అన్వేషించండి

Iran Israel War: ఇజ్రాయెల్ పై ఇరాన్ యుద్ధానికి దిగితే ఏం జరుగుతుంది? ముంచుకొస్తున్న 3వ ప్రపంచ యుద్ధం

Israel Iran War: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధమేఘాలు ఆవరించాయి. ఏ క్షణంలో ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందోనని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇరాన్ భూభాగంలో హమాస్ నేత ఇస్మాయిల్ హనియా హత్య తర్వాత మిడిల్ ఈస్ట్ ప్రాంతం పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా మారింది. యుద్ధమేఘాలు ఆవరించాయి. నేడో, రేపు యుద్ధం ప్రారంభం అవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు ప్రతీకారంగా దాడులు తప్పవని  ఇరాన్ ప్రకటించింది. అందుకు తగ్గట్టుగా తన మిత్రదేశాలకు ఇరాన్ యుద్దానికి దిగుతున్నట్లు సంకేతాలు పంపింది. మరోవైపు మాపై దాడి చేస్తే మా ప్రతిదాడి కనీవిని ఎరుగని రీతిలో ఉంటుందని ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. ఇక అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేస్తే అడ్డుకుని తీరతామని చెప్పడమే కాకుండా అందుకు తగినట్లుగా తన భారీ యుద్ధనౌక అబ్రహం లింకన్ తో పాటు అత్యాధునిక సబ్ మెరైన్లు ను మిడిల్ ఈస్ట్ కు పంపంది.  ఇవన్నీ చూస్తుంటే ఏ క్షణమైనా  ఇరాన్  ఇజ్రాయెల్ పై దాడి చేస్తుందన్న వార్తలకు బలం చేకూరుతుంది.

ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి  చేయగలదా…?
ఇజ్రాయెల్ చిన్న దేశమైనా టెక్నాలజీ పరంగా చూస్తే ఇరాన్ కన్నా చాలా ముందంజలో ఉంది. ఇజ్రాయెల్ అణుశక్తి కలిగిన దేశం. ఇరాన్ అణుశక్తి విషయంలో  అంతర్జాతీయంగా భిన్నాభిప్రాయాలున్నాయి. ఇరాన్ కు అణు బాంబు తయారు చేయకుండా పలుమార్లు ఇరాన్ శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది.  అంతే కాకుండా అణు రియాక్టర్లపై దాడులు చేసి పనికి రాకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇరాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఇజ్రాయెల్ అందుకు పది రెట్లు  భీకరమైన దాడికి తెగబడే అవకాశం ఉంది. ఈ విషయం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖోమైనీతో పాటు ఇరాన్ మిలిటరీ పెద్దలకు తెలిసిందే. 

గత ఏడాది ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడిలో 1400 మంది మరణించారు. వందల సంఖ్యలో బందీలను హమాస్ చేజిక్కుంచుకుంది. దీంతో  ఇజ్రాయెల్ అప్పటి నుండి పాలస్తీనాపై చేస్తోన్న యుద్ధంలో వేలాది మంది పాలస్తీనా పౌరులు చనిపోయారు. హమాస్ కమాండర్లు, హమాస్ ఫైటర్లు చనిపోయారు. పాలస్తీనాలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. అత్యంత దుర్భర పరిస్థితుల్లోకి పాలస్తీనీయులు నెట్టబడ్డారు. ఇప్పటికీ ఆ యుద్దం ఆపేది లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది.  అలాంటికి  ఇరాన్ దాడికి దిగితే ఇజ్రాయెల్ అదే రీతిలో భీకర ప్రతీకార దాడులు చేసే పరిస్థితి.  

