Elon Musk Recalls Taj Mahal Visit: తాజ్‌మహల్‌పై సడెన్‌గా ఈ లవ్ ఏంటి మస్క్ మామా! కొంప తీసి కొనేస్తావా?
Elon Musk Recalls Taj Mahal Visit: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా తాజ్‌మహల్‌పై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Elon Musk Recalls Taj Mahal Visit: టెస్లా సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. తాను 2007లో భారత్‌లో చేసిన పర్యటనను ప్రస్తావించారు. ఆ సమయంలో ఆయన తాజ్‌మహల్‌ను విజిట్ చేశారు. ఈ టూర్‌ను మస్క్ గుర్తు చేసుకున్నారు.
ఆగ్రా ఫోర్ట్‌లో ఉన్న పాలరాతి కట్టడాలకు చెందిన ఆ అర్కిటెక్చర్ అద్భుతంగా ఉందంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు మస్క్ స్పందించారు.
It is amazing. I visited in 2007 and also saw the Taj Mahal, which truly is a wonder of the world.
— Elon Musk (@elonmusk) May 9, 2022
మస్క్ ట్వీట్‌ను ఉద్దేశించి, పేటీఎం బాస్ విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. మొదటి టెస్లా కారును డెలివరీ చేయడానికి ఇండియాకు ఎప్పుడు వస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే మస్క్ మరోసారి ఇండియాలో పర్యటించే అవకాశం ఉన్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. మస్క్ సడెన్‌గా తాజ్‌మహల్ గురించి ట్వీట్ చేసేసరికి ఆయన ఇండియాకు రానున్నారని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా భారత ప్రవేశంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. భారత్‌లో విద్యుత్ వాహనాల (ఈవీ) దిగుమతిపై 100 శాతం సుంకం ఉందని, దీన్ని తగ్గించాలని టెస్లా కోరుతోంది. కొంతకాలం పాటు దిగుమతి చేసిన కార్లను విక్రయిస్తామని, ప్రజల నుంచి వచ్చే స్పందన బట్టి తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని చెబుతోంది.
Also Read: Coronavirus Cases India: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు- 10 మంది మృతి