అన్వేషించండి

Viral News: నిద్రపోయాడని ఉద్యోగం నుంచి తీసేశారు - కానీ కోర్టుకెళ్లి కంపెనీదే తప్పని నిరూపించాడు - వీడు మామూలోడు కాదు !

Employee : ఓ కంపెనీలో పని చేసే ఉద్యోగి డ్యూటీ టైంలో నిద్రపోయాడని చెప్పి ఉద్యోగం నుంచి తీసేశారు. కానీ కంపెనీదే తప్పు అని చెప్పి ఆ ఉద్దోకి కోర్టుకెళ్లాడు. కోర్టు కూడా కంపెనీదే తప్పని చెప్పింది.

Man sues company that fired him for taking a nap at work: ఉద్యోగం చేస్తూ నిద్రపోతే యాజమాన్యానికి సహజంగానే కోపం వస్తుంది. ఆ ఉద్యోగిపై కోపం ఉంటే.. హెచ్ ఆర్ వాళ్లు ఇంకో రెండు, మూడు కలిపి టెర్మినేట్ చేయమని సూచనలు చేస్తారు. ఇలా ఓ రసాయన పరిశ్రమలో పని చేస్తున్న ఉద్యోగికి టెర్మినేషన్ లెటర్ వచ్చింది. దీనికి కారణం డ్యూటీ టైంలో గంట పాటు నిద్రపోయాడని సీసీ కెమెరాలో గుర్తించడమే. అతని దగ్గర వివరణ తీసుకుని రెండు వరాల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. తాను నిద్రపోవడానికి కంపెనీనే కారణం అని అతను కోర్టుకెళ్లాడు.తన వాదనే కరెక్ట్ అని నిరూపించి కంపెనీ దగ్గర పరిహారం పొందాడు. 

ఇరవై ఏళ్ల సర్వీస్ అయినా డిస్మిస్ 

చైనాలోని  చాంగ్ అనే ఉద్యోగి  ఇరవై ఏళ్లుగా ఓ కెమికల్ కంపెనీలో పని చేస్తున్నారు. హార్డ్ వర్కర్ గా గుర్తింపు ఉంది. ఆయన ఓ రోజు ఇరవై గంట ల పాటు డ్యూటీ చేశారు. మళ్లీ వెంటనే తర్వాత రోజు డ్యూటీ కి వచ్చారు. ఆ సమయంలో ఆయన నిద్ర ఆపుకోలేక ఓ గంట సేపు నిద్రపోయాడు. సీసీ కెమెరాలు ఆ దృశ్యాలను పట్టేశాయి. హెచ్‌ఆర్ నోటీసులు జారీ చేసింది. ఆయన అందులో వివరణ కూడా..అందకు ముందు రోజు ఇరవై గంటల పాటు పని చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కంపెనీకి మ్యాన్ పవర్ తక్కువగా ఉన్నందున తాను ఇరవై గంటల పాటు పని చేయాల్సి వచ్చిందని అందుకే నిద్ర వచ్చిందని ఆయన చెప్పారు. ఆయన వివరణ తీసుకున్న రెండు వారాల తర్వాత డిస్మిస్ చేస్తూ కంపెనీ ఉత్తర్వులు ఇచ్చింది. 

Also Read:  పాకిస్థాన్‌లో బంగ్లాదేశ్ తరహా అల్లర్లు - రెచ్చిపోతున్న ఇమ్రాన్ సపోర్టర్లు - అధ్యక్షుడు పారిపోవాల్సిందేనా ?

కంపెనీతో ఒప్పందం ప్రకారం తొలగింపు

ఉద్యోగంలో చేరేటప్పుడు ఇచ్చిన ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామని దీన్ని కాదనలేని కంపెనీ స్పష్టం చేసింది. ఇది ఉద్యోగ నిబంధనల మేరకు జరిగిందని స్పష్టం చేసింది. అయితే చాంగ్ మాత్రం దీన్ని ఒప్పుకోలేదు. ఇరవై గంటలు పని చేయాలని ఒప్పందంలో చెప్పలేదని..అయినా చేయించుకున్నారని దానికి నిద్ర వస్తే.. ఉద్యోగం నుంచి తీసేస్తారా అని ప్రశ్నించారు. కానీ కంపెనీ ఒప్పుకోకపోవడంతో కోర్టుకు వెళ్లారు. 

Also Read: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు

కంపెనీదే తప్పని చెప్పిన కోర్టు 

కోర్టు ముందు కూడా తన వాదనలను ఉద్యోగి చాంగ్ గట్టిగా వినిపించారు. కంపెనీ కోసంతాను పని చేస్తే.. తన ఉద్యోగం తీసేశారని తెలిపారు. చాంగ్ వాదనలతో లేబర్ కోర్టు కూడా ఏకీభవించింది. కంపెనీ తప్పు చేసిందని చెప్పి రూ. 40లక్షల పరిహారాన్న ఇవ్వాలని ఆదేశించింది. మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటామని ఆ కంపెనీ చెప్పినా ఉద్యోగి చాంగ్ మాత్రం.. అంత అవమానించిన కంపెనీ దగ్గర తాను పని చేయబోనని చెప్పి .. పరిహారం తీసుకుని వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget