Umbrella Costs 1 Lakh : ఆ గొడుగు ధర అక్షరాలా లక్ష - వర్షంలో బయటకు తీసుకెళ్లారో తడిచిపోతారంతే !

ఫ్యాషన్ దిగ్గజాలు గుక్సీ, అడిడాస్ కలిసి గొడుగును డిజైన్ చేశాయి. రూ.లక్ష వరకూ ధరను నిర్ణయించారు. కానీ అది వాటర్ ఫ్రూప్ కాదు.

FOLLOW US: 

సాధారణంగా ఓ గొడుగు ఖరీదు ఎంత ఉంటుంది. రెండు, మూడు వందలు ఉంటుంది. మరీ మంచి బ్రాండ్ అయితే రూ. వెయ్యి వరకూ ఉండవచ్చు. మంచి బ్రాండ్ అయితే.. వర్షం జోరుగా కురిసినా.. మనల్ని మనం తడవకుండా జాగ్రత్త పడవచ్చు. అదే రూ. లక్ష విలువైన గొడుగయితే ?. అంత ఖరీదైన గొడుగులు ఎందుకు ఉంటాయి..ఏమైనా బంగారంతో చేస్తారా ? అనే డౌట్ రావొచ్చు. కానీ ఖరీదు ఎక్కువైతేనే మంచివని నమ్మే ధనవంతులు అన్నీ చోట్లా ఉంటారు. ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుని కొన్ని ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. అలాంటి ఓ ఉత్పత్తిని తీసుకొచ్చింది గుక్సీ- అడిడాస్ కంపెనీ. 

కేరళ ప్రభుత్వ సొంత "ఓటీటీ" - ఇక సినిమాలన్నీ అందులోనేనా ?

గుక్సీ, అడిడాస్ కంపెనీల గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన పని లేదు. అవి లగ్జరీ బ్రాండ్లు. రెండూ కలిపి లగ్జరీల్లో కెల్లా లగ్జరీ అయిన గొడుగును రూపొందించారు. దాని విలువను 1290 డాలర్లుగా ఖరారు చేశారు. మరి దీని స్పెషాలిటీ ఏంటి అంటే.. ఫ్యాషన్ మాత్రమే . స్టైల్‌గా కనిపించేందుకు అద్భుతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. రూ. లక్ష పెట్టి కొన్నాం కాబట్టి తమకు గొప్ప రక్షణ వస్తుందని.. దాన్ని తీసుకుని వర్షంలోకి వెళ్తే.. ఆ లక్ష కూడా వర్షార్పణం అయినట్లే అవుతుంది. ఆ గొడుగు వర్షం నుంచి కొనుక్కున్న వాళ్లకి రక్షణ కల్పించకపోగా.. తనను తాను కూడా కాపాడుకోలేదు. తడిస్తే ఉంటుందో ఊడుతుందో తెలియనంత సున్నితంగా క్లాత్ మెటీరియల్ వాడారు మరి. 

వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు

చైనా ఆన్ లైన్‌ సైట్లలో ప్రస్తుతం ఈ గొడగును అమ్మకానికి పెట్టారు. వర్షానికి నిలబడదని ప్రత్యేకంగా చెప్పారు. అయితే ఎండలో బయటకు వెళ్తే వేసుకోవచ్చని సలహా ఇచ్చారు. అంతే కాదు.. దీన్ని తయారు చేసిన పర్పస్.. డెకరేటివ్ అన్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ గొడుకు ఎందుకు ఇంత ఖరీదైందని ప్రశ్నిస్తున్నారు. బ్రాండ్ పేరు అలా అమ్ముకుంటున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. రెండు ఫ్యాషన్ దిగ్గజాలు కలిపి ఫ్యాషన్ మాత్రమే చేస్తున్నాయని పనికొచ్చేవి డిజైన్ చేయడం లేదని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు. 

లాలూ యాదవ్‌కు మరో షాక్- కొత్త అభియోగాలు మోపిన సీబీఐ

Published at : 20 May 2022 12:52 PM (IST) Tags: Umbrella umbrella cost lakhs Gucci adidas umbrella

సంబంధిత కథనాలు

Chicago Mass Shooting: స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌పై కాల్పులు- ఆరుగురు మృతి, 36 మందికి గాయాలు!

Chicago Mass Shooting: స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌పై కాల్పులు- ఆరుగురు మృతి, 36 మందికి గాయాలు!

Europe Hotel Jobs : రెజ్యూమ్ కూడా వద్దు ఉద్యోగం ఇచ్చేస్తామంటున్నారు - ఎక్కడో తెలుసా ?

Europe Hotel Jobs :  రెజ్యూమ్ కూడా వద్దు ఉద్యోగం ఇచ్చేస్తామంటున్నారు - ఎక్కడో తెలుసా ?

Parag Agarwal: ఉద్యోగులకు కాఫీలు సర్వ్ చేసిన కంపెనీ సీఈవో, వాటే సింప్లిసిటీ అంటున్న నెటిజన్లు

Parag Agarwal: ఉద్యోగులకు కాఫీలు సర్వ్ చేసిన కంపెనీ సీఈవో, వాటే సింప్లిసిటీ అంటున్న నెటిజన్లు

Denmark Shooting: షాపింగ్‌మాల్‌లో కాల్పుల మోత- ముగ్గురు మృతి

Denmark Shooting: షాపింగ్‌మాల్‌లో కాల్పుల మోత- ముగ్గురు మృతి

Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!

Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!

టాప్ స్టోరీస్

Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !

Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !

Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!

Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!

YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !

YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !

Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు

Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు