అన్వేషించండి

US Presidential Debate: ట్రంప్‌ గెలిస్తే శరీరాలపై హక్కు కోల్పోతారు- మహిళలకు హారిస్‌ హెచ్చరిక- ఘాటుగా బదులిచ్చిన మాజీ అధ్యక్షుడు!

US Elections 2024:అమెరికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్‌ హాట్ హాట్‌గా సాగింది. డొనాల్డ్ ట్రంప్‌, కమలాహారిస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు.

America Elections 2024: అమెరికాకు మళ్లీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే మహిళల శరీరాలపై హక్కలను శాసించేలా ప్రభుత్వాలు తయారవుతాయని వైస్‌ ప్రెసిడెంట్ కమలాహారిస్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రెసిడెన్షియల్‌ ఎలక్షన్స్‌లో పోటీలో నిలిచిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ముఖ్యంగా నేషనల్ అబార్షన్ చట్టంపై ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. ఈ అంశపై స్పందించిన ట్రంప్‌.. డెమోక్రాట్ల మనస్సులు రాడికల్ మయం అయ్యాయంటూ వ్యాఖ్యానించారు.

అబార్షన్‌ రైట్స్‌కు సంబంధించి సుప్రీం తీర్పుపై మండిపడ్డ కమలా.. ట్రంప్ అనుకూల జస్టిస్‌ వచ్చేలా చక్రం తిప్పారని అన్నారు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే నేషనల్ అబార్షన్ హక్కులపై బ్యాన్ పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమెరికన్లు తమ శరీరం సహా తమ రీప్రొడక్టివ్ సిస్టమ్స్‌కు సంబంధించి నిర్ణయాలు తమవై ఉంటాయని భావిస్తారని.. ట్రంప్‌ మాత్రం ఆ పరిస్థితి లేకుండా చేస్తారని హెచ్చరించారు. అమెరికన్ల శరీరాలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలు ఉండకూడదన్నారు. అబార్షన్ బిల్లు విషయంలో ట్రంప్ అన్నీ అసత్యాలే చెబుతున్నారని అన్నారు.

హారిస్ వస్తే ఇజ్రాయెల్ ఉండదు.. ట్రంప్ వస్తే అమెరికన్లను చైనాకు అమ్మేస్తారు

ఇజ్రాయెల్ విషయంలో కమలాహారిస్‌ మొదటి నుంచి వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్నారని ట్రంప్ దుయ్యబట్టారు. ఆమె అధ్యక్షురాలుగా ఎన్నికైతే రెండేళ్లలోనే తన విధానాలతో ఇజ్రాయెల్ లేకుండా చేస్తారని మాజీ ప్రెసిడెంట్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా బదులిచ్చిన హారిస్.. మళ్లీ ట్రంప్ వస్తే అమెరికన్లను చైనాకు అమ్మేస్తారని అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ తన లంచ్‌లోకి ట్రంప్‌ను ఆరగించేస్తారంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.

Also Read: అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రదాడికి 23 ఏళ్లు- అయినా మానని గాయాలు

చైనా విషయంలో నాడు ట్రంప్ మెతక వైఖరి అవలింబించడం వల్లే నేడు డ్రాగన్‌ కోరలు చాస్తోందని కమల విమర్శించారు. ఎకనమిక్ పాలసీలపై  మాట్లాడిన హారిస్‌.. దేశంలోని ఎకనమిస్టులు అందరూ తనకే మద్దతుగా ఉన్నారని చెప్పారు. ట్రంప్‌కి మాత్రం దేశంలోని బిలయనీర్లు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. తన విధానాలతోనే అమెరికా తిరిగి ఆర్థికంగా పుంజుకుంటుందని ట్రంప్ తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఇన్‌ఫ్లేషన్‌ను కంట్రోల్ చేస్తామని.. అందరికీ ఉద్యోగ అవకాశాలు సహా అమెరికన్ల ఆర్థిక పురోగతికి కృషి చేస్తామని చెప్పారు.

తనపై జరిగిన హత్యాయత్నం పూర్తిగా డెమోక్రాట్ల కుట్రేనని ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. డెమోక్రాట్లు తనను రాజ్యాంగ వ్యతిరేకిగా చెబుతారన్న ఆయన.. వాస్తవానికి తనను అంతమొందించి రాజ్యాంగాన్ని మట్టుపెట్టాలని చూసింది వారేనని పేర్కొన్నారు. 2021 జనవరి 6 ఘటన అమెరికన్లు ఎప్పటికీ మరిచిపోరని.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేశారని కమలా హారిస్ అన్నారు. ఆ ఘటన సమయంలో ట్రంప్‌ తన వైఖరి సరైనదేనని పునరుద్ఘాటించారు. ఆ దాడిలో పాల్గొన్న వారి పట్ల ప్రభుత్వం న్యాయవ్యవస్థ అమానుషంగా వ్యవహరించడం సరికాదన్నారు. హైతీ నుంచి వచ్చిన వలసదారుల పట్ల డిబేట్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాళ్లు తమ పెంపుడు జంతువులను కూడా వదలకుండా తింటున్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.  

Also Read: అమెరికా అధ్యక్షఎన్నికల్లో గెలిచేదెవరు? సర్వేలు ఏం చెబుతున్నాయి? మొగ్గు ట్రంప్‌ వైపా లేగా హారిస్‌ వైపా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Prabhas: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
Embed widget