Coronavirus Cases India: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు- 10 మంది మృతి
Coronavirus Cases India: దేశంలో కొత్తగా 2,288 కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతి చెందారు.
Coronavirus Cases India:
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 2,288 కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతి చెందారు. 3044 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVID19 | India reports 2,288 fresh cases, 3,044 recoveries, and 10 deaths in the last 24 hours. Total active cases 19,637. Daily positivity rate at 0.47% pic.twitter.com/8p0CdsLAgL
— ANI (@ANI) May 10, 2022
- మొత్తం కరోనా కేసులు: 4,31,07,689
- మొత్తం మరణాలు: 524103
- యాక్టివ్ కేసులు: 19637
- మొత్తం రికవరీలు: 42563949
మొత్తం కేసుల సంఖ్య 4,31,07,689కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 19637గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.05గా ఉంది. రికవరీ రేటు 98.74గా ఉంది.
వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా సోమవారం 13,90,912 మందికి టీకాలు అందించారు.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 190 కోట్ల 50 లక్షల 86 వేలు దాటింది. కరోనా ఫోర్త్ వేవ్ అంచనాల వేళ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రం మరింత వేగవంతం చేసింది. వీలైనంత మందికి వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది.
Also Read: South Korea's New President: దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్- కిమ్‌తో చర్చకు రెడీ
Also Read: Punjab News: పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ ఆఫీసుపై గ్రనేడ్ దాడి!