LAC Standoff: భారత్‌తో సరిహద్దు వివాదంపై చైనా కీలక వ్యాఖ్యలు
LAC Standoff: ఎల్‌ఏసీ వెంట శాంతి కోసం భారత్‌తో కలిసి పనిచేస్తున్నట్లు చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘే తెలిపారు.
LAC Standoff: భారత్‌తో సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎల్‌ఏసీ (వాస్తవాధీన రేఖ) వెంట శాంతి కోసం భారత్‌తో కలిసి పని చేస్తున్నామని చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంఘే అన్నారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించడం చైనాకు ఎంతో అవసరమన్నారు.
సింగపూర్‌లోని షాంగ్రీ-లా చర్చల్లో ఆయన ఇలా మాట్లాడారు. దక్షిణ చైనా సముద్రంతో సహా ప్రాదేశిక వివాదాలను పరిష్కరించుకునేందుకు శాంతియుత మార్గాలకు పిలుపునిచ్చారు.
అణ్వాయుధాలపై
మరోవైపు అణ్వాయుధాలపై చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘే కీలక ప్రకటన చేశారు. కొత్త తరహా అణ్వాయుధాల అభివృద్ధిలో చైనా ఎంతో ప్రగతి సాధించిందన్నారు. కాకపోతే అణ్వాయుధాలను చైనా తన స్వీయ రక్షణ కోసమే ఉపయోగిస్తుందన్నారు. చైనా తూర్పు భాగంలో గతేడాది 100కు పైగా అణు క్షిపణీ ప్రయోగ కేంద్రాలను నిర్మించినట్టు వచ్చిన వార్తలపై ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Also Read: US Capitol Riot Hearing: తండ్రిపై ఇవాంకా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
Also Read: Corona Cases: దేశంలో మళ్లీ కరోనా టెర్రర్- కొత్తగా 8582 కొవిడ్ కేసులు