మొస్సాద్ యాక్షన్  స్టైల్ ఇదే...
ఇప్పటివరకు ఇజ్రాయెల్ యుద్ద తంత్రం గమనిస్తే పంటికి పన్ను.. కంటికి కన్ను అన్న రీతిలో వ్యవహరిస్తోంది. ప్రపంచంలో ఏ మూల  ఇజ్రాయెల్ పై దాడికి కుట్ర జరిగినా... అక్కడకు వెళ్లి మరీ ఆ కుట్రదారులను మట్టుబెట్టడం ఇజ్రాయేల్ స్టైల్ ఆఫ్ రియాక్షన్ గా మిలటరీ లెసన్స్ లో చెబుతారు. మొస్సాద్ అనే గూఢాచార సంస్థ ముఖ్యమైన పనే అది. హమాస్ చీఫ్ ఇస్మాయెల్ హనియాను, హెజ్బోల్లా మిలటరీ కమాండర్ ఫాద్ షుక్రు లను ఇదే స్టైల్లో మట్టుబెట్టింది.  వీరిద్దరినే కాదు  పాకిస్థాన్ అణు బాంబు తయారీ వార్త తెలియగానే మొస్సాద్ పాక్ పై దాడులకు సన్నాహాలు చేసింది. పాకిస్థాన్ అణు బాంబు తయారు చేస్తే అది తన చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలకు ఆ పరిజ్ఞానం అందిస్తుందన్న భయం ఇజ్రాయెల్ ది. ఆ రియాక్టర్లపై దాడి చేసేందుకు ప్లాన్ సిద్దం చేసింది. తమ యుద్ధ విమానాలకు అవసరమైన ఫ్యూయల్ ను భారత్ లో నింపుకుని వెళ్లేందుకు సాయం మన దేశం సాయం కోరింది. అయితే అప్పటి అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మన ప్రభుత్వ పెద్దలు అందుకు సాయం అందించలేదని , లేకపోతే అప్పుడే పాక్ రియాక్టర్లు నేల మట్టం అయ్యేవి.  ఇలా తన దేశానికి ముప్పు  ఎక్కడ ఉన్నా, వారి కన్నా ముందే ఎదురు దాడి  చేసి ఆ దేశ మిలట్రీని న్యూట్రలైజ్ చేయడం ఇజ్రాయెల్ డిఫెన్స్  స్ట్రాటజీ. ఇలాంటి మిలట్రీ పవర్ కల ఇజ్రెయేల్ పై ఇరాన్ హమాస్, లెబనాన్ లోని హెజ్బుల్లా, యెమెన్ లోని హౌతీ తీవ్రవాదులతో కలిసి దాడులు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయన్న అందోళన ఇప్పుడు  ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతుంది.

ఇరాన్ ఢిఫెన్స్ లో పడిందా…?
హమాస్ చీఫ్ హనియాపై హత్య జరిగి చాలా రోజులయింది. అయినా ఇరాన్ ఎందుకు ప్రతీకార దాడుకు ఎందుకు దిగలేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే తాను దాడి చేసే దేశం ఇజ్రాయెల్. ఒక్క సారి యుద్దం తాను ప్రారంభిస్తే దాన్ని ముగించే ఆప్షన్ తన చేతిలో లేదన్న విషయం ఇరాన్ కు తెలుసు.  ఇప్పటికే అది హమాస్ తో ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్దంలో ఈ విషయం స్పష్టమైంది.  మరో వైపు  ఇరాన్ కు ఐవోసీ దేశాల నుంచి మద్ధతు లేదు. ఇజ్రాయెల్ పై దాడికి సౌదీ అరేబియా  తన గగన తలాన్ని వాడుకోవద్దని  ఇప్పటికే ఇరాన్ కు స్పష్టం చేసింది. ఇదే రీతిలో జోర్డాన్ కూడా  ఇరాన్ కు  తన అభిప్రపాయాన్ని వ్యక్తం చేసేంది.  హామాస్, హెజ్బుల్లా తీవ్రవాద సంస్థలు తప్ప ఏ దేశం ఇరాన్ కు ఏ ఇస్లామిక్ కంట్రీ స్పష్టమైన బాసట ఇవ్వలేదు. రష్యా కొంత మేరకు సాయం అందించేందుకు సిద్ధమవుతున్నా ఉక్రెయిన్ తో యుద్దం జరుగుతున్న తరుణంలో ఇరాన్ కు పూర్తి సహాయ సహాకారాలు అందించే పరిస్థితిలో  రష్యా లేదన్నది వాస్తవం.  

