By: ABP Desam | Updated at : 10 May 2022 11:15 AM (IST)
Edited By: Murali Krishna
పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ ఆఫీసుపై గ్రనేడ్ దాడి! ( Image Source : ANI )
Punjab News:
పంజాబ్ మొహాలీలోని రాష్ట్ర ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి పేలుడు జరిగింది. ఈ దాడిలో భవనం మూడో అంతస్తులో ఉన్న ఓ కిటికీ, గోడలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ దాడితో పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఏం జరిగింది?
మొహాలీలోని సెక్టార్ 77, SAS నగర్‌లో ఉన్న పంజాబ్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో చిన్నపాటి పేలుడు జరిగింది. అయితే ఎటువంటి పాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం సీనియర్ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి. .
పేలుడు పదార్థం క్యాడ్రిడ్జ్ ఫొటోలను పోలీసులు విడుదల చేశా రు. అది రాకెట్-ప్రొపెల్డ్ గ్రనేడ్(ఆర్పీజీ)గా స్పష్టమవుతోంది. ఆర్పీజీలను గ్రనేడ్ లాంచర్ల ద్వారా ప్రయోగిస్తారు. ఇటీవల పంజాబ్‌లోని కర్నాల్, తరణ్ ప్రాంతాల్లో ఖలిస్థానీ ఉగ్రవాదులను అరెస్టు చేసి, పేలుడు పదార్థాల స్వాధీనం చేసుకున్నారు.
దీంతో ఇంటెలిజెన్స్ భవనంపై దాడి జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఉగ్రవాదుల నుంచి సీజ్ చేసిన పేలుడు పదార్థాలను ఇంటెలిజెన్స్ కార్యాలయ భవనంలోని మూడో అంతస్తులో భద్రపరుస్తామని, వాటిల్లో ఒకటి పేలి ఉంటుందని చెబుతున్నారు. దర్యాప్తు అనంతరం ఘటనపై పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.
సీఎం ఆరా
Mohali blast | Punjab CM Bhagwant Mann calls for a meeting at his residence at about 10 am today with DGP and other senior officers to seek a report on the course of action so far, in the matter
— ANI (@ANI) May 10, 2022
ఈ ఘటన వివరాలను ఉన్నతాధికారుల నుంచి సీఎం భగవంత్ మాన్ అడిగి తెలుసుకున్నారు. డీజీపీ సహా ఉన్నతాధికారులతో సీఎం తన నివాసంలో ఈరోజు భేటీ కానున్నారు. ఘటనపై పూర్తి నివేదికను అందజేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని సీఎం భగవంత్ మాన్ అన్నారు.
Also Read: Army Chief: చైనా ఉద్దేశం అదే అయితే భారత్ టార్గెట్ ఇదే: ఆర్మీ చీఫ్
Drone Shot Down: జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడికి యత్నం, బాంబులతో వచ్చిన డ్రోన్ కథువాలో కూల్చివేత
Mann Ki Baat: అక్కడ చెత్త వేయడం ఆపండి, మన గౌరవాన్ని కాపాడండి - మన్ కీ బాత్లో ప్రధాని విజ్ఞప్తి
Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?
Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు
Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!
Nepal Plane Missing: నేపాల్లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా
IPL 2022, GT vs RR Final: బట్లర్ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్ 'మాంత్రికుడు'! మిల్లర్కూ ఓ కిల్లర్ ఉన్నాడోచ్!
బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!
Crocodile vs Lions: వీడియో - ఒక మొసలి, మూడు సింహాలు - వామ్మో, ఫైట్ మామూలుగా లేదు!