అన్వేషించండి

China Dissident Escape:చైనా నుంచి సినిమా స్టైల్‌లో ఎస్కేప్‌! 68 ఏళ్ల పోలీస్ 30 గంటల సాహస గాథ!

China Dissident Escape:స్వేచ్ఛ కోసం 68 ఏళ్ల వయసులో రబ్బరు పడవపై 30 గంటల పాటు సముద్రాన్ని దాటి దక్షిణ కొరియా చేరుకున్న మాజీ పోలీస్‌. ఆయన సాహస ప్రయాణం వైరల్ అవుతోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 68 ఏళ్ల మాజీ పోలీస్ 30 గంటలు రబ్బరు పడవలో ప్రయాణించారు.
  • నౌక ఇంజిన్ చెడిపోయినా, అలలతో పోరాడి దక్షిణ కొరియా చేరారు.
  • చైనాలో రాజకీయ అసమ్మతివాదిగా ఉద్యోగం, స్వేచ్ఛ కోల్పోయారు.
  • నాలుగో ప్రయత్నంలో దక్షిణ కొరియా చేరి, మానవ హక్కుల రక్షణ కోరారు.

China Dissident Escape:ప్రపంచ చరిత్రలో స్వేచ్ఛ కోసం చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి. కానీ 68 ఏళ్ల వయసులో, కేవలం రబ్బరు పడవను నమ్ముకొని అలల ధాటిని తట్టుకొని 30 గంటలపాటు ఒంటరిగా ప్రయాణించిన పోలీస్ గాథ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతటి సాహస ప్రయాణంతో ఒక దేశ సరిహద్దులుదాటడం అనేది ఊహకందని అంశం. చైనాకు చెందిన మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుత రాజకీయ అసమ్మతివాది డాంగ్ గువాంగ్ పింగ్ ఈ గ్రేట్ ఎస్కేప్ సంచలనంగా మారింది. 

ఆ 30 గంటలు మృత్యువుతో పోరాటం

చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని వీహై తీరం నుంచి డాంగ్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన చేతిలో ఉన్నది ఒక చిన్న రబ్బరు పడవ మాత్రమే. 

ఈ ప్రయాణం సాఫీగా ఏం సాగలేదు. సుమారు 30 గంటలపాటు ఆయన నిద్ర లేకుండా సముద్రం మీద గడిపారు. దక్షిణ కొరియాలోని వెస్ట్రన్ తీరానికి చేరువవుతున్న సమయంలో పడవి ఇంజిన్ చెడిపోయింది. అలల ఉధృతికి ఆ చిన్న పడవ కొట్టుకుపోతుందో తెలియని స్థితి. పైగా 68 ఏళ్ల వయసు. రెండు రోజులుగా కంటి మీద కునుకు లేదు. శరీరం సహకరంచడం లేదు. అదృష్టవశాత్తు, దక్షిణ కొరియాలోని తేన్ కౌంటీ సమీపంలో స్థానిక మత్స్యకారులు ఆయనను గుర్తించి కోస్ట్ గార్డ్‌కు సమాచారం అందించారు. వారు వచ్చిన ఆయనను రక్షించడంతో ఈ సాహసయాత్ర ఒక కొలిక్కి వచ్చింది. 

ఎవరీ డాంగగ్ గువాంగ్‌పింగ్?

డాంగ్‌ గువాంగ్‌పింగ్‌ ఒకప్పుడు చైనాలోని జెంగ్‌జౌ నగరంలో పోలీస్ అధికారిగా పని చేశారు. అయితే 1989లో జరిగిన తియానన్మెన్ స్క్వేర్ ఊచకోతకు వ్యతిరేకంగా, ఆ ఘటన జరిగిన పదేళ్ల తర్వాత సంతకాల సేకరణలో పాల్గొనడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ఘటనతో ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టింది. ఫలితంగా ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయారు. 2001లో తన కార్యకలాపాల వల్ల మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. తిరిగి 2014లో తియానన్మెన్ స్మారక కార్యక్రమంలో పాల్గొన్నందుకు అరెస్టు అయ్యారు. చైనాలో ఉంటే తన ప్రాణాలకు ముప్పు ఉందని, కనీసం తన కుటుంబాన్ని కలుసుకోలేనని ఆయనకు అర్థమైంది. 

ఇది నాలుగో ప్రయత్నం- పట్టు వదలని విక్రమార్కుడు   

డాంగ్ గువాంగ్‌పింగ్ స్వేచ్ఛ కోసం ప్రయత్నించడం ఇది మొదటిసారి కాదు.గతంలో మూడుసార్లు ఆయన విఫలమయ్యారు. మొదటి సారి తన భార్య, కుమార్తెతో కలిసి థాయ్‌లాండ్ పారిపోయి ఐక్యరాజ్యసమితి ద్వారా శరణార్థి హోదా పొందాలని ప్రయత్నించారు. ఆయన కుటుంబానికి కెనడా ఆశ్రయం కల్పించినప్పటికీ, థాయ్ అధికారులు డాగ్‌ను తిరిగి చైనాకు అప్పగించారు. అక్కడ ఆయనకు మూడేళ్ల ఆరు నెలల జైలు శిక్ష పడింది. 

జైలు నుంచి విడుదలయ్యాక, తైవాన్‌ ఆధీనంలో ఉండే కిన్మెన్ ద్వీపానికి ఈదుకుంటూ వెళ్లాలని రెండోసారి ప్రయత్నించి విఫలయ్యారు. అక్రమంగా వియాత్నాం సరిహద్దు దాటారు. కానీ 2022లో అక్కడి ప్రభుత్వం ఆయనను తిరిగి చైనాకు పంపేసింది. ఈసారి 11 నెలల జైలు శిక్ష అనుభవించారు. 

ప్రస్తుతం డాంగ్ దక్షిణ కొరియా అధికారుల అదుపులో ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు నమోదైంది. అయితే ఆయనను మళ్లీ చైనా పంపించవద్దని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు దక్షిణ కొరియా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 

ప్రస్తుతం కెనడాలో ఉన్న డాంగ్ కుమార్తె కేథరీన్ డాంగ్ తన తండ్రి కోసం ఎదురు చూస్తోంది. చైనాలో ఆయనకు అన్యాయం, వేధింపులు తప్ప మరేమీ దొరకవు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

Frequently Asked Questions

డాంగ్ గువాంగ్ పింగ్ ఎవరు?

డాంగ్ గువాంగ్ పింగ్ చైనా మాజీ పోలీస్ అధికారి మరియు రాజకీయ అసమ్మతివాది. అతను మానవ హక్కుల కార్యకలాపాలలో పాల్గొన్నందుకు చైనాలో అనేకసార్లు అరెస్టు చేయబడ్డాడు.

డాంగ్ గువాంగ్ పింగ్ చేసిన సాహసయాత్ర ఏమిటి?

68 ఏళ్ల డాంగ్ గువాంగ్ పింగ్ కేవలం రబ్బరు పడవలో 30 గంటలపాటు ప్రయాణించి చైనా నుండి దక్షిణ కొరియాకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.

డాంగ్ గువాంగ్ పింగ్ గతంలో స్వేచ్ఛ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు?

డాంగ్ గువాంగ్ పింగ్ గతంలో మూడుసార్లు స్వేచ్ఛ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. థాయ్‌లాండ్, కిన్మెన్ ద్వీపం, మరియు వియత్నాం సరిహద్దులను దాటడానికి ప్రయత్నించారు, కానీ ప్రతిసారీ చైనాకు తిరిగి పంపబడ్డారు.

ప్రస్తుతం డాంగ్ గువాంగ్ పింగ్ పరిస్థితి ఏమిటి?

ప్రస్తుతం డాంగ్ గువాంగ్ పింగ్ దక్షిణ కొరియా అధికారుల అదుపులో ఉన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు అతన్ని చైనాకు తిరిగి పంపవద్దని కోరుతున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget