Coldplay Love Story: పరువు తీసి మానసికంగా ఇబ్బంది పెట్టారు - కోల్డ్ ప్లేపై కోర్టుకెక్కిన రాసలీలల సీఈవో
Ex Astronomer CEO: కోల్డ్ ప్లే మ్యూజిక్ కాన్సర్ట్ లో .. హెచ్‌ఆర్ చీఫ్ తో సరసాలు చేస్తూ దొరికిపోయిన అమెరికన్ సీఈవో ఇప్పుడు కోర్టుకెక్కారు. మానసికంగా దెబ్బకొట్టారని అంటున్నారు.

Ex Astronomer CEO Andy Byron Sue Coldplay: ఇంట్లో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి.. ఆఫీసులో ప్రియురాలిని తీసుకుని కోల్డ్ ప్లే మ్యూజిక్ కాన్సర్ట్ కు వెళ్లిన ఆస్ట్రోనమర్ కంపెనీ సీఈవో అన్నీ కోల్పోయారు. ఉద్యోగం కూడా పోయింది. ఇలా చేసి తనను మానసికంగా దెబ్బకొట్టారని కోర్టుకెళ్లాలని ఆలోచిస్తున్నారు.
మసాచుసెట్స్‌లోని గిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్‌ప్లే కచేరీలో, "కిస్ క్యామ్" (Jumbotron) కెమెరా ఆండీ బైరన్, ఆస్ట్రోనమర్ కంపెనీ హెచ్‌ఆర్ చీఫ్ క్రిస్టిన్ కాబోట్ (Kristin Cabot)లను చూపించింది. వీరిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. వారు తమను తాము స్క్రీన్‌పై చూసిన వెంటనే కెమెరా నుండి దాక్కునేందుకు ప్రయత్నించారు. కోల్డ్‌ప్లే ఫ్రంట్‌మ్యాన్ క్రిస్ మార్టిన్ (Chris Martin) ఈ దృశ్యాన్ని చూసి, "వీరు ఎవరో ఒక అఫైర్‌లో ఉన్నారా లేక చాలా సిగ్గుపడుతున్నారా?" అని హాస్యాస్పదంగా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"A song cost me my family, my job, and everything I built." – Tech CEO Andy Byron is threatening to sue Coldplay, while a case with HR chief Kristin Cabot is destroying his life. His wife is demanding a $50 million divorce, his children are gone, and the chaos in the boardroom is… pic.twitter.com/FZLWXesta6
— Brian Eastwood (@BrianEastwood_X) July 23, 2025
ఈ వీడియో వైరల్ కావడంతో, ఆండీ బైరన్ , క్రిస్టిన్ కాబోట్ అనైతిక సంబంధం ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఆస్ట్రోనమర్ కంపెనీ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. జూలై 19, 2025న ఆండీ బైరన్‌ను అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌లో ఉంచారు. క్రిస్టిన్ కాబోట్ కూడా రాజీనామా చేసింది. జూలై 20, 2025న బైరన్ తన CEO పదవికి రాజీనామా చేశాడు. దీనిని కంపెనీ బోర్డ్ ఆమోదించింది.
దీంతో ఆండీ బైరన్ కోల్డ్‌ప్లే బ్యాండ్‌పై , ఈవెంట్ నిర్వాహకులపై "మానసిక ఒత్తిడి" , "గోప్యత ఉల్లంఘన" ఆధారంగా దావా వేయాలని యోచిస్తున్నాడు. తన అనుమతి లేకుండా చిత్రీకరించారని, బహిరంగంగా అవమానించారని, కోల్డ్‌ప్లే తనను "మీమ్‌గా" మార్చిందని ఆరోపిస్తున్నాడు. ఈ ఘటన బైరన్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. అతని భార్య మేగన్ కెర్రిగన్ (Megan Kerrigan), బాన్‌క్రాఫ్ట్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలు విడిపోవడానికి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్ నుండి బైరన్ ఇంటిపేరును తొలగించింది. క్రిస్టిన్ కాబోట్ భర్త ఆండ్రూ కాబోట్, ప్రైవేటీర్ రమ్ CEO, కూడా ఈ ఘటనపై బహిరంగంగా స్పందించలేదు.
This is Andy Byron.
— Brennan Schlagbaum, CPA (@Budgetdog_) July 20, 2025
He just lost a $500k job as CEO at Astronomer for cheating on his wife...
But that's just the beginning.
Here's how much an affair actually costs: pic.twitter.com/UFjngZIxYR
ఈ ఘటన సోషల్ మీడియాలో అనేక మీమ్స్ ,టీవీ కార్యక్రమాలలో హాస్యాస్పద వ్యాఖ్యలకు దారితీసింది. గిల్లెట్ స్టేడియం గోప్యతా విధానం ప్రకారం, కచేరీకి హాజరైన వారిని CCTV కెమెరాలు లేదా ఫోటో/వీడియో రికార్డింగ్ ద్వారా చిత్రీకరించవచ్చని ఉంది. ఈ కారణంగా బైరన్ న్యాయపోరాటం విజయవంతం కాదని కొంత మంది నిపుణులు చెబుతున్నారు.





















