US Teacher: అమెరికా స్కూళ్లలో మగపిల్లలపై లేడీ టీచర్ల అఘాయిత్యాలు - డ్రగ్స్, లిక్కర్ ఇచ్చి రేప్ చేసినందుకు టీచర్‌కు 30 ఏళ్లు జైలు శిక్ష
US Crime: అమెరికాలో విద్యార్థులను లైంగికంగా వేధించే టీచర్ల సంఖ్య పెరుగుతోంది. తాాజాగా ఇలా చేసిన ఓ టీచర్ కు అక్కడి కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధిచింది.
US Teacher Rape Case : అమెరికాలోని మేరీ ల్యాండ్ రాష్ట్రంలో ఓ కోర్టు టీచర్ గా పని చేస్తున్న సమయంలో మైనస్ స్టూడెంట్ తో అదే పనిగా శృంగారానికి ప్రేరేపించిన కారణంతో ముఫ్పై ఏళ్ల జైలు శిక్ష విధింది. మేరీల్యాండ్ లోని ఓ స్కూల్ లో పని చేస్తున్న మెలిస్సా మారీ కర్టీస్ తన క్లాస్‌లోని ఓ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుంది. అమెరికా చట్టాల ప్రకారం మైనర్లను సెక్స్ కు ప్రోత్సహించడం చట్ట విరుద్ధమే కాదు తీవ్రమైన నేరం కూడా. ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో 2015లోనే కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విచారణలో కర్టీస్ చేసింది నిజమేని తేలడంతో తాజాగా శిక్ష విధించారు. ఆమెకు 30 ఏళ్ల శిక్ష విధించారు.
టాయిలెట్‌లో ఫోన్ చూస్తూ కూర్చుంటే అక్కడ క్యాన్సర్ రావొచ్చు - సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
టీచర్ సెక్స్‌కు ప్రేరేపించిన విద్యార్థి కూడా తనతో ఆ టీచర్ వ్యవహరించిన విధానాన్ని కోర్టులో చెప్పారు. ఈ ఘటన జరిగినప్పుడు బాధితుడు అయిన విద్యార్థికి 14 ఏళ్లు మాత్రమే. నిందితురాలు అయిన కర్టీస్ వయసు 22 ఏళ్లు. ఒక్క సారి కాకుండా కొన్ని నెలల పాటు ఈ లైంగిక దాడి జరిగింది. శృంగారం కోసం విద్యార్థిని పలు చోట్లకు తీసుకెళ్లింది. ఒక్కో సారి స్కూల్‌తో పాటు తన కారు అలాగే తన ఇంటికి కూడా పలుమార్లు తీసుకెళ్లింది. శృంగం సమయంలో విద్యార్థికి అల్కాహాల్‌తో పాటు డ్రగ్స్ కూడా ఇచ్చేదని కోర్టులో నిరూపితమయింది. ఇలా మొత్తం ఇరవై సార్లు చేసినట్లుగా గుర్తించారు .
ప్రస్తుతం కర్టీస్ వయసు 31 ఏళ్లు.గతంలో ఆమె ఏడాది పాటు జైల్లో ఉన్న తరవాత బయటకు వచ్చారు. అప్పటి నుంచి జరుగుతున్న విచారణలో తాజాగా మొత్తం నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో శిక్షను అమెరికా కోర్టు ఖరారు చేసింది. అమెరికాలో విద్యార్థులపై ఇలా లైంగిక దాడులు చేసేవారిలో మహిళా టీచర్లే ఎక్కువగా ఉంటున్నారు. వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి కేసులు పెరుగుతూండటం అమెరికా సమాజంలో ఆందోళనకు కారణం అవుతోంది.
అమెరికా స్కూళ్లలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల అన్నా అబ్బాయిలపై టీచర్లు చేస్తున్న ఘోరాలే హైలెట్ అవుతూండటంతో అమెరికాలో మారుతున్న సామాజిక , నేర పరిస్థితులకు అద్దం పడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల ఓ టీచర్ తన స్టూడెంట్స్ ను లైంగికంగా వేధిస్తూ దొరికిపోవడంతో ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు.