Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్షలో వెజ్ ఫ్రైడ్ మోమో... చైల్డ్ ఆర్టిస్ట్ to హౌస్... ఈ అమ్మాయి ఎవరో తెల్సా?
Bigg Boss Agnipariksha Contestants: 'బిగ్ బాస్' సందడి మొదలైంది. సెప్టెంబర్ తొలి వారంలో షో మొదలు. అంతకు ముందు కామన్ మ్యాన్ సెలక్షన్స్ కోసం మరో షో. అందులో వెజ్ ఫ్రైడ్ మోమో సెలెక్ట్ అయ్యిందని తెలిసింది.

తెలుగునాట 'బిగ్ బాస్' సందడి మొదలైంది. డబుల్ హౌస్... డబుల్ డోస్... అంటూ షో మీద అంచనాలు పెంచారు హోస్ట్ కమ్ కింగ్ అక్కినేని నాగార్జున. సెప్టెంబర్ తొలి వారంలో 'బిగ్ బాస్ 9' మొదలు కానుంది. అంత కంటే ముందు 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' పేరుతో మరొక షో స్ట్రీమింగ్ కానుంది. 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9లో కొంత మంది కామన్ పీపుల్ సైతం పార్టిసిపేట్ చేయనున్నారు. వాళ్ళ సెలక్షన్ కోసం ఆ అగ్నిపరీక్ష. అందులో వెజ్ ఫ్రైడ్ మోమో అలియాస్ దివ్య నిఖిత ఎంపిక అయ్యింది. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
రామ్, కాజల్ సినిమా 'గణేష్'లో చైల్డ్ ఆర్టిస్ట్...
ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రైజింగ్ ఇన్‌ప్లూయెన్సర్!
Contestants Of Bigg Boss 9 Telugu Agnipariksha: 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'కు సెలెక్ట్ అయిన 15 మందిలో ఇన్‌స్టాగ్రామ్‌లో 'వెజ్ ఫ్రైడ్ మోమో'గా పాపులరైన దివ్య నిఖిత ఒకరు. కామన్ మ్యాన్ కేటగిరీలో ఈవిడ షోలోకి ఎంటర్ అయ్యింది. అయితే... ఈ అమ్మాయికి సినిమా బ్యాగ్రౌండ్ కొంచెం ఉంది.
ఉస్తాద్ రామ్ పోతినేని, చందమామ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'గణేష్... జస్ట్ గణేష్' సినిమా గుర్తుందా? అందులో హీరోయిన్ కొంత మందికి ట్యూషన్లు చెబుతుంది. కాజల్ దగ్గర నుంచి రామ్ దగ్గరకు వచ్చి ట్యూషన్ చెప్పించుకున్న చిన్నారులలో దివ్య నిఖిత కూడా ఒకరు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ అమ్మాయి రైజింగ్ ఇన్‌ప్లూయెన్సర్.
Also Read: 'బిగ్ బాస్ 9' ఇంటిలోకి లక్స్ పాప... ఈసారి షోకి బోల్డ్ టచ్ ఇస్తున్నారా?
View this post on Instagram
సినిమా రివ్యూలతో వైరల్ అవుతోన్న దివ్య నిఖిత!
ఇన్‌స్టాగ్రామ్‌లో దివ్యా నిఖిత అడుగు పెట్టి పట్టుమని రెండేళ్లు కూడా కాలేదు. ఆ అమ్మాయి ఆగస్టు 20, 2023లో మొదటి పోస్ట్ చేసింది. అంతకు ముందు ఏడాది నుంచి స్టోరీలు షేర్ చేసేది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్‌స్టాను ఫాలో అయ్యే వాళ్ళు లక్ష మందికి పైగా ఉన్నారు. తక్కువ కాలంలో వెజ్ ఫ్రైడ్ మోమో అలియాస్ దివ్య నిఖిత పాపులర్ కావడానికి రీజన్ సినిమా రివ్యూలు.
Also Read: 'మయసభ' క్లైమాక్స్... ఎన్టీఆర్, చంద్రబాబులను ఒక్కటి చేసిన నారా లోకేష్ - ఎలాగంటే?
View this post on Instagram
ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ సినిమాలకు దివ్య నిఖిత రివ్యూలు ఇస్తుంటారు. నాగార్జున 'కుబేర'కు సైతం రివ్యూ ఇచ్చారు. పాటు విష్ణు మంచు 'కన్నప్ప'కు అయితే ఆ సినిమా పేరు డైరెక్టుగా చెప్పకుండా 'ఐ ఫాదర్, స్నో అన్న' అంటూ చెప్పుకొచ్చారు. ఆ మధ్య గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'బిగ్ బాస్ 9' హోస్ట్ చేయవచ్చని రూమర్లు వచ్చాయి. ఒకవేళ బాలకృష్ణ 'బిగ్ బాస్ 9' హోస్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక వీడియో చేశారు దివ్య నిఖిత. అగ్నిపరీక్షను దాటుకుని మెయిన్ షోలో ఆవిడ అడుగు పెడుతుందా? లేదా? అన్నది చూడాలి. అన్నట్టు దివ్య నిఖిత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.





















