News
News
X

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!

Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదుపై భారీ చర్చ జరుగుతోంది. బాబ్రీ మసీదు తర్వాత దాదాపు అంత పెద్ద వివాదం ఇదే అన్నట్టు పరిస్థితి మారింది. ఇంతకీ అక్కడ ముందు మందిరం ఉందా...మసీదు ఉందా.. అప్పట్లో ఏం జరిగింది.

FOLLOW US: 
Share:

మసీదును నిర్మించడానికి ఆలయాన్ని ధ్వంసం చేశారా ? లేదంటే ఆలయం ధ్వంసం చేసిన చోట మసీదు కట్టారా ? అసలు మసీదు ఉన్నచోట ఒకప్పుడు కాశీ విశ్వనాథుడి ఆలయం ఉండేదా ? లేదా ? అన్నదే ఇప్పుడు పెద్ద చర్చ. జ్ఞానవాపి మసీదుకు వందల ఏళ్ల చరిత్ర ఉందని...ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటుందని చెబుతున్నారు.1834లో బ్రిటీష్ అధికారి జేమ్స్ ప్రిన్సెప్...ఈ  మసీదును సందర్శించినప్పుడు దీన్ని గీశాడు. ఫొటోలో కూడా కనిపిస్తున్న స్తంభాలు నిశితంగా పరిశీలిస్తే హిందూ ఆలయాన్ని పోలి ఉన్నాయి. అప్పటి చరిత్రకారుడు సకీ ముస్తయిద్ ఖాన్ తన మాసిర్-ఎ-ఆలమ్‌గిరిలో ఆలయ కూల్చివేత గురించి ప్రస్తావించాడు. చక్రవర్తి ఆదేశం ప్రకారం అప్పట్లో అక్కడున్న కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కూల్చేసినట్టు అందులో ఉందంటున్నారు. 

జ్ఞానవాపి మసీదు పశ్చిమ గోడ వెనుక శృంగార గౌరీ, గణేశుడు, హనుమంతుడు, నంది విగ్రహాలు ఉన్నాయి. సాధారణంగా శివాలయాల్లో నంది విగ్రహాలు గర్భగుడికి కొంచెం దూరంలో శివలింగానికి అభిముఖంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న నంది మాత్రం గర్భగుడి వైపు కాకుండా మసీదు వైపు చూస్తున్నట్లు ఉంటుంది. అంటే మసీదు ఉన్న ప్లేసే అసలు గర్భగుడి అని పిటిషన్లు వాదిస్తున్నారు. అయితే వేటికీ చారిత్రక ఆధారాలు లేవని ఇలాంటి వాదనలు ఎవ్వరూ నమ్మరంటున్నారు మస్లీం సంఘాలు. 

చారిత్రక ఆధారాల ప్రకారం

  • నాలుగు – ఐదు శతాబ్దాల మధ్య కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణం జరిగింది, విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు.
  • ఆరో శతాబ్దంలో మన దేశ పర్యటనకు వచ్చిన చైనా యాత్రికుడు హ్యుయెన్ త్సాంగ్ కూడా వారణాసి ఆలయం గురించి ప్రస్తావించాడు
  • 1194లో మహ్మద్‌ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్‌ ఐబక్‌… కన్నౌజ్‌ రాజును ఓడించినప్పుడు ఆలయాన్ని కూల్చేసినట్టు చెబుతున్నారు
  • 1211లో ఆలయాన్ని పునురుద్ధరిస్తే.. మళ్లీ 1489-1517 మధ్య సికందర్‌ లోఢీ హయాంలో కూల్చేశారు
  • అక్బర్‌ హాయాంలో మళ్లీ పునరుద్ధరించినా...ఆయన కుమార్తె ముస్లీం కుటుంబానికి కోడలుగా వెళ్లిందన్న కారణంతో అప్పట్లో బ్రాహ్మణులు ఆలయాన్ని బహిష్కరించారు
  • 1585 లో అక్బర్‌ హయాంలో మరోసారి కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని పునరుద్ధరించారు.
  • ఔరంగజేబు మొఘల్‌ సింహాసనం సొంతం చేసుకున్న తర్వాత 1669లో మరోసారి ఆలయాన్ని కూల్చేసి..మసీదు నిర్మించారట

అయితే ఆఖరి దండయాత్ర...అంటే.. ఔరంగజేబు హయాంలో దండయాత్ర ఆలయంలో దండయాత్ర జరుగుతున్నప్పుడు అక్కడున్న పూజారి శివుడిపై భక్తితో  పాటు ఆలయంలో ఉన్నబావిలో దూకేశారని… ఇప్పుడు బావిలో ఉన్న శివలింగం అదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఆలయాన్ని పూర్తిగా కూల్చకుండా మసీదు నిర్మించడం వల్లే గోడలపై దేవుడి బొమ్మలు అలాగే ఉండిపోయాయనే వాదన వినిపిస్తోంది. 

1991లో పీవీ నరసింహారావు హయాంలో ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి దేశంలో ఉన్న మసీదులు, దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలి. అయితే ఈ చట్టం చేయకముందే బాబ్రీ మసీదు వివాదం ఉండడంతో… అది ఈ చట్ట పరిధిలోకి రాలేదు. కానీ జ్ఞానవాపి వివాదం ఈ చట్ట పరిధిలో వస్తుంది. మరి ఈ వివాదానికి ఎలాంటి ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. 

Also Read:  ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని- ప్రపంచ సాంస్కృతిక నగరం… వారణాసి గొప్పతనం ఇదే..

 Also Read: కాశీలో వదిలేయాల్సింది కాకరకాయో, కమలాపండో కాదు…

Also Read: శవాలు దహనం చేసే ఘాట్ సహా కాశీలో ముఖ్యమైన ఘాట్లు ఇవి..

Published at : 18 May 2022 04:54 PM (IST) Tags: Gyanvapi Masjid Case Gyanvapi Masjid Gyanvapi Mosque Case Gyanvapi Mosque Survey Report gyanvapi masjid survey gyanvapi masjid news gyanvapi masjid latest news gyanvapi masjid shivling gyanvapi mosque survey gyanvapi masjid controversy gyanvapi masjid history

సంబంధిత కథనాలు

ఆలయం ముందు ధ్వజ స్తంభం ఎందుకు ఉంటుంది? దాన్ని ఎలా తయారు చేస్తారు?

ఆలయం ముందు ధ్వజ స్తంభం ఎందుకు ఉంటుంది? దాన్ని ఎలా తయారు చేస్తారు?

Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు

Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఆర్థికంగా బావుంటుంది కానీ మానసిక ఆందోళన తప్పదు

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఆర్థికంగా బావుంటుంది కానీ మానసిక ఆందోళన తప్పదు

కోలాహలంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

కోలాహలంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

పండుగలు, శుభకార్యాలకు మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?

పండుగలు, శుభకార్యాలకు మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?

టాప్ స్టోరీస్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

TSPSC :  పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?