By: Ram Manohar | Updated at : 06 May 2023 05:07 PM (IST)
బ్రిటన్ కింగ్ ఛార్లెస్ III పట్టాభిషేకం ఘనంగా పూర్తైంది. (Image Credits: Twitter\Royal Family)
King Charles III Coronation:
అట్టహాసంగా కార్యక్రమం..
బ్రిటన్ కింగ్‌గా ఛార్లెస్ III పట్టాభిషేకం పూర్తైంది. కిరీటం పెట్టి ఆయనను కింగ్‌గా ప్రకటించారు. లండన్‌లోని Westminster Abbeyలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 1953లో క్వీన్ ఎలిజబెత్‌ను రాణి పట్టాభిషేకం తరవాత మళ్లీ ఇన్నాళ్లకు ఛార్లెస్ III రాజుగా ఎన్నికయ్యాడు. 40వ మోనార్క్‌గా చరిత్ర సృష్టించాడు. సింహాసనంపై ఆయనకు కిరీటం పెట్టి రాజుగా ప్రకటించారు. AFP న్యూస్ ఏజెన్సీ అందించిన వివరాల ప్రకారం...ఆ సింహాసనం 1300-1301 మధ్య కాలంలో తయారు చేయించారు. అప్పటి నుంచి పట్టాభిషేక కార్యక్రమం అందులోనే నిర్వహిస్తున్నారు. శతాబ్దాలుగా స్కాట్‌లాండ్ కింగ్స్ అందరూ ఇదే సింహాసనంపై కూర్చుని బాధ్యతలు తీసుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో క్వీన్ ఎలిజబెత్ కన్నుమూశారు. తల్లి మరణం తరవాత కొడుకు ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్‌కి (74) వారసత్వంగా ఆ పదవి వచ్చింది. అప్పటికే ఆయన ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా ఉన్నారు. క్వీన్ ఎలిజబెత్ II 26 ఏళ్ల వయసులో ఆ బాధ్యతలు చేపట్టారు. ఆమె తండ్రి కింగ్ జార్జ్ VI 1952లో మరణించాక ఆ వారసత్వాన్ని కొనసాగించారు. ఆమె గతేడాది కన్నుమూశారు. ఆమె పెద్ద కొడుకైన ఛార్లెస్ ఫిలిప్‌ను కింగ్‌గా ప్రకటించింది రాయల్ ఫ్యామిలీ. ఇప్పుడు అధికారికంగా పట్టాభిషేకం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారత్ తరపున పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌తో పాటు ఆయన సతీమణి డాక్టర్ సుదేష్ ధన్‌కర్ కూడా పాల్గొన్నారు. ఇక బాలీవుడ్ ప్రముఖ నటి సోనమ్ కపూర్‌కి కూడా ఈ పట్టాభిషేక కార్యక్రమానికి ఆహ్వానం అందింది.
𝐓𝐡𝐞 𝐑𝐞𝐜𝐨𝐠𝐧𝐢𝐭𝐢𝐨𝐧
The King turns to each of the four points of the compass before The Archbishop of Canterbury proclaims him the ‘undoubted King’. The congregation shouts ‘God Save King Charles!’. pic.twitter.com/g6PiBLVjKu— The Royal Family (@RoyalFamily) May 6, 2023
His Majesty swears to govern the people with justice and mercy, and to uphold the Anglican Church of England and the Presbyterian Church of Scotland.
— The Royal Family (@RoyalFamily) May 6, 2023
For the first time at a #Coronation, His Majesty also prays for grace to be ‘a blessing to all… of every faith and belief’. pic.twitter.com/Ag0j2I9EEW
ప్రోటోకాల్స్..
కింగ్ ఛార్లెస్‌కి (King Charles Coronation) కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆయనా రూల్స్ పాటించాల్సిందే. రాయల్ ఫ్యామిలీ పెట్టిన నిబంధనలకు తలొగ్గాల్సిందే. కింగ్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే అభిమానులు ఆయనను అభినందించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కొందరు ఆటోగ్రాఫ్‌లు అడుగుతారు. మరి కొందరు ఫోటోలు తీసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ...కింగ్ ఛార్లెస్ మాత్రం వీటికి ఏ మాత్రం అంగీకరించకూడదు. ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడానికి వీల్లేదు. అపరిచిత వ్యక్తులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఎవరైనా అందులో విషం కలిపి ఉంటారన్న అనుమానంతో ఈ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి.
Also Read: King Charles Bodyguard: కింగ్‌కే కాదు ఆయన బాడీగార్డ్కీ ఫ్యాన్స్ ఉన్నారు,జేమ్స్ బాండ్ రేంజ్ పాపులారిటీ
Chinese Woman: షాపింగ్ చేయడానికి తోడు కావాలా? అయితే ఈ అమ్మాయి కంపెనీ ఇస్తుంది - కానీ కండీషన్స్ అప్లై
Youngest Billionaire: లైఫ్‌లో రిస్క్ చేయకపోతే మిగిలేది రస్కే - యంగెస్ట్ బిలియనీర్ సలహా
Taiwanese Shipping Firms: ఉద్యోగులకు షిప్పింగ్ కంపెనీల బంపర్ ఆఫర్లు, మందగమనంలో ఉన్నా మస్తు బోనస్‌లు
Ukraine Naatu-Naatu: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇంటి ముందు నాటు-నాటు, ఇరగదీసిన సైనికులు
Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆలోచన మారిందా?
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!