అన్వేషించండి

ఫిలమెంట్ బల్బ్‌లను బ్యాన్ చేసిన అమెరికా, వాటి స్థానంలో LED లైట్స్‌

Incandescent Bulb Ban: ఫిలమెంట్‌ బల్బ్‌లపై అమెరికా నిషేధం విధించింది.

Incandescent Bulb Ban: 


నిషేధం..

అమెరికాలో ఫిలమెంట్‌ బల్బ్‌లను ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇకపై ఏ స్టోర్‌లోనూ వీటిని విక్రయించొద్దని ఆదేశాలిచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. థామస్ ఎడిసన్ కనిపెట్టిన బల్బ్‌ల డిజైన్‌ ఇన్నాళ్లూ అందుబాటులో ఉంది. కొత్త రూల్స్ ప్రకారం అమెరికాలో ఇక ఈ బల్బ్‌లు కనిపించవు. వాటి స్థానంలో LED లైట్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యంలో ఎల్‌ఈడీ బల్బ్‌ల వాడకం పెరిగింది. ఫలితంగా...విద్యుత్ వినియోగం చాలా వరకూ తగ్గింది. కరెంట్ బిల్స్‌ తగ్గిపోయాయి. తక్కువ విద్యుత్‌తోనే బల్బ్‌లు వాడుకునేందుకు వీలు కలగడమే కాకుండా...కర్బన ఉద్గారాలు తగ్గడంలోనూ ఈ ఎల్‌ఈడీ బల్బ్‌లు కీలక పాత్ర పోషించాయి. సాధారణ ఫిలమెంట్ బల్బ్‌లు ఎక్కువ వేడిని ఎమిట్ చేస్తాయి. ఫలితంగా వాతావరణం వేడెక్కుతుంది. LED బల్బ్‌లు వాడితే ఆ సమస్య ఉండదు. అందుకే పూర్తి స్థాయిలో వీటిపై నిషేధం విధించింది అగ్రరాజ్యం. సాధారణంగా బల్బ్‌ల వెలుతురుని Lumenలలో కొలుస్తారు. ఇప్పుడు ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం...ఏ బల్బ్ అయినా ఓ వాట్‌కి 45 లుమెన్స్ మాత్రమే ఎమిట్ చేయాలి. అన్ని బల్బ్‌లకూ ఈ రూల్ వర్తిస్తుంది. అయితే..ఓవెన్స్‌లో వాడే బల్బ్‌లకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. 

ఇందుకేనట..

ఈ నిబంధనతో ఏటా అమెరికాలో 3 బిలియన్ డాలర్ల మేర ఆదా అవుతుందని అంచనా వేస్తోంది ఎనర్జీ డిపార్ట్‌మెంట్. గతంలో ఫిలమెంట్ బల్బ్‌ల కన్నా LED Lights ధరలు ఎక్కువగా ఉండేవి. క్రమంగా ఇవి తగ్గిపోయాయి. అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అందుకే...పూర్తిగా LED లనే వాడే విధంగా ప్రజల్ని ప్రోత్సహిస్తోంది బైడెన్ ప్రభుత్వం. ఈ నిబంధన తీసుకురావడానికి మరో కారణమూ చెబుతోంది అమెరికా. తక్కువ ఆదాయం ఉన్న వాళ్లకు ఇది చాలా ఉపకరిస్తుందని అంటోంది. ఎక్కువ కరెంట్‌ బిల్‌ల బాధ తప్పుతుందని వివరిస్తోంది. రానున్న మూడు దశాబ్దాల్లో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలూ గణనీయంగా తగ్గిపోతాయని చెబుతోంది. 222 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకూ తగ్గిపోయే అవకాశముందన్నది అధికారుల అంచనా. ఫిలమెంట్‌ బల్బ్‌లతో పోల్చి చూస్తే LED లైట్స్‌ 25-50 రెట్లు ఎక్కువ రోజులు పని చేస్తుంది. నిజానికి...ఇప్పటికే చాలా మంది ఈ ఎల్‌ఈడీ లైట్స్‌కి అలవాటు పడిపోయారు. కాకపోతే...ప్రభుత్వం అధికారికంగా ఫిలమెంట్‌ బల్బ్‌లను ఇప్పుడు నిషేధించింది అంతే. 

ఆ వెలుగుతో డయాబెటిస్‌..

వీధుల్లోని ఆర్టిఫిషియల్ లైట్ (Light At Night-LAN) శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను ప్రభావితం చేస్తుందని చైనా పరిశోధకులు అంటున్నారు. దీని గురించిన వివరాలను డయాబెటాల్జియాలో ప్రచురించారు. దాదాపుగా 9 మిలియన్ కేసుల్లో లాన్ వల్ల గ్లూకోజ్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు కనిపించాయట. చైనాలోని నాన్ కమ్యూనల్ డిసీస్ సర్వేయలెన్స్ స్టడీస్ వారి నుంచి సెకరించిన డేటాను వైద్య నిపుణులు పరిగణనలోకి తీసుకున్నారట. 98,658 మందిని అధ్యయనానికి ఎంచుకుని.. వారిలో LANతో పాటు బీఎంఐ వంటి ఇతర కారణాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని పరిశోధించారు.

Also Read: Haryana Clashes: హరియాణా అల్లర్లకు ఇంటిలిజెన్స్ ఫెయిల్యూర్ కారణమా? రిపోర్ట్ ఏం చెబుతోంది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget