అన్వేషించండి

Kabul Attack Warning: 24-36 గంటల్లో మరో ఉగ్ర దాడి జరిగే ఛాన్స్.. బైడెన్ హెచ్చరిక, కీలక ఆదేశాలు

అఫ్గానిస్థాన్‌లో ఇటీవల పేలుళ్లకు కారణమైన ఐసిస్-కే ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా అమెరికా ప్రతీకార డ్రోన్ దాడులు జరిగిన కొద్ది గంటలకే జో బైడెన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అఫ్గానిస్థాన్‌లో కల్లోల పరిస్థితుల వేళ కాబుల్ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా మరో ఉగ్ర దాడి జరిగే అవకాశం మెండుగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. మరో 24 నుంచి 36 గంటల వ్యవధిలో ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందని కాబట్టి కాబుల్ ఎయిర్ పోర్టును పౌరులంతా ఖాళీ చేయాలని బైడెన్ సూచించారు. అఫ్గానిస్థాన్‌లో ఇటీవల పేలుళ్లకు కారణమైన ఐసిస్-కే ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా అమెరికా ప్రతీకార డ్రోన్ దాడులు జరిగిన కొద్ది గంటలకే జో బైడెన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. శనివారం (స్థానిక కాలమానం) జో బైడెన్ వైట్ హౌజ్‌లో విలేకరులతో మాట్లాడారు.

‘‘అఫ్గానిస్థాన్‌లో క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరీ ప్రమాదకరంగా తయారవుతోంది. కాబుల్ ఎయిర్ పోర్టు వద్ద టెర్రరిస్టు దాడుల అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వచ్చే 24 నుంచి 36 గంటల్లో ఉగ్ర దాడి జరగవచ్చని మా సైన్యం నుంచి విశ్వసనీయ సమాచారం ఉంది.’’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.

అంతేకాక, కాబుల్‌లోని అమెరికన్ ఎంబసీ కూడా ఆదివారం ఉదయం ఈ హెచ్చరిక జారీ చేసింది. కాబుల్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో బాంబు దాడి జరగొచ్చని విశ్వసనీయ సమాచారం ఉందని, కాబట్టి పౌరులందరూ కాబుల్ ఎయిర్ పోర్టు పరిసరాలను ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. ‘‘బాంబు దాడికి సంబంధించి కచ్చితమైన, విశ్వసనీయ సమాచారం ఉన్నందువల్ల అమెరికా పౌరులు కాబుల్ ఎయిర్ పోర్టులోని సౌత్ గేట్ సహా వాయువ్యం వైపు ఉన్న పంజ్ షీర్ పెట్రోల్ పంపు, ఇతర పరిసరాల నుంచి తక్షణమే వెళ్లిపోవాలి.’’ అని అఫ్గాన్‌లోని అమెరికన్ ఎంబసీ ప్రకటన విడుదల చేసింది.

Also Read: India-Afghan Relations: తాలిబన్ల పాలన భారత్ కు నష్టమే!.. అఫ్గాన్ లో భారత్ ఖర్చు పెట్టిన సొమ్మెంతో తెలుసా!

గురువారం సాయంత్రం కాబుల్ విమానాశ్రయంలో ఐసిస్-కే జరిపిన దాడుల్లో 180 మందికిపైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. వారిలో 13 మంది అమెరికా రక్షణ సిబ్బంది ఉన్నారు. అయితే, ఉగ్రవాదుల స్థావరాలపై డ్రోన్‌ దాడులను ఇంతటితో ఆపబోమని, మరిన్ని దాడులు చేస్తామని ఐసిస్-కే ఉగ్రవాదులకు బైడెన్‌ హెచ్చరిక చేశారు. తమ పౌరుల ప్రాణాలను బలిగొన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్ద తమ సైనికుల మరణాలకు ప్రతీకారంగా అమెరికా దాడికి దిగిన విషయం తెలిసిందే. అఫ్గానిస్థాన్‌లో నంగహర్‌ ప్రావిన్స్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌-ఖోరసాన్‌ స్థావరాలపై శుక్రవారం మానవ రహిత డ్రోన్లతో దాడులు నిర్వహించింది. ఇందులో ఆత్మాహుతి దాడికి సూత్రధారి సహా మరో ఉగ్రవాది హతమైనట్టు అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది.

Also Read: Gold-Silver Price: పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో మరింతగా.. తాజా ధరలు ఇలా..

Also Read: Afghanistan Drone Attack: కాబుల్ పేలుళ్లపై అమెరికా ప్రతీకారం.. ఆ శిబిరాలపై యూఎస్ డ్రోన్ దాడులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
AP Inter Exams: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Romantic Life : శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
Embed widget