By: ABP Desam | Updated at : 14 Sep 2021 02:12 PM (IST)
Edited By: Sai Anand Madasu
మెుజావే ఎడారిలో ఇల్లు
పరిస్థితులు మారిపోతున్నాయి. నగరాల్లో జీవించడమంటే.. చాలామందికి నరకంలా కనిపిస్తోంది. ఏదో బతకలిగా అన్నట్టు బతికేస్తున్నారు. మనలో చాలా మంది నగరాల నుంచి బయటకు వెళ్లి పోదాం..రా బాబు అనుకున్నవారే కదా. ఇక కొవిడ్ మెుదలైన సమయంలో ఇదేంటీ.. అడవిలో బతికేస్తే ఎంత బాగుంటుందోనని ఆలోచన వచ్చిన వారు కూడా ఉన్నారు. అప్పుడే ఈ రకమైన ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. అయితే దానినే ఒక ఐడియాగా తీసుకుంది.. అమెరికాకు చెందిన ఓ కంపెనీ. ఇదీ... అదీ అని కాకుండా.. అన్నీ సౌకర్యాలు ఉండేలాగా ఎడారి నడి మధ్యలో ఇంటిని నిర్మించేసింది.
అనుకున్నదే.. మెుదలు ..ఎల్ సిమెంటో యూనో అనే పేరుతో ఇల్లు నిర్మించేసింది. ఈ ఇల్లు కాలిఫోర్నియాలోని మెుజావే ఎడారిలో ఉంది. ఈ ఇంట్లో అన్నీ ఏర్పాటు చేశారు. కానీ ధర చూస్తేనే.. తల తిరిగిపోయేలా ఉంది. ఇంతకీ ఈ ఇంటి ధర ఎంతో తెలుసా.. రూ .12.9 కోట్లు. అవును అంత ధర పెట్టి.. దీనిని కొనుగోలు చేయాలి. కానీ సౌకర్యాలు మాత్రం సూపర్ గా ఉంటాయట.
ఆ అమెరికన్ కంపెనీ ఈ ఇంటికి సంబంధించిన ప్రకటనను తన ఇన్ స్టా పేజీలో పెట్టింది. ' ఈ ఇంటిని చాలా ప్రత్యేకమైనది. దీంట్లో నివసించడం ఒక ప్రత్యేకత. ఇది బండ రాళ్ల మధ్య నిర్మించబడింది. 5 ఎకరాల స్థలం.. కానీ వంద ఎకరాలకుపైగానే ఉన్న అనుబూతి కలుగుతుంది. మీ ప్రైవసీ కూడా ఎలాంటి సమస్య ఉండదు. ఓ గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. URBARC ఆర్కిటెక్ట్‌లతో రూపొందించాం' అని ఆ కంపెనీ ప్రచారం చేసుకుంటోంది.
ఇంటి ధర ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇది ఏ ఇతర ఇల్లు ఇవ్వలేని ప్రత్యేక అనుభూతులను అందిస్తుంది. ఎడారిలో నివసించాలి.. ఎవరూ లేని ప్రదేశాల్లో గడపాలని అనే ఆలోచనలు ఉన్న వారికి ఈ ఇల్లు సరిగా సెట్ అవుద్ది.
Also Read: కుమార్తె ఎత్తు పెరగడానికి ఆ తల్లి ఏం చేసిందో తెలుసా.. వామ్మో మరీ అంతలానా..
US Visa: వీసా అపాయింట్మెంట్ దొరకట్లేదా? ఏం టెన్షన్ లేదు, నేరుగా ఎంబసీకి వెళ్లి తీసుకోవచ్చు
Quetta Bomb Blast: పాకిస్థాన్‌లో ఆగని ఉగ్రదాడులు, ఆ ప్రావిన్స్‌లో బాంబుల మోతలు
Pervez Musharraf Death: భారత్‌ను గిల్లి కయ్యం పెట్టుకున్న ముషారఫ్, ఆ మూడు యుద్ధాల మాస్టర్‌మైండ్ ఆయనే
Apps Ban: చైనా యాప్స్‌పై మరోసారి కేంద్రం కొరడా, ఇకపై ఆ అప్లికేషన్లు కనిపించవ్
Pervez Musharraf: వాజ్‌పేయీకి షేక్ హ్యాండ్ ఇచ్చిన ముషారఫ్, షాక్ అయిన ప్రపంచ దేశాలు
Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్
BRS Chief KCR : దేశమంతా గులాబీ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు - కేసీఆర్
Jr NTR: అప్డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!
Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్