Bangladesh Results: బంగ్లాదేశ్‌లో ఖలీదా జియా కుమారుడే కాబోయే ప్రధానమంత్రి - గెలిచిన వెంటనే ఇండియాకు ధ్యాంక్స్ !
Bangladesh : బంగ్లాదేశ్ లో ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

Khaleda Zia son to be the next Prime Minister of Bangladesh: బంగ్లాదేశ్‌లో 2024 తిరుగుబాటు తర్వాత జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ( అఖండ విజయం సాధించింది. మొత్తం 300 స్థానాలకు గాను, బిఎన్‌పి , దాని మిత్రపక్షాలు 200లకు పైగా స్థానాల్లో విజయం సాధించి, రెండు దశాబ్దాల తర్వాత తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. మరోవైపు, అతిపెద్ద ఇస్లామిక్ పార్టీ అయిన జమాత్-ఏ-ఇస్లామి కూటమి సుమారు 77 స్థానాలు గెలిచి రెండో స్థానంలో నిలిచింది.
ఈ చారిత్రాత్మక విజయంపై భారత్ సానుకూలంగా స్పందించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తారిఖ్ రెహ్మాన్‌కు అభినందనలు తెలుపారు. దీనిపై బిఎన్‌పి స్పందిస్తూ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది. రాబోయే కొత్త ప్రభుత్వంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆ పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తారిఖ్ రెహ్మాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కోరారు.
🚨 𝗝𝗨𝗦𝗧 𝗜𝗡: Will the Bangladesh Nationalist Party (BNP) win the Bangladesh parliamentary election by 9% or more?
— PolySage (@polys4ge) February 13, 2026
🎲 Market odds:
🟢 YES: 98% (+34%)
👇 https://t.co/bSsWpLOLbW
ఈ ఎన్నికల ఫలితాలపై భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ ఎన్నికలను ఒక ప్రహసనం గా అభివర్ణించారు. తన పార్టీ అవామీ లీగ్‌ను పోటీ చేయకుండా నిషేధించారు. ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారని ఆమె విమర్శించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, మధ్యంతర ప్రభుత్వ నిర్ణయాలను ఆమె తప్పుబట్టారు. అటు జమాత్-ఏ-ఇస్లామి పార్టీ కూడా ఎన్నికల ప్రక్రియ సమగ్రతపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని ప్రకటన విడుదల చేసింది.
I convey my warm congratulations to Mr. Tarique Rahman on leading BNP to a decisive victory in the Parliamentary elections in Bangladesh.
— Narendra Modi (@narendramodi) February 13, 2026
This victory shows the trust of the people of Bangladesh in your leadership.
India will continue to stand in support of a democratic,…
పాకిస్థాన్ వంటి దేశాలు బిఎన్‌పి విజయానికి అభినందనలు తెలిపాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తారిఖ్ రెహ్మాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ ఈ ఎన్నికలను నవ బంగ్లాదేశ్ వైపు సాగే అపూర్వ ప్రయాణం గా అభివర్ణించారు. ఏదేమైనా, ఈ ఫలితాలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికాయని విశ్లేషకులు భావిస్తున్నారు.























