By: Ram Manohar | Updated at : 06 May 2023 01:49 PM (IST)
బ్రిటన్‌కి రాాజైనా కింగ్ ఛార్లెస్ రాయల్ ఫ్యామిలీ ప్రోటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుంది.
King Charles III Coronation:
బోలెడన్ని ప్రోటోకాల్స్
బ్రిటన్ రాజుగా కింగ్ ఛార్లెస్ III బాధ్యతలు తీసుకోడానికి ఇంకొంత సమయమే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేశారు. దేశాధినేతలు, ప్రముఖులు ఈ పట్టాభిషేక కార్యక్రమానికి హాజరు కానున్నారు. Westminster Abbey వద్ద సందడి నెలకొంది. భద్రత కట్టుదిట్టం చేశారు. దేశమంతా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. 70 ఏళ్ల తరవాత పట్టాభిషేకం జరుగుతుంటే మరి ఆ మాత్రం హడావుడి ఉంటుందిగా. ఇన్నేళ్లలో చాలా మార్పులొచ్చి ఉండొచ్చు. కానీ రాయల్ ఫ్యామిలీ ప్రోటోకాల్‌లో మాత్రం ఎలాంటి మార్పులూ రాలేదు. చాలా పకడ్బందీగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇక్కడికి వచ్చే వాళ్లే కాదు. కింగ్ ఛార్లెస్‌కి (King Charles Coronation) కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆయనా రూల్స్ పాటించాల్సిందే. రాయల్ ఫ్యామిలీ పెట్టిన నిబంధనలకు తలొగ్గాల్సిందే. మరి ఆ రూల్స్ ఏంటో చూద్దామా.
నో ఆటోగ్రాఫ్స్..
కింగ్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే అభిమానులు ఆయనను అభినందించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కొందరు ఆటోగ్రాఫ్‌లు అడుగుతారు. మరి కొందరు ఫోటోలు తీసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ...కింగ్ ఛార్లెస్ మాత్రం వీటికి ఏ మాత్రం అంగీకరించకూడదు. ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడానికి వీల్లేదు. ఎవరైనా ఫోర్జరీ చేసే ప్రమాదముందన్న కారణంతో ఈ రూల్ ఫాలో (Royal Rules) అవుతారు. ఒకవేళ కింగ్‌ని ఆటోగ్రాఫ్ అడిగినా "సారీ" అని నవ్వుతూ చెప్పేస్తాడు. సెల్ఫీల విషయంలోనూ ఇంతే. అభిమానులతో సెల్ఫీలు తీసుకోకూడదు. కింగ్‌కి మాత్రమే కాదు. రాయల్ ఫ్యామిలీలోని అందరికీ ఈ రూల్ వర్తిస్తుంది.
అన్ని గిఫ్ట్‌లూ తీసుకోవాల్సిందే
ఈ వేడుకలో ఆయనకు వచ్చే ఏ గిఫ్ట్‌నైనా సరే కింగ్ తీసుకోవాల్సిందే. అయితే...ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఏమేం గిఫ్ట్‌లు ఇస్తున్నారనేది మాత్రం రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. వాటి వల్ల ఏదైనా సమస్య తలెత్తుతుందా..? అన్నది క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ తరవాత ఎలాంటి వివాదాల్లోనూ చిక్కుకోకుండా ముందుగానే జాగ్రత్తపడతారు.
రాజకీయాలకు దూరం..
ఇంగ్లాండ్‌లో జరిగే ఎన్నికల్లో కింగ్ ఓటు వేయకూడదు. ఆయన ఏ పార్టీకి కూడా సపోర్ట్ ఇవ్వడానికి వీల్లేదు. అంతే కాదు. పబ్లిక్‌గా తన రాజకీయ అభిప్రాయాలనూ వెల్లడించకూడదు. సింపుల్‌గా చెప్పాలంటే న్యూట్రల్‌గా ఉండాలి.
ఫుడ్ విషయంలోనూ స్ట్రిక్ట్..
అపరిచిత వ్యక్తులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఎవరైనా అందులో విషం కలిపి ఉంటారన్న అనుమానంతో ఈ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి. కొన్ని ఫుడ్ ఐటమ్స్‌ని తినడంపైనా ఆంక్షలు ఉంటాయి. డిన్నర్ చేసేటప్పుడు ముందుగా కుడివైపున ఉన్న గెస్ట్‌తోనే మాట్లాడాలి. ఆ తరవాత విజిటర్స్‌తో మాట్లాడాలి.
డ్రెస్ కోడ్..
విదేశీ పర్యటనలు చేసినప్పుడు కింగ్ తన ఇష్టమొచ్చినట్టు డ్రెస్‌లు వేసుకుంటానంటే కుదరదు. కచ్చితంగా డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. దేశ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా స్పెషల్‌గా డిజైన్ చేసిన డ్రెస్‌లు మాత్రమే వేసుకోవాలి. ప్రయాణాలు చేసే సమయంలో బ్లాక్ డ్రెస్‌లు వేసుకోవాలనేది ప్రోటోకాల్. ఇక మరో స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే...పొరపాటున కూడా కింగ్ ఛార్లెస్ III ప్రిన్స్ విలియమ్స్‌తో కలిసి ప్రయాణం చేయకూడదు. మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. యూకేలో లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్ చేసే అవకాశం కింగ్‌కి మాత్రమే ఉంటుంది.
Also Read: King Charles III Coronation: 70 ఏళ్ల తర్వాత బ్రిటన్‌కు రాజు, ఛార్లెస్ పట్టాభిషేకం నేడే
Warangal News: ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజల్లో పోలీసులపై భరోసా పెరిగింది: దాస్యం వినయ భాస్కర్
Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం
Bihar Bridge Collapse: బిహార్‌లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి, ఇది మొదటిసారి కాదు
TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథమిక కీ విడుదల! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
ABP Desam Top 10, 4 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?