చైనా, ఉత్తర కొరియా వంటివి మాటల వరకు ఓకే కాని యుద్ధ క్షేత్రంలో వారి సాయం అందించడం అనేది వారి ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది తప్ప ఇరాన్ ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండదన్నది  ఇరాన్ పెద్దలకు తెలుసు. ఇదిలా ఉంటే..  ఒక్క సారి ఇజ్రాయేల్ పైదాడికి తెగబడితే.. దానికి రెండితలు ఇజ్రాయేల్ ప్రతి దాడికి దిగుతుంది.  మరో వైపు ఇజ్రాయెల్ కు అమెరికా, బ్రిటన్ సహా యూరప్ దేశాల సహకారం ఉంటుంది.  ఇజ్రాయెల్ ఇరాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడినా అమెరికా  అడ్డుపడే అవకాశం ఉండదు అన్న  అంతర్జాతీయ విశ్లేషణలు వినపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ పై దాడి తదుపరి పరిణామాలపై ఇరాన్ పదే పదే లెక్కలు వేసుకుంటోందని తెలుస్తోంది. 
Also Read: Israel Hamas War: హమాస్ మిలిటరీ చీఫ్‌ని మట్టుబెట్టిన ఇజ్రాయేల్, అధికారికంగా ప్రకటించిన సైన్యం

యుద్దం చేస్తే వినాశనం.. చేయకపోతే పరువు నష్టం
ఇక యుద్దంలో దిగితే వినాశనం తప్పదు అన్నది ఇరాన్ పెద్దలకు తెలుసు. కాని ఇప్పటికే దాడి చేసి తీరతాం అని ప్రకటనలు చేయడంతో వెనకడకు వేయని పరిస్థితి ఇరాన్ ది.  ఒక వేళ ఇజ్రాయెల్ పైదాడి చేయకపోతే ఇంట,బయట పరువు పోగొట్టుకునే పరిస్థితి ఇరాన్ ది.  ఇప్పటికే ఇజ్రాయేల్ పలు సార్లు  ఇరాన్ నడిబొడ్డున  దాడులు చేసి తన టార్గెల్ లో ఉన్న వ్యక్తులను చంపి వేసింది. అణు రియాక్టర్లపై దాడులు చేసి వారి అణు కార్యక్రమాలకు ఆటంకం కలుగజేసింది.  ఇరాన్ అణు శాస్త్రవేత్తలపై దాడులు చేసి హతమార్చింది. హమాస్ చీఫ్ ను అయితే అధ్యక్ష కార్యలయ భవనానికి సమీపంలోనే మట్టుబెట్టింది. ఇంత జరిగినా  ఏం చేయకపోతే ఇరాన్ ప్రజల ముందు పాలకులు పలుచన అయ్యే అవకాశం  ఉంది. అంతే కాదు ప్రపంచం ముందు బలహీనమైన ఇరాన్ దేశంగా ముద్రపడే  అవకాశం ఉంది.  
ఇస్లామిక్ దేశాలకు పెద్దన్నగా ఉండాలన్న ఇరాన్ వ్యూహాలకు ఇది పెద్ద దెబ్బగా పరిణమిస్తుంది. ఈ రేసులో ఉన్న సౌదీ అరేబియాకు కలిసి వస్తుంది. ఈ కారణాలతో ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ పై దాడి చేయక తప్పదు. దాడికి దిగితే మాత్రం  యుద్ద పరిణామాలు మామూలుగా ఉండవు అన్నది ఇరాన్ పాలకులకు తెలుసు.  అంతే కాదు ఇందుకు కారణామైన ఇరాన్ ముఖ్య నేతల ప్రాణాలకు ప్రమాదం లేకపోలేదు. హమాస్ చీఫ్ ను అధ్యక్ష భవనం  దగ్గరలోనే అత్యంత పటిష్టమైన ఇరాన్ రెవెల్యూషనరీ గార్డుల భధ్రత మధ్యలో ఇజ్రాయెల్ గూడాఛార సంస్థ ప్లాన్ చేసి చంపివేస్తే, ఇరాన్ చీఫ్ ఖోమైనీ సహా ఇతర నేతల ప్రాణాలను మట్టుబెట్టలేదా అన్న చర్చ ఇప్పుడు అంతర్జాతీయంగా నడుస్తోంది. ఇలాంటి అంశాలను ఇరాన్ పాలకులు గుర్తించే ఆచితూచి యుద్ధంలోకి దిగేందుకు చూస్తున్నట్లు అర్థం అవుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఇరాన్ పరువు నష్టం జరగకుండా ఇజ్రాయెల్ పై దాడికి దిగక తప్పదు. అందుకు సన్నాహాలు కూడా చేస్తోందన్న వార్తలు వినపడుతున్నాయి. ఇదే జరిగితే  రానున్న రోజుల్లో ఇది  ఇతర దేశాలను యుద్దంలోకి దిగిలే చేసే మూడో ప్రపంచ యుద్ధంగా మారనుందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget