US Elections 2024: అమెరికా అధ్యక్షఎన్నికల్లో గెలిచేదెవరు? సర్వేలు ఏం చెబుతున్నాయి? మొగ్గు ట్రంప్ వైపా లేగా హారిస్ వైపా ?
America News: గతంలో ఒకసారి ఓడించిన డొనాల్డ్ ట్రంప్‌ను మళ్లీ అధ్యక్షుడిని చేయాలనుకుంటున్నారా లేక వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పీఠంపై తొలి సారి ఒక మహిళకు అవకాశం కల్పించాలని అనుకుంటున్నారా ..
![US Elections 2024: అమెరికా అధ్యక్షఎన్నికల్లో గెలిచేదెవరు? సర్వేలు ఏం చెబుతున్నాయి? మొగ్గు ట్రంప్ వైపా లేగా హారిస్ వైపా ? Who is next American president trump or harris and What is suggesting prepoll surveys US Elections 2024: అమెరికా అధ్యక్షఎన్నికల్లో గెలిచేదెవరు? సర్వేలు ఏం చెబుతున్నాయి? మొగ్గు ట్రంప్ వైపా లేగా హారిస్ వైపా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/10/7ef81ab664e954b533c013307064c3111725952237559215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
America Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలంటేనే ప్రపంచం మొత్తం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. USAలో అధ్యక్షుల జయాపజయాలు అంతగా ఈ ప్రపంచంపై ప్రభావం చూపగలవు. అసలు అమెరికన్లు ఏమనుకుంటున్నారు. వాళ్లు గతంలో ఒకసారి ఓడించిన డొనాల్డ్ ట్రంప్‌ను మళ్లీ అధ్యక్షుడిని చేయాలనుకుంటున్నారా లేక వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పీఠంపై తొలిసారి ఒక మహిళకు అవకాశం కల్పించాలని అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తే.. సర్వేలు మాత్రం కమలా హారిస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. నవంబర్ 5న అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్క్షన్‌లు జరగనున్నాయి.
ఎవరు ముందంజలో ఉన్నారు ?
కొన్ని వారాల క్రితం ప్రస్తుత ప్రెసిడెంట్ అధ్యక్ష ఎన్నికల పోరు నుంచి తప్పుకొంటానని చెప్పేవరకు మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కే మొగ్గు ఉన్నట్లు అనేక సర్వేలు పేర్కొన్నాయి. ఆ సమయంలో హారిస్ కూడా ట్రంప్ ముందు నిలవలేరన్న వాదన కూడా వినిపిస్తూ వచ్చింది. ఎప్పుడైతే బైడెన్ తప్పుకొని కమలకు తన మద్దతు ప్రకటించాడో ఒక్క సారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్రంప్‌కి హారిస్ సరైన కంటెస్టెంట్‌గా మారారు. రీసెంట్ నేషనల్ సర్వేలో
ట్రంప్‌కి 44 శాతం మంది అమెరికన్లు మద్దతు తెలిపితే 47 శాతం మంది కమలాహారిస్‌కు జై కొట్టారు. ఆగస్టు 22న అమెరికన్లను ఉద్దేశించి హారిస్.. న్యూవే ఫార్వార్డ్ అంటూ ఇచ్చిన స్పీచ్‌తో ఒక్క సారిగా డొనాల్డ్‌ను వెనక్కి నెట్టారని సర్వేల ద్వారా తెలుస్తోంది. మొదటి నుంచి 44 శాతం మంది అమెరికన్లు మాజీ అధ్యక్షుడి పక్షాన ఉండగా అందులో పెద్ద ఛేంజ్ ఏమీ కనిపించలేదని సర్వేలు చెబుతున్నాయి. ఐతే గత అధ్యక్ష ఎన్నికల చరిత్ర చూస్తే మాత్రం ప్రజల ఓట్ల కంటే కూడా ఎన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఎలక్టోరల్ కాలేజ్ సీట్లు సాధించారన్న దానిపై మాత్రమే అధ్యక్ష పీఠం దక్కే విషయం ఆధారపడి ఉంటుంది కాబట్టి.. ఇప్పుడే ఒక అంచనాకి రాలేమని ఎలక్షన్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ పరిస్థితి ఎవరి వైపు ఉన్నాయి?
ఈ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్‌లో ఏడు రాష్ట్రాల్లో పోటీ తీవ్రంగా ఉంది. నేషనల్ పోల్స్‌తో పోలిస్తే స్టేట్ పోల్స్‌లో తీవ్ర పోటీ ఉన్నట్లు వెల్లడైంది. పెన్సిల్వేనియా సహా అనేక రాష్ట్రాల్లో ఇద్దరి అభ్యర్థుల మధ్య కేవలం వన్ పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఎలక్టోరల్ ఓట్లు 270 సాధించాలంటే పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు సాధించాల్సి ఉంటుంది.
16 ఎలక్టోరల్ ఓట్లున్న జార్జియాలో హారిస్ ఒక ఓటు వెనుకంజలో ఉండగా.. 11 ఎలక్టోరల్ ఓట్లున్న అరిజోనాలో ట్రంప్ ఒక ఓటు వెనుకపడ్డారు. నెవడాలో హారిస్ కంటే ట్రంప్ ఒక ఓటు ఆధిక్యంలో ఉండగా 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియాలో ట్రంప్ ఒక ఓటు ముందంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 16 స్థానాలున్న నార్త్ కరోