Longest Walking Route on Earth : సముద్రం దాటకుండా భూమిపై నడిచే అతి పొడవైన దారి.. 16 దేశాల గుండా వెళ్లే రోడ్డు మార్గమిదే
Longest Continuous Walking Path : భూమిపై నడవగలిగే అతి పొడవైన మార్గం ఉంది. అయితే దీనిని సముద్రం దాటకుండానే వెళ్ళవచ్చు. మరి అది ఎంత దూరం, ఎన్ని రోజుల్లో చేరుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Longest Walkable Route in the World : కేవలం నడుచుకుంటూ భూమిపై ఎక్కువ దూరం ప్రయాణించాలనుకుంటే ఓ దారి ఉందని తెలుసా మీకు? అవును ఓడలు, కార్లు, ఇతర ట్రాన్స్పోర్ట్స్ లేకుండా.. భూమిపై నడిచేందుకు అతి పొడవైన మార్గం ఒకటి ఉందట. గణితం, భూగోళ శాస్త్రం ఆధారంగా ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది. సముద్రాన్ని దాటకుండా, నిరంతరం నడుచుకుంటూ ఈ మార్గంలో ప్రయాణించవచ్చట. ఇంతకీ ఆ ప్రదేశం ఏంటి? దాని దూరం ఎంత? ఎంత సమయంలో నడవవచ్చు? ఎలాంటి సవాళ్లు ఉంటాయి? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేద్దాం.
భూమిపై నడవడానికి అతి పొడవైన మార్గం
శాస్త్రవేత్తలు, భూగోళ శాస్త్ర నిపుణుల ప్రకారం.. భూమిపై నడవడానికి అతి పొడవైన నేరు మార్గం ఉంది. అది దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి ప్రారంభమై రష్యాలోని సుదూర తూర్పు నగరమైన మగడాన్ వరకు వెళుతుంది. ఈ మార్గం దాదాపు 14,000 మైళ్లు లేదా 22,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఈ మొత్తం ప్రయాణంలో ఎక్కడా సముద్రాన్ని దాటవలసిన అవసరం లేదు. ఒక వ్యక్తి నిరంతరం భూమిపై నడుస్తూ ఈ దూరాన్ని చేరుకోవచ్చు.
ఎన్ని దేశాల గుండా వెళుతుందంటే..
ఈ పొడవైన నడక మార్గం దాదాపు 16 దేశాల గుండా వెళుతుంది. ఆఫ్రికా నుంచి ప్రారంభమై.. ఈ ప్రయాణం మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, తరువాత రష్యాకు చేరుకుంటుంది. వివిధ దేశాల సరిహద్దులు, సంస్కృతులు, భౌగోళిక పరిస్థితులు ఈ యాత్రను మరింత సవాలుగా మారుస్తాయి. ప్రతి దేశంలో వాతావరణం, భూమి నిర్మాణం, భద్రతా పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఇది ఈ ప్రయాణాన్ని శారీరకంగానే కాకుండా మానసికంగా పరీక్ష పెడుతుంది.
ఎంత సమయం పడుతుందంటే..
నివేదికల ప్రకారం ఓ వ్యక్తి ఆగకుండా నిరంతరం నడుస్తూ ఉంటే.. ఈ ప్రయాణం దాదాపు 595 రోజుల్లో పూర్తవుతుంది. కానీ ఇది కేవలం సైద్ధాంతిక అంచనా మాత్రమే. వాస్తవానికి ఒక వ్యక్తి విశ్రాంతి, ఆహారం, నిద్ర, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణ పరిస్థితులలో ఈ యాత్ర దాదాపు 3 సంవత్సరాల వరకు పట్టవచ్చు. ఒక వ్యక్తి రోజుకు సగటున 15 కిలోమీటర్లు మాత్రమే నడవగలిగితే.. అతను ఈ దూరాన్ని చేరుకోవడానికి 15 నుంచి 20 సంవత్సరాల వరకు పట్టవచ్చు.
భూమి చుట్టుకొలత, నడక పరిమితి
భూమి చుట్టుకొలత.. అంటే భూమధ్యరేఖ చుట్టూ ఉన్న మొత్తం పొడవు దాదాపు 40,075 కిలోమీటర్లు. ఒక వ్యక్తి భూమిని మొత్తం నడవాలనుకుంటే.. అతనికి చాలా సంవత్సరాలు పడుతుంది. అతను రోజుకు ఎంత దూరం నడుస్తాడు, మార్గంలో ఎన్నిసార్లు ఆగుతాడు అనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది.
























