అన్వేషించండి

Chinese Microwave Weapon: శక్తివంతమైన మైక్రోవేవ్‌ వెపన్ తయారు చేసిన చైనా! శత్రువుల కమ్యూనికేషన్ వ్యవస్థ మాడిపోవాల్సిందే!

Chinese Microwave Weapon: గన్‌పౌడర్, బాంబులు లేదా షెల్స్‌తో పని లేకుండా విధ్వంసం సృష్టించే ఆయుధాన్ని చైనా అభివృద్ధి చేసింది. ఇది చాలా శక్తివంతమైంది, అది శాటిలైట్‌లను కూడా నాశనం చేయగలదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చైనా శక్తివంతమైన మైక్రోవేవ్ ఆయుధం అభివృద్ధి చేసింది.
  • ఈ ఆయుధం స్టార్‌లింక్ ఉపగ్రహాలను డీ-లింక్ చేయగలదు.
  • తైవాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఆయుధం చర్చనీయాంశమైంది.
  • చైనా ఈ ఆయుధాన్ని వివిధ వేదికలపై ప్రయోగించగలదు.

Chinese Microwave Weapon: ఆయుధ ప్రపంచంలో చైనా సాధించిన విజయాలతో అమెరికా, యూరప్ సహా మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. గన్‌పౌడర్, బాంబులు లేదా షెల్స్ లేకుండా లక్ష్యాలను సునాయాశంగా నాశనం చేయగల ఆయుధాన్ని అభివృద్ధి చేసినట్లు చైనా ప్రకటించంది. చైనా శాస్త్రవేత్తల చెప్పిన ప్రకారం, ఈ ఆయుధం చాలా శక్తివంతమైంది, ఇది అంతరిక్షంలో మోహరించిన ఉపగ్రహాలను నాశనం చేయగలదు. దీనిని స్టార్‌లింక్ కిల్లర్ అని కూడా పిలుస్తారు, ఇది ఎలాన్ మస్క్  శాటిలైట్‌ను సైతం ధ్వంసం చేయగలదు.  మన ఇంటి మైక్రోవేవ్‌ ఓవెన్‌ ఆహారాన్ని వేడి చేసినట్టు,ఇది ఉపగ్రహాల సిస్టమ్‌ను వేడి చేసి నాశనం చేస్తుంది. 

చైనాకు చెందిన ఇన్విజిబుల్ హంటర్

చైనా ఒక హై-పవర్ మైక్రోవేవ్ (HPM) ఆయుధాన్ని అభివృద్ధి చేసింది, దీనిని శాస్త్రవేత్తలు ఇన్విజిబుల్ హంటర్ అని పిలుస్తారు. చైనా మీడియా, రీసెర్చ్ జర్నల్స్‌ ప్రకారం, ఈ వ్యవస్థ యాంటీ శాటిలైట్‌ క్షిపణులు ఉపయోగించకుండానే ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ స్టార్‌లింక్ ఉపగ్రహ నెట్‌వర్క్‌ను డీ-లింక్ చేయగలదు. ఇది 20 గిగావాట్ల వరకు శక్తిని అందించగల కాంపాక్ట్ డ్రైవర్‌గా చెబుతున్నారు. భూమి, సముద్రం, గాలి లేదా అంతరిక్షం వంటి ఏ ప్లాట్‌ఫామ్ నుంచి అయినా దీన్ని లాంచ్ చేయవచ్చ. 

తైవాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో చైనా చేసిన పని చర్చనీయాంశమవుతోంది. ఏదైనా సంక్షోభం తలెత్తితే స్టార్‌లింక్, అమెరికా, దాని మిత్రదేశాల కమ్యూనికేషన్లు, నిఘా వ్యవస్థలతో ప్రమాదం ఉంటుందని బీజింగ్ భయపడుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో స్టార్‌లింక్ పాత్ర సైనిక వ్యూహకర్తల దృష్టిని కూడా ఆకర్షించింది. ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన వెంటనే, ఎలాన్ మస్క్ ఉక్రెయిన్ అధ్యక్షుడి అభ్యర్థన మేరకు స్టార్‌లింక్ సేవను యాక్టివేట్ చేశారు. ఆ టైంలో ఉక్రెయిన్‌కు కమ్యూనికేషన్ వ్యవస్థలో మంచి ఫేవర్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే విషయంలో చైనా అనుమానపడుతోంది. 

రష్యా సైనస్-7 కంటే ఇది ఎంత శక్తివంతమైనది?

