అన్వేషించండి

Indian Killed In Canada: కెనడాలో భారతీయుడి దారుణహత్య, కత్తితో దాడి చేసి చంపిన నిందితుడి అరెస్ట్

Canada News | కెనడాలో ఓ భారతీయుడు దారుణహత్యకు గురయ్యాడు. దాంతో విదేశాలలో ఉంటున్న భారత విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

అమెరికా, బ్రిటన్, కెనడా అగ్ర రాజ్యాల్లో భారతీయులపై దాడులు కొనసాగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట విదేశాలలో భారతీయులు దాడులకు రావడం, అగంతకుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కెనడాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.

ఓ దుండగుడు కత్తితో చేసిన దాడిలో భారతీయుడు కెనడాలో ప్రాణాలు కోల్పోయాడు. కెనడాలోని అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. అతడి మృతి పై సంతాపం ప్రకటించారు. కెనడా రాజధాని ఒట్టావా సమీపంలోని రాక్ ల్యాండ్ ఏరియాలో ఓ భారతీయుడు హత్యకు గురయ్యాడు. ఓ దుండగుడు కత్తితో దాడి చేసి భారత యువకుడ్ని దారుణంగా హత్య చేశాడు. కత్తిపోట్లకు గురై తీవ్ర రక్తం స్రావంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు అని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి కావాల్సిన సాయం చేస్తామన్నారు. ఈ సమయంలో వారు మనో ధైర్యంతో ఉండాలని సూచించారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. హత్యకు గల కారణాలపై నిందితుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కష్ట సమయంలో మృతుడి కుటుంబ సభ్యులకు రామ అండగా ఉంటామన్నారు. కెనడాలో భారతీయులపై జరుగుతున్న దాడులు, హత్యాకాండపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఓవైపు కలిస్తాన్ ఉద్యమం కొనసాగుతుంటే, మరోవైపు భారతీయుల పై దాడులు హత్యలు కెనడా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.


కత్తిపోట్లతో ఒకరు మృతి
కెనడా న్యూస్ బ్రాడ్‌కాస్టర్ CBC ప్రకారం, క్లారెన్స్- రాక్‌ల్యాండ్‌లో కత్తితో జరిగిన దాడిలో ఒకరు మృతిచెందారు. ఈ కేసులో మరొక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ప్రావిన్షియల్ పోలీసులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు  లాలోండే స్ట్రీట్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఒట్టావా డౌన్‌టౌన్‌కు తూర్పున దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని ఒంటారియో ప్రావిన్షియల్ పోలీసులు వ్యక్తి హత్య గురించి వెల్లడించారు. కానీ అటు మృతుడి వివరాలు గానీ, ఇటు నిందితుడి వివరాలు కానీ తెలపలేదు. 

రాక్‌ల్యాండ్‌లోని స్థానికులు తమకు సెక్యూరిటీ పెంచాలని, ఈ ప్రాంతంలో నేరస్తులపై, నిందితులపై పెంచాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అమాయకులను హత్య చేసి వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్న ఘటనలతో విదేశాలలో చదువుకుంటున్న తమ పిల్లలకు ఏం జరుగుతుందోనని భారత్ లో ఉన్న వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget