Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు
Yasin Malik Convicted: జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసిన కేసులో దోషిగా తేల్చింది కోర్టు.
Yasin Malik Convicted: ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశారన్న కేసులో జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్) అధినేత యాసిన్ మాలిక్‌ను దోషిగా తేల్చింది దిల్లీ ఎన్ఐఏ కోర్టు. ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ ఈ తీర్పు చెప్పారు. అయితే ఈ కేసులో మే 25న శిక్షను ఖరారు చేయనుంది.
జమ్ముకశ్మీర్‌లో సంఘ విద్రోహ కార్యకలాపాలు నడిపేందుకు నిధులు సమీకరించినట్లు యాసిన్ మాలిక్‌పై ఆరోపణలు ఉన్నాయి. 2017కు సంబంధించిన ఈ కేసులో మాలిక్‌పై దిల్లీ కోర్టులో ఇటీవల అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. నేరాభియోగం నమోదైన నేపథ్యంలో మాలిక్ క్షమించాలని కోరారు.
టెర్రర్ ఫండింగ్ కేసులో తనపై నమోదైన అన్ని అభియోగాలను యాసిన్‌మాలిక్ అంగీకరించాడు. యాసిన్ మాలిక్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలని అతని ఆస్తులకు సంబంధించి అఫిడవిట్ ఇవ్వాలని కోర్టు ఎన్‌ఐఎని ఆదేశించింది.
ఈ కేసుపై విచారణ జరపవలసిన జడ్జి రాకేశ్ కుమార్ శర్మ సెలవులో ఉండటంతో జడ్జి ప్రశాంత్ కుమార్ విచారణ జరిపారు. కశ్మీరులో ప్రశాంతతకు భంగం కలిగించడం, దేశద్రోహం, దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, నేరపూరిత కుట్రకు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వంటి నేరారోపణలపై విచారణ జరిగింది.
ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిద్దిన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ సహా పలువురు వేర్పాటువాద నేతలపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
#WATCH | Delhi: Separatist Yasin Malik being brought out of NIA Court after hearing in terror funding case. The court convicted him in the matter. Argument on sentence to take place on 25th May. pic.twitter.com/33ue61lDaH
— ANI (@ANI) May 19, 2022
జమ్ములో జరిగే వేర్పాటువాద కార్యకలాపాల్లో జేకేఎల్ఎఫ్ ముందుస్థానంలో ఉంటుంది. 1989లో జరిగిన కశ్మీరీ పండితుల హత్యల్లోనూ వీరిపాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. వీరి దురాగతాలతో కశ్మీర్ నుంచి భారీ సంఖ్యలో పండితులు వలస వెళ్లారు. 1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్యతోనూ జేకేఎల్ఎఫ్కు సంబంధాలు ఉన్నాయి.
Also Read: Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!