యురేషియన్ టైమ్స్‌లోని వచ్చిన ఒక నివేదిక ప్రకారం, చైనాలోని జియాన్‌లోని నార్త్‌వెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ (NINT) శాస్త్రవేత్తల బృందం TPG1000Cs అనే డ్రైవర్‌ను అభివృద్ధి చేసింది, దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి కాంపాక్ట్ హై-పవర్ మైక్రోవేవ్ డ్రైవర్‌గా అభివర్ణిస్తున్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ పరికరం ఒక నిమిషం పాటు 20 గిగావాట్ల పవర్‌ను అందించగలదు. ఒకే సెషన్‌లో 3,000 వరకు హై ఎనర్జీ పల్స్‌స్‌ను జనరేట్ చేస్తుంది. 

రష్యాకు చెందిన సైనస్-7 వ్యవస్థ సుమారు 10 టన్నుల బరువు కలిగి, కేవలం 1 సెకను మాత్రమే పనిచేసి ఒకసారి సుమారు 100 పల్స్‌స్‌ను అందించగలదని తెలుస్తోంది. TPG1000Cs సుమారు 4 మీటర్ల పొడవు, సుమారు 5 టన్నుల బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ట్రక్కులు, యుద్ధనౌకలు, విమానాలు లేదా ఉపగ్రహ ప్లాట్‌ఫారమ్‌లపై అమర్చవచ్చు. ఈ వ్యవస్థ ఇప్పటివరకు 200,000 కంటే ఎక్కువ ఆపరేషనల్ పల్స్‌స్‌ను సేకరించిందని అంటున్నారు. మరిన్ని ప్లాట్‌ఫామ్‌లపై లాంచ్‌ చేసేందుక మార్గాన్ని సుగమం చేసిందని NINT బృందం చెబుతోంది.

చైనా స్టార్‌లింక్-కిల్లర్ ఆయుధ అభివృద్ధి 

TPG1000Cs వంటి వ్యవస్థలను అంతరిక్షంలో మోహరించినట్లయితే, వాటి మాయా దాడులు మరింత ప్రాణాంతకంగా ఉంటాయని చైనా నివేదికలు పేర్కొన్నాయి. మైక్రోవేవ్ ఆయుధాల ముఖ్య ప్రయోజనం ఏమిటంటే అవి సాంప్రదాయ ఆయుధాల వలె బయటకు కనిపించే విధ్వంసాలను సృష్టించవు. ఎలక్ట్రానిక్ వ్యవస్థలను డీ-లింక్ చేసి కనిపించని నష్టాన్ని కలిగిస్తాయి.

చైనా వ్యూహంలో TPG1000Cs, స్టార్‌లింక్-కిల్లర్ ఆయుధాల అభివృద్ధి భాగమని చెబుతారు. శాంతి సమయంలో నిఘా, నిఘా కోసం స్టార్‌లింక్ వంటి నెట్‌వర్క్‌లను ఉపయోగించవచ్చని, యుద్ధ సమయంలో, అవి చైనాకు చెందిన కీలకమైన సైనిక, పౌర ఆస్తులను రక్షించడంలో సహాయపడతాయని చైనా సైనిక నిపుణులు విశ్వసిస్తున్నారు.

Frequently Asked Questions

చైనా అభివృద్ధి చేసిన హై-పవర్ మైక్రోవేవ్ (HPM) ఆయుధం పేరు ఏమిటి?

చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ హై-పవర్ మైక్రోవేవ్ ఆయుధాన్ని 'ఇన్విజిబుల్ హంటర్' అని పిలుస్తారు. ఇది ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఉపగ్రహాలను ధ్వంసం చేయగలదు.

చైనా HPM ఆయుధం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

ఈ ఆయుధాన్ని 'స్టార్‌లింక్ కిల్లర్' అని కూడా పిలుస్తారు. అంతరిక్షంలో మోహరించిన ఉపగ్రహాలను, ముఖ్యంగా స్టార్‌లింక్ నెట్‌వర్క్‌ను నాశనం చేయడానికి దీనిని అభివృద్ధి చేశారు.

చైనా HPM ఆయుధం రష్యా సైనస్-7 కంటే ఎంత శక్తివంతమైనది?

చైనా అభివృద్ధి చేసిన TPG1000Cs, 20 గిగావాట్ల శక్తిని అందిస్తుంది, 3,000 పల్స్‌లను జనరేట్ చేస్తుంది. రష్యా సైనస్-7 100 పల్స్‌లను మాత్రమే అందిస్తుంది మరియు బరువు ఎక్కువ.

చైనా HPM ఆయుధాల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?

ఈ ఆయుధాలు సాంప్రదాయ ఆయుధాల వలె బయటకు కనిపించే విధ్వంసం కలిగించవు. ఇవి ఎలక్ట్రానిక్ వ్యవస్థలను డీ-లింక్ చేసి, కనిపించని నష్టాన్ని కలిగిస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget