అన్వేషించండి

Financial crisis in America: ష‌ట్ డౌన్ దిశ‌గా అమెరికా - అసలు విషయం ఏంటో తెలుసా?

US: అమెరికాలో కీలక ప‌రిణామం చోటు చేసుకుంది. బైడెన్‌ ప్ర‌భుత్వానికి నిధులు స‌మ‌కూర్చే బిల్లుకు అడ్డంకులు ఏర్ప‌డ్డాయి. ట్రంప్ ప్ర‌తిపాద‌న‌ల‌కు డెమొక్రాట్లు అడ్డు త‌గ‌ల‌డంతో ష‌ట్ డౌన్ దిశ‌గా మారింది.

Financial crisis in America: అగ్ర‌రాజ్యం అమెరికా(America)లో మ‌రో మూడు, నాలుగు వారాల్లోనే ప్ర‌భుత్వం మార‌నుంది. కొత్త‌గా ఎన్నికైన రిప‌బ్లిక‌న్ పార్టీ నాయ‌కుడు.. మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మ‌రోసారి అధ్య‌క్ష పీఠం ఎక్క‌నున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో త‌న మాటే నెగ్గాల‌ని ట్రంప్‌.. కాదు.. తాము చేసిందే నెగ్గాల‌ని అధికార ప‌క్షం డెమొక్రాట్లు(Democrats) ప‌ట్టుబ‌ట్ట‌డంతో కీల‌క‌మైన ద్ర‌వ్య వినిమ‌య బిల్లు పెండింగులో ప‌డింది. ఇది శుక్ర‌వారం(డిసెంబ‌రు 20) సాయంత్రానికి ప‌రిష్కారం అయితే.. స‌రే, లేక‌పోతే అమెరికాలో ఆర్థిక కార్య‌క్ర‌మాల‌కు ష‌ట్ డౌన్ ప్ర‌క‌టించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఫ‌లితంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వేత‌నాలు స‌హా.. ఇత‌ర కార్య‌క్ర‌మాలు కూడా నిలిచిపోనున్నాయి.

విష‌యం ఏంటంటే? 

అమెరికా(America)లో ప్ర‌తి 4 మాసాల‌కు ఒక‌సారి ప్ర‌భుత్వానికి సంబంధించిన ద్ర‌వ్య వినిమ‌య బిల్లును స‌భ‌లు ఆమోదిస్తాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా అధ్య‌క్షుడు జో బైడెన్ ప్ర‌భుత్వం కూడా ఉభ‌య స‌భ‌ల్లోనూ.. ద్ర‌వ్య వినిమ‌య బిల్లును ఆమోదించేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ, దీన్ని తొలుత కాబోయే అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. తాను చేసిన ప్ర‌తిపాద‌నల‌ను చేర్చాల‌ని కోరారు. దీంతో అప్ప‌టివ‌ర‌కు బిల్లులో చేర్చిన రుణాల‌పై సీలింగ్‌(రెండేళ్ల పాటు)ను ఎత్తివేశారు. అనంతరం.. దీనిని ప్ర‌తినిధుల స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. దీనిని ఆమోదించేందుకు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని ప్రతినిధుల సభ స్పీకర్‌ మైక్‌ జాన్సన్(Mick Jhonsan) విన్న‌వించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే..  మార్చి(March-2025) 14వ తేదీ వరకు ప్రభుత్వానికి నిధులు సమకూరనున్నాయి. 

ఈ రాత్రికి గ‌డువు!

అయితే.. కాబోయే అధ్య‌క్షుడు ట్రంప్(Trump) చేసిన ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌స్తుత అధికార ప‌క్షం డెమొక్రాట్లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఆయ‌న ఇంకా అధ్య‌క్షుడు కాలేద‌ని.. ఆయ‌న చెప్పిన‌ట్టు బిల్లులో మార్పులు ఎలా చేస్తార‌ని వారు నిల‌దీస్తున్నారు. ఫ‌లితంగా ప్రతినిధుల సభ దీనిని 235-174 ఓట్ల తేడాతో తిరస్కరించింది. ఫ‌లితంగా ఇప్పుడు కీల‌క‌మైన సెనేట్‌(Senet)లో ఈ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. ఇక్క‌డ క‌నుక ఆమోదం పొందితే.. కొంత వ‌ర‌కు బైడెన్(Jeo Biden) స‌ర్కారు ఆర్థిక స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్కిన‌ట్టే. కానీ, ఇక్క‌డ కూడా డెమోక్రాట్ల పట్టు కొనసాగుతోంది. దీంతో శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో కాంగ్రెస్‌ విఫలమైతే  షట్‌డౌన్(shutdown) ప‌రిస్థితి ఎదురుకాక త‌ప్ప‌ద‌ని అంటున్నారు.  

ఏం జ‌రుగుతుంది? 

ఒక వేళ ద్ర‌వ్య వినిమ‌య బిల్లు ఆమోదం పొంద‌క‌పోతే.. ముందుగా ప్ర‌భుత్వం ష‌ట్ డౌన్(shutdown) ప్ర‌క‌టిస్తుంది. దీంతో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల(Employees) వేత‌నాలు నిలిచిపోనున్నాయి. వీరి సంఖ్య‌ 8,75,000గా ఉంద‌ని తెలిసింది. అంతేకాదు.. వీరికి సెల‌వు ప్ర‌క‌టిస్తారు. అంటే.. ఆఫీసుల‌కు రావొద్ద‌ని స‌మాచారం అందిస్తారు. అయితే.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వంటి అత్య‌వ‌స‌ర‌ విభాగాల్లో ప‌నిచేసే మరో 14 లక్షల మంది మాత్రం సేవ‌ల‌ను కొన‌సాగించాల్సి ఉంటుంది. కానీ, వీరికి వేత‌నాలు ఇస్తారా?  ఇవ్వరా? అనే విష‌యంపై సందిగ్ధ‌త నెల‌కొంది. ఈ విష‌యంపై అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ సంఘం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. షట్‌డౌన్‌ ముగిశాకే.. వారికి వేతనాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ముఖ్యంగా రవాణా శాఖ, ఇతర రంగాలపై షట్‌డౌన్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌నుంద‌ని అధికార వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే.. భ‌ద్ర‌తా రంగం(పోలీసులు త‌దిత‌ర‌), వైద్యంపై మాత్రం ష‌ట్ డౌన్ ప్రభావం ఉండదని తెలిపాయి. వీరికి సంబంధించిన ప్రయోజనాలను కాంగ్రెస్‌ ప్రత్యేక చట్టం రూపంలో ఆమోదం తెలుపుతుంది. కానీ, సోషల్‌ సెక్యూరిటీ ఆఫీస్‌లు అందించే ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయి. 

గ‌తంలో కూడా.. 

అమెరికా ప్ర‌జ‌ల‌కు ష‌ట్ డౌన్(shutdown) కొత్త‌కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో కూడా అమెరికా ప్ర‌భుత్వం ష‌ట్ డౌన్ (shutdown) విధించింది. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు ఆర్థిక లావాదేవీలు కుంటుబ‌డ్డాయి. అప్ప‌ట్లో డొనాల్డ్‌ ట్రంప్ అధ్యక్షుడి(President)గా ఉన్నారు. అయితే.. చిత్రం ఏంటంటే ఒక్క‌సారి ష‌ట్ డౌన్ వ‌చ్చాక అది ఎంత కాలం ఉంటుంద‌నేది చెప్ప‌డం క‌ష్టం. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుందో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget