అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Haryana Clashes: హరియాణా అల్లర్లకు ఇంటిలిజెన్స్ ఫెయిల్యూర్ కారణమా? రిపోర్ట్ ఏం చెబుతోంది?

Haryana Clashes: హరియాణాలో అల్లర్లకు ఇంటిలిజెన్స్ ఫెయిల్యూర్ కారణమన్న వాదన వినిపిస్తోంది.

Haryana Clashes:


నిఘా వైఫల్యం..?

హరియాణాలో అల్లర్లు జరగడానికి నిఘా వర్గాల వైఫల్యమే కారణమా..? ప్రస్తుతానికి దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశం సుప్రంకోర్టు వరకూ వెళ్లింది. భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు CCTVలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. అయితే...ఇది కేవలం ఇంటిలిజెన్స్ వైఫల్యమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు ఇంటిలిజెన్స్ అధికారులు మాత్రం తాము ముందుగానే దీనిపై హెచ్చరికలు చేశామని తేల్చి చెబుతున్నారు. పోలీసులకు సమాచారం అందించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్న వాదనా వినిపిస్తోంది. ముస్లింలు ఇంతగా దాడులు చేయడానికి కారణం...విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన యాత్ర. ఆ యాత్రను లీడ్ చేసిన మోను మనేసర్...గతంలో ఇద్దరు ముస్లింలను హత్య చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇదే వ్యక్తి అక్కడ బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర నిర్వహించాడు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ముస్లింలు దాడులు చేశారు. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం...వేలాది మంది ఈ యాత్రలో పాల్గొన్నారు. దాదాపు 2,500 మంది ఆందోళనకారులు ఆలయంపై దాడి చేశారు. అక్కడి షాప్‌లను ధ్వంసం చేశారు. 

ప్రతిపక్షాల విమర్శలు..

పోలీసులు చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడి ఆందోళనల తీవ్రతను గమనించిన ప్రభుత్వం ఒకేసారి 700 మంది పోలీసులను పంపింది. అయితే..వారిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడం వల్ల కొంత మంది పారిపోయి వచ్చారన్న ఆరోపణలూ ఉన్నాయి. మరో కీలక విషయం ఏంటంటే..మేవట్ ఎస్‌పీ సెలవులో ఉన్నప్పుడే ఇది జరగడం. దీనిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అల్లర్లపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INDL) నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఇలాంటివి జరుగుతాయని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని మండి పడుతున్నాయి. అల్లర్లు జరుగుతాయని హెచ్చరించినా కేవలం హోంగార్డులను పంపి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ రెండు వర్గాలకు చెందిన కొందరు సవాళ్లు విసురుకున్నారని తెలుస్తోంది. ఇవి పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన అల్లర్లే అని విపక్షాలు తేల్చి చెబుతున్నాయి. 

116 మంది అరెస్ట్..

ఈ అల్లర్లతో సంబంధం ఉన్న 116 మందిని అరెస్ట్ చేశారు. 41 FIRలు నమోదయ్యాయి. ఈ ఘర్షణలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వీరిలో ఇద్దరు హోంగార్డ్‌లతో పాటు ముగ్గురు సాధారణ పౌరులు, ఓ ఇమామ్ ఉన్నారు. హరియాణాలో గొడవ సద్దుమణగకముందే అటు గుడ్‌గావ్‌లోనూ ఇదే తరహా కలహాలు మొదలయ్యాయి. ఫలితంగా ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. NCR ప్రాంతం పోలీసుల పహారాలో ఉంది. పలు చోట్ల విద్యాసంస్థలు బంద్ చేశారు. ఈ అల్లర్లపై నిరసనగా VHP మేవట్‌లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. వీహెచ్‌పీతో పాటు బజ్‌రంగ్ దళ్ మహా పంచాయత్‌ని నిర్వహించాలని నిర్ణయించుకుంది. రెండు రోజులుగా హరియాణాలో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై స్పందిస్తూ ముఖ్యమంత్రి...అందరికీ భద్రత ఇవ్వలేముగా అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

Also Read: PM Modi: ముస్లిం మహిళలతో రాఖీ జరుపుకోండి- ఎంపీలకు ప్రధాని మోదీ సూచన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget