King Charles Bodyguard: కింగ్‌కే కాదు ఆయన బాడీగార్డ్‌కీ ఫ్యాన్స్ ఉన్నారు,జేమ్స్ బాండ్ రేంజ్ పాపులారిటీ
King Charles Bodyguard: కింగ్ ఛార్లెస్ బాడీగార్డ్‌కి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉంది.
King Charles Bodyguard:
కింగ్ బాడీగార్డ్‌కి ఫ్యాన్ బేస్
కింగ్ ఛార్లెస్ III పట్టాభిషేకం (King Charles Coronation) అంటే హంగులు ఆర్భాటాలే కాదు. సెక్యూరిటీ కూడా భారీగానే ఉంటుంది. కింగ్ చుట్టూ ఉండే భద్రతా వలయం మరింత స్పెషల్. క్వీన్ ఎలిజబెత్ మరణించే సమయం వరకూ ఆమె వెంటే ఉన్న భద్రతా సిబ్బంది అంతా...ఇప్పుడు కింగ్ ఛార్లెస్‌కు రక్షణ కల్పిస్తారు. ఈ సెక్యూరిటీ సిబ్బందిలో ఓ వ్యక్తి చాలా ఫేమస్ అయిపోయాడు. కింగ్ ఛార్లెస్‌కి ఎంత పాపులారిటీ ఉందో..అదే స్థాయిలో ఆ వ్యక్తికీ పాపులారిటీ ఉంది. ఆయనే కింగ్ పర్సనల్ బాడీగార్డ్ (King Charles III Bodyguard). అఫీషియల్‌గా ఎక్కడా కూడా అతని పేరేంటన్నది వెల్లడించలేదు. కానీ కింగ్ ఉన్న ప్రతిచోటా ఆయన కనిపిస్తాడు. గడ్డంతో భారీ పర్సనాలిటీతో కనిపించే ఈ వ్యక్తికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. గతేడాది సెప్టెంబర్ 8వ తేదీన తొలిసారి మీడియాలో కనిపించాడు. క్వీన్ ఎలిజబెత్ మరణించినప్పుడు అన్ని దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేయించాడు. అప్పటి నుంచి కింగ్ ఛార్లెస్ ఏ ప్రోగ్రామ్‌కి వెళ్లినా ఆయన పక్కనే కనిపిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. బంకింగ్‌హమ్ ప్యాలెస్‌లోకి తరచూ వెళ్లి వస్తున్న వీడియోలు టిక్‌టాక్‌లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన పట్టుకునే ఓ ఫ్యాన్సీ గొడుగు కూడా పాపులారిటీ తెచ్చి పెట్టింది. అది గొడుగు కాదని, గొడుగులా కనిపించే గన్ అని చాలా మంది అప్పట్లో సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.
King Charles' personal bodyguard is back 😭😭 pic.twitter.com/LGlmtn96ZE
— UB1UB2 SOUTHALL (@UB1UB2) May 6, 2023
జేమ్స్ బాండ్‌లా ఉన్నాడే..
అతడి లుక్స్‌కి కూడా మంచి ఫ్యాన్‌బేస్ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కింగ్‌ని కాపాడేందుకు సిద్ధంగా ఉంటారంటూ కొందరు ట్విటర్‌లో అతడి ఫోటోలు పోస్ట్‌లు చేశారు. ఈ ఫోటోల్లో ఆ బాడీగార్డ్ సీక్రెట్‌గా గన్స్‌ని క్యారీ చేస్తుండటం వైరల్ అయింది. నెటిజన్‌లు ఆ బాడీగార్డ్‌ని కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్‌తో పోల్చుతూ ఆకాశానికెత్తేశారు. "తరవాతి జేమ్స్ బాండ్ సిరీస్‌లకు ఈయననే హీరోగా తీసుకుంటే బాగుంటుంది. ఎంత అమేజింగ్ లుక్స్" అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఇంకొందరైతే ఆయన గడ్డానికీ ఫ్యాన్స్ అయిపోయారు. "గడ్డం అలా ఎలా మెయింటేన్ చేస్తున్నాడో. టిప్స్ ఇస్తారా" అని ట్విటర్‌లో కామెంట్స్ చేశారు.
A moment of appreciation for King Charles's super-cool white-bearded bodyguard with whom we have become acquainted through the media these days. pic.twitter.com/TLDAHiletd
— Nacho Morais😷💉🇪🇸🇬🇧🇪🇺🇺🇦 (@N4CM) September 18, 2022
బ్రిటన్‌లో 70 ఏళ్ల తర్వాత పట్టాభిషేక మహోత్సవం జరుగుతోంది. చివరిసారిగా 1953లో ఎలిజబెత్ రాణికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అయితే.. గతేడాది ఆమె కన్ను మూయడంతో కొత్త రాజుగా ఆమె కుమారుడు ఛార్లెస్ నియమితులయ్యారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత బ్రిటన్‌లో జరుగుతున్న తొలి పట్టాభిషేకంగా ఈ కార్యక్రమం రికార్డ్ సృష్టించనుంది. ఇప్పటివరకు బ్రిటన్ను రాణులు పాలించగా.. తొలిసారిగా ఒక రాజు నాయకత్వం వహించబోతున్నారు. ఈ క్రమంలో.. చార్లెస్ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించబోతోంది యూకే ప్రభుత్వం.
Also Read: King Charles III Coronation: బ్రిటన్‌కు రాజైనా సరే రూల్స్ పాటించాల్సిందే, రాయల్ ఫ్యామిలీ ప్రొటోకాల్స్ మహా స్ట్రిక్ట్