్ రాజకీయాల్లో,  సైనిక నిర్ణయాల్లో తెరవెనుక చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వర్గానికి, బాజ్వా అనుకూల వర్గానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని పాకిస్థాన్ రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. గతంలో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ సమయంలో సైన్యంలో వచ్చిన చీలికలు ఇంకా కొనసాగుతున్నాయని, బాజ్వాపై జరిగిన ఈ  దాడి  ఆ అంతర్గత పోరుకు పరాకాష్ట అని కొందరు వాదిస్తున్నారు. పాకిస్థాన్ సైన్యం తన అంతర్గత విషయాలను ఎప్పుడూ అత్యంత రహస్యంగా ఉంచుతుంది. గతంలో కూడా పలువురు ఉన్నతాధికారుల మరణాలు ప్రమాదాలుగానే రికార్డు అయ్యాయి. బాజ్వా విషయంలో కూడా ప్రభుత్వం , సైన్యం  ఇది సాధారణ ప్రమాదం అని నొక్కి చెబుతున్నాయి. కానీ, బాజ్వా వంటి కీలక వ్యక్తి విషయంలో బయటకు చెప్పని నిజాలు ఏవైనా ఉన్నాయా అనేది ఇప్పట్లో తేలే అవకాశం కనిపించడం లేదు.              


 

టాప్ హెడ్ లైన్స్

US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget