గజగజ వణికిపోతున్న గాజా, మిలిటరీ అల్టిమేటంతో ఊరొదిలి వెళ్తున్న పౌరులు
Gazans Fleeing: ఇజ్రాయేల్ మిలిటరీ అల్టిమేటంతో గాజా పౌరులు ఊరు వదిలి వెళ్లిపోతున్నారు.
Gazans Fleeing:
గాజా పౌరుల వలసలు..
గాజాను వదిలి వెళ్లిపోవాలంటూ అక్కడి పౌరులకు ఇజ్రాయేల్ అల్టిమేటం జారీ చేసింది. 24 గంటల్లోగా ఇళ్లు వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇప్పటికే యుద్ధంతో నలిగిపోతున్న అక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటున్నారు. కానీ అక్కడే ఉంటే ప్రాణాలకే ప్రమాదం. అందుకే..ఎలాగోలా అక్కడి నుంచి బయట పడుతున్నారు. కొన్ని కుటుంబాలు నెమ్మదిగా ఖాళీ చేస్తున్నాయి. ట్విటర్‌లో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది పౌరులు కార్‌లపై సామాన్లు కట్టుకుని బయట పడుతున్నారు. పరుపులు, దుస్తులు కార్ రూఫ్‌కి కట్టేస్తున్నారు. ఇన్నాళ్లూ గాజానే తమ లోకం అనుకున్న వాళ్లు ఇప్పుడు ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు. పాలస్తీనా మీడియా రిపోర్టర్లు కొందరు ట్విటర్‌లో ఈ వీడియోలు షేర్ చేస్తున్నారు. నార్త్ గాజాలో పరిస్థితులెలా ఉన్నాయో కళ్లకు కడుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయేల్ 3 లక్షల మంది రిజర్వ్ బలగాలను మొహరించింది. రానున్న రోజుల్లో యుద్ధం మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని ముందుంగానే అందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మిలిటరీ కీలక ప్రకటన కూడా చేసింది.
"గాజా పౌరులు మీ సేఫ్‌టీ కోసమే చెబుతున్నాం. వెంటనే ఊరు వదిలి వెళ్లిపోండి. హమాస్ ఉగ్రవాదుల నుంచి దూరంగా వెళ్లిపోవడం మీకే మంచిది. మిమ్మల్నే అడ్డం పెట్టుకుని వాళ్లు దాడులకు తెగబడుతున్నారు"
- ఇజ్రాయేల్ మిలిటరీ
Gaza |
— Younis Tirawi | يونس (@ytirawi) October 13, 2023
Residents in North Gaza (Gaza City, Beit Lahia, Beit Hanoun, and Jabalia RC) are evacuating their homes in response to the Israeli military's threat that those who stay could face deadly consequences. pic.twitter.com/ZOlU0Rg5Rj
గాజాలోని 10 లక్షల మంది జనాభాలో ఎక్కువ మొత్తం ఇజ్రాయేల్ నుంచి వలస వచ్చిన వాళ్లే. చాలా ఏళ్లుగా గాజాలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. 16 ఏళ్ల క్రితం ఇక్కడ హమాస్ ఉగ్రవాదులు పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ప్రకటించాలన్న డిమాండ్‌పై చర్చలు పదేళ్ల క్రితమే ముగిశాయి. అప్పటి నుంచి ఇజ్రాయేల్ ప్రభుత్వం పాలస్తీనాపై పట్టు సాధిస్తూ వస్తోంది. వీలైనంత ఎక్కువ భూభాగాన్ని ఆక్రమిస్తోంది. ఈ కారణంగానే ప్రజల్లో అసహనం పెరిగిపోయి...ఉగ్రవాదులు పెరిగిపోయారు.
నార్త్ గాజాలోని ప్రజలకు కీలక సూచనలు చేసింది ఇజ్రాయేల్ మిలిటరీ. నార్త్ గాజాలోని 10 లక్షల మంది పౌరులు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేయాలని చెప్పింది. 24 గంటల్లోగా అంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. గాజా మొత్తం జనాభాలో సగం ఈ నార్త్ గాజాలోనే ఉంటున్నారు. ఈ ప్రకటన ఇప్పటికే వివాదాస్పదమైంది. ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలంటే వాళ్లు ఎక్కడికి పోతారని ప్రశ్నిస్తున్నాయి మానవ హక్కుల సంఘం. ఐక్యరాజ్య సమితి కూడా తీవ్రంగానే స్పందించింది. ఈ ఆదేశాలు పాటించడం అసాధ్యం అని తేల్చి చెప్పింది. తీవ్ర పరిణామాలను తప్పించాలంటే ఈ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని స్పష్టం చేసింది.
Also Read: Hamas Terrorist: తల్లి గర్భాన్ని చీల్చి మరీ బిడ్డను చంపారు - వెలుగులోకి హమాస్ మిలిటెంట్ల మరో దురాగతం