Epstein Files: అమెరికాని షేక్ చేస్తున్న వెయ్యి పేజీల డాక్యుమెంట్స్, సెక్స్ స్కాండల్‌లో ప్రముఖుల పేర్లు
Jeffrey Epstein Documents: అమెరికాలో వెయ్యి పేజీల ఎప్‌స్టీన్ డాక్యుమెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.
Jeffrey Epstein Files:
ఎప్‌స్టీన్ లిస్ట్..
వెయ్యి పేజీల డాక్యుమెంట్స్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని షేక్ చేసేస్తున్నాయి. పలు లైంగిక నేరాల్లో దోషిగా తేలిన Jeffrey Epstein కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్‌ని ఇటీవలే విడుదల చేశారు. అందులో బిగ్‌షాట్స్ పేర్లుండడం సంచలనమవుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూతో పాటు పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ పేరు కూడా ఉంది. ఓ బాధితురాలు ముందుకొచ్చి కోర్టులో పిటిషన్ వేయగా...ఈ డొంకంతా కదిలింది. మిలియనీర్ అయిన జెఫ్రే ఎప్‌స్టీన్ లైంగిక నేరాలకు పాల్పడ్డాడు. సెక్స్ ట్రాఫికింగ్ కూడా చేసినట్టు కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరుగుతుండగానే 2019లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తరవాత నాలుగేళ్లకు ఓ బాధితురాలు వేసిన పిటిషన్‌తో షాకింగ్ నిజాలు (Epstein Files) వెలుగులోకి వచ్చాయి. జెఫ్రేకి అమెరికాలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, బిలియనీర్స్‌తో చాలా సన్నిహితమైన సంబంధాలున్నాయి. అయితే...ఈ కేసుకి సంబంధించి ప్రస్తుతానికి 40 డాక్యుమెంట్‌లు బయటపడ్డాయి. అందులో కీలక వ్యక్తుల పేర్లున్నాయి. అంతే కాదు. జెఫ్రే వలలో పడి దారుణంగా హింసకు గురైన బాధితుల ఇంటర్వ్యూలూ ఇందులో ఉన్నాయి. బడాబడా వ్యక్తులతో పరిచయాలతో లైంగిక నేరాలకు పాల్పడ్డాడు జెఫ్రే. ఈ జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉంది.
బిల్ క్లింటన్ పేరు..
బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూతో జెఫ్రే ఎప్‌స్టీన్‌కి చాలా సన్నిహితమైన సంబంధం ఉన్నట్టు ఈ డాక్యుమెంట్‌ల ద్వారా తేలింది. క్లింటన్‌పై ఎలాంటి ఆరోపణలు లేకపోయినప్పటికీ...ప్రిన్స్ యాండ్రూ మాత్రం ఓ 17 ఏళ్ల బాలికతో శారీరకంగా ఒక్కటైనట్టు ఆరోపణలున్నాయి. జెఫ్రేపై ఇప్పటికే చాలా మంది బాధితులు పిటిషన్‌లు వేశారు. ఫ్లోరిడా, న్యూయార్క్, మెక్సికోలో జెఫ్రేకి ఇళ్లున్నాయి. ఆ ఇళ్లలోనే తమను లైంగికంగా వేధించారని చెబుతున్నారు బాధితులు. ఇదే కేసులో జెఫ్రే మాజీ గర్ల్‌ఫ్రెండ్ Ghislaine Maxwellపైనా ఆరోపణలున్నాయి. కొంత మంది అమ్మాయిలను ట్రాప్ చేసి సెక్స్ ట్రాఫికింగ్‌కి పాల్పడినట్టు తేలింది. 2021లోనే ఆమెకి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు. ఇప్పుడు బయటపడ్డ లిస్ట్‌లో ప్రముఖ సైంటిస్ట్,ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ పేరు కూడా ఉండడం మరో సంచలనం.