Dubai: లెబనాన్‌లో దాడులతో యూఏఈ అలర్ట్! పేజర్, వాకీ టాకీలపై నిషేధం
Dubai: దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు ఇదో ముఖ్య గమనిక. పేజర్లు, వాకీ-టాకీలను తీసుకెళ్లడాన్ని UAE పూర్తిగా నిషేధించింది. ఎవరి వద్దైనా దొరికితే పోలీసులు తీసుకుంటారు.
Dubai News: సెప్టెంబర్ 17న లెబనాన్ రాజధాని బీరూట్‌తో సహా పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే పేజర్లలో అకస్మాత్తుగా పేలాయి. ఏ కాలంలో 5000 పేజర్లు బ్లాస్ట్ అయ్యాయి. ఈ పేలుళ్ల ధాటికి 3 వేల మందికిపైగా గాయపడ్డారు.
ఈ పేలుడు తర్వాత ఒక్కసారిగా పెను విపత్తు జరిగింది. హిజ్బుల్లాను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. అంతే ఒక్కసారిగా పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ఇప్పుడు మిగతా దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా UAE మరింత అలెర్ట్‌గా ఉంటోంది. దుబాయ్‌కి వచ్చే విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులందరికి ఓ హెచ్చరిక జారీ చేసింది. పేజర్లు, వాకీ-టాకీలను తమ దేశానికి తీసుకురావడం నిషేధమనిపేర్కొంది. ఎవరైనా ప్రయాణికుడి వద్ద పేజర్లు, వాకీటాకీలు దొరికితే వాటిని దుబాయ్ పోలీసులు తీసుకుంటారని ప్రకటించింది.
లెబనాన్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది
పేజర్లు వాకీ-టాకీలు లెబనాన్‌లో పేలిన తర్వాత అక్కడ కూడా పేజర్లు, వాకీ టాకీలపై నిషేధం విధించింది. బీరుట్-రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే విమానాల్లో పేజర్లు, వాకీ-టాకీలను తీసుకెళ్లకుండా నిషేధించారు.
విమాన ప్రయాణాలు పునరుద్దరణ
ప్రస్తుతానికి UAE, లెబనాన్ మధ్య విమానాలు తిరగడం లేదు. అక్టోబర్ 8 వరకు ఈ రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను నిలిపేశారు. అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాక్ (బాస్రా, బాగ్దాద్), ఇరాన్ (టెహ్రాన్), జోర్డాన్ (అమ్మాన్)కి వెళ్లే సర్వీస్‌లను కూడా రద్దు చేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఇరాక్, ఇరాన్ మరియు జోర్డాన్‌కు విమాన సర్వీస్‌లు నిలిపివేసినట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే గురువారం నుంచి అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ అబుదాబి (AUH), టెల్ అవీవ్ (TLV) మధ్య విమాన సేవలు తిరిగి ప్రారంభించింది. దుబాయ్ నుంచి ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్‌కి కూడా విమాన సర్వీస్‌లు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.
Also Read: మొన్న హమాస్, నిన్న హిజ్బుల్లా, నేడు ఇరాన్- రేపు ఇజ్రాయెల్ లక్ష్యం ఎవరు?