BSF Recruitment 2025: పదో తరగతి పాసైన వారికి గుడ్ న్యూస్, బీఎస్ఎఫ్‌లో 3,588 పోస్టులకు భారీ నోటిఫికేషన్
BSF Jobs 2025 | బీఎస్ఎఫ్ 3,588 ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి పాసైన వారు rectt.bsf.gov.in వెబ్‌సైట్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. .

BSF Recruitment 2025 | భద్రతా బలగాలలో చేరి సేవ చేయాలనుకున్న వారికి గుడ్ న్యూస్. సరిహద్దు భద్రతా దళం (BSF) కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏకంగా 3,588 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటే, ఇది వారికి గొప్ప అవకాశం. మీరు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. ఈ నియామకంలో పురుషులకు 3,406 పోస్టులు, మహిళలకు 182 పోస్టులు రిజర్వ్ చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేడు (జూలై 26, 2025)న ప్రారంభమైంది. ఆగస్టు 24, 2025 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. టెన్త్ పాస్ కావడంతో పాటు పాటు, కుక్, వాషర్‌మెన్, బార్బర్, స్వీపర్, టైలర్, ప్లంబర్, పెయింటర్ మొదలైన సంబంధిత ట్రేడ్‌లలో ITI సర్టిఫికేట్ లేదా పని చేసిన అనుభవం ఉండాలి.
అభ్యర్థుల వయసు ఆగస్టు 24, 2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, రిజర్వ్ చేసిన కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగలకు 5 సంవత్సరాలు, OBCలకు 3 ఏళ్లు సడలింపు ఇచ్చారు. మహిళలు, వికలాంగ అభ్యర్థులకు వయసు, దరఖాస్తు ఫీజులో రిలాక్సేషన్ సైతం లభిస్తుంది.
ఎంపిక ఎలా చేస్తారు..
సెలక్షన్ ప్రాసెస్‌లో మొదట శారీరక సామర్థ్య పరీక్ష (PET), శారీరక ప్రమాణాల పరీక్ష (PST) నిర్వహిస్తారు. తరువాత, అభ్యర్థులు 100 మార్కులకు రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది, ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. తరువాత, సంబంధిత ట్రేడ్ పరీక్ష నిర్వహిస్తారు. చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష (Medical Tests) ద్వారా తుది ఎంపిక చేస్తారు.
శాలరీ ఎంత ఇస్తారు..
బీఎస్ఎఫ్ తాజా పోస్టులకు జీతం లెవల్-3 కింద రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఉంటుంది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని అలవెన్సులు పొందుతారు.
దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి
దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, OBC, EWS కేటగిరీల అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ST అభ్యర్థులతో పాటు మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. వీరు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు BSF అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.inని సందర్శించాలి. ఈ వెబ్‌సైట్‌లో మీ వివరాలు నమోదు చేసుకోండి. అప్లికేషన్ ఫారం నింపాలి. అవసరమైన సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్ సైతం అభ్యర్థులు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారంను సబ్మిట్ చేయాలి. చివరగా, అప్లికేషన్ ఫారం ప్రింట్ అవుట్ తీసుకోవాలి. హాల్ టికెట్ డౌన్ లోడ్ సహాలు ఇతర భవిష్యత్ అవసరాలకు అది పనికొస్తుంది.






















