Father Love : నాన్నంటే ధైర్యం.. నాన్నంటే బలం ! బిడ్డ కళ్లలో ధైర్యం కోసం ఆ నాన్న ఏం చేశారంటే..?
బిడ్డకు బ్రెయిన్ సర్జరీ చేయించిన తండ్రి...ధైర్యంగా ఉండేందుకు అచ్చంగా కుట్లు వేసుకున్నట్లుగానే తాను హెయిర్ స్టైలింగ్ చేయించుకున్నాడు. ఇప్పుడీ ఫోటో ఇంటర్నెట్ సెన్సేషన్.
వేలు పట్టుకుని నడక నేర్పించినా.. గాల్లోకి ఎగరేసి, పడకుండా పట్టుకున్నా.. దెబ్బ తగిలి, ఏడుస్తున్నప్పుడు ధైర్యం చెప్పినా అమ్మకు తెలియకుండా ఐస్‌క్రీమ్ తినిపించినా.. అమ్మకు తెలియకుండా పాకెట్ మనీ ఇచ్చినా.. ధైర్యంగా బైక్ కీ ఇచ్చి నడుపు.. అంటూ వెనకాల కూర్చున్నా.. ఇలాంటివన్నీ.. ఆలోచించకుండా చేయగల ఒకే ఒక వ్యక్తి నాన్న. నాన్నంటే భద్రత, భరోసా, బాధ్యత.. నాన్నంటే రిలేషన్ మాత్రమే కాదు.. ఎప్పటికీ అర్థం కాని ఓ ఎమోషన్. ప్రపంచంలోని తండ్రులంతా ఒక్కటే. ఆ విషయాన్ని ఈ తండ్రి కూడా మరోసారి నిరూపించాడు.
బిడ్డను అనారోగ్యమని తెలిస్తే అల్లాడిపోతాడు తండ్రి. మళ్లీ మామూలు స్థితికి వచ్చే వరకూ కంటి మీద కునుకు ఉండదు. అలాంటిది బిడ్డకు బ్రెయిన్‌లోనే ప్రాబ్లం ఉందంటే తట్టుకోగలడా ?. ఎలాగైనా సాధారమ స్థితికి తేవాలని సర్వశక్తులు ఒడ్డుతాడు. ఆ తండ్రి అలాగే చేశాడు. బిడ్డకు బ్రెయిన్ సర్జరీ చేయించాడు. అయితే ఆ సర్జరీ చేసిన ప్రాంతం అంతా జుట్టు తీసేసి కుట్లు వేశారు. బిడ్డకు మెలకువ వచ్చి డిశ్చార్జ్ అయ్యే సమయంలో తన తలకు ఉన్న కుట్లు చూసుకుని బేలగా అయిపోకుండా ఉటుంది. అవుతుంది. అందుకే ఆ తండ్రి విభిన్నంగా ఆలోచించాడు.
అచ్చంగా బ్రెయిన్ సర్జరీ అయిన బిడ్డ తలకు ఎలా కుట్లు వేశారో అచ్చంగా అలాగే హెయిర్ స్టైలిస్ట్ దగ్గర కు వెళ్లి .. స్టైలింగ్ చేయించుకున్నాడు. బిడ్డతో పాటు తనకూ అలాగే ఉందని చూపించాడు. ఏమీ కాదు చిన్నా... నీలాగే నాకూ ఉంది. ఇద్దరికీ తగ్గిపోతుందని ధైర్యం కల్పించాడు. బిడ్డకు ధైర్యం కల్పించడానికి ఆ తండ్రి చేసిన ప్రయత్నం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ తండ్రి ప్రేమ అందర్నీ స్పందించేలా చేస్తోంది. ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్ అయింది.
The little baby had brain surgery and her dad did the same to his own hair! Made me cry! ❤️pic.twitter.com/S5VDhK8HPn
— Figen (@TheFigen) January 25, 2022
ఈ ఫోటో ఎక్కడ నుంచి వచ్చిందో.. ఆ బిడ్డ.. తండ్రులెవరో స్పష్టంగా తెలియదు. కానీ స్టైలింగ్ చేసిన హెయిర్ స్టైలిస్ట్ ఈ ఫోటోను మొదట ఇంటర్నెట్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆ తండ్రి ఎవరు.. ఆ బిడ్డ ఎవరు అని ఆరా తీయడం ఎక్కువ అయింది. వారి వివరాలు ఎప్పుడైనా బయటకు రావొచ్చు కానీ.. వారి మధ్య ప్రేమ... తండ్రి అనురాగం మాత్రం ఎప్పటికీ నిలిచిఉంటుంది. మొత్తంగా వారు ఎవరైనా కావొచ్చు కానీ.. ఓ తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో.. ఆ ఒక్క ఫోటోనే సజీవ సాక్ష్యంగా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పుడా ఫోటో ఇంటర్నెట్ హాట్ టాపిక్.