Amazon Diwali 2025 Sale: అమెజాన్ దీపావళి సేల్స్ ప్రారంభం.. తక్కువ ధరకే ఖరీదైన ఫోన్లు, భారీ డిస్కౌంట్స్
Diwali 2025 Sale: మీరు దీపావళికి మీకు ఇష్టమైన ఫోన్, లేదా ఆఫర్ ప్రైజ్ కింద ఏదైనా మంచి మొబైల్ కొనాలనుకుంటే, అమెజాన్ సేల్ లో తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఐఫోన్ 16 వంటివి చౌకగా లభిస్తున్నాయి.

Amazon Diwali 2025 Sale | దీపావళికి కొన్ని రోజుల ముందు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి సేల్ ప్రారంభించింది. ఇందులో చాలా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు. కనుక, మీరు దీపావళి సందర్భంగా మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే లేదా ఎవరికైనా కొత్త ఫోన్‌ను బహుమతిగా ఇవ్వాలి అనుకుంటే, ఇది సరైన సమయం. ఈ దీపావళి సేల్‌లో ఖరీదైన ఫోన్‌లు కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి. అలాంటి కొన్ని డీల్స్‌పై ఒక లుక్కేయండి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా 5జీ (Samsung Galaxy S24 Ultra 5G)
కొరియా కంపెనీ Samsung అధికారిక వెబ్‌సైట్‌లో Galaxy S24 Ultra 5G ఫోన్ ధర లక్ష రూపాయలకు పైగా ఉంది, అయితే అమెజాన్‌లో ఈ ఫోన్ రూ. 75,749కి లిస్ట్ చేశారు. 6.8 అంగుళాల స్క్రీన్ కలిగిన ఈ ఫోన్‌లో Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇందులో 200MP ప్రైమరీ లెన్స్ కలిగిన క్వాడ్-కెమెరా సెటప్, 5,000 mAh బ్యాటరీ ఉన్నాయి.
ఐఫోన్ 16 (iPhone 16 (128 GB))
ఐఫోన్ 16 గత సంవత్సరం రూ. 79,900 ధరతో మార్కెట్లోకి వచ్చింది. తాజాగా అమెజాన్‌లో ఈ ఫోన్ రూ. 66,900కి లభిస్తుంది. ఇందులో 6.1 అంగుళాల డిస్‌ప్లే, 48MP మెయిన్ కెమెరా ఉన్నాయి. ఇందులో Apple A18 చిప్‌సెట్ ఉంది. ఇది Apple ఇంటెలిజెన్స్, మల్టీ టాస్కింగ్‌ను సులభంగా చేస్తుంది.
వన్ ప్లస్ (OnePlus 13 (12GB + 256GB))
వన్ ప్లస్ 13 ఫోన్ ధర రూ. 72,999, అయితే సేల్‌లో ఇది రూ. 63,999కి సొంతం చేసుకోండి. ఇందులో Snapdragon 8 Elite ప్రాసెసర్ వస్తుంది. ఇది 50MP ప్రైమరీ లెన్స్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీతో 100W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Google Pixel 10 5G (12GB + 256GB)
గూగుల్ పిక్సెల్ 10 5జీ మొబైల్ ధర సుమారు 80 వేలు ఉంటుంది. అయితే అమెజాన్ దీపావళి సేల్‌లో భాగంగా ఈ ఫోన్ రూ. 70,400కి లభిస్తుంది. ఈ ఫోన్‌పై దాదాపు 10,000 రూపాయల డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో Google Tensor G5 చిప్ సెట్, అప్‌గ్రేడెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఇది Gemini AI ఫీచర్లతో యూజర్లకు బెస్ట్ టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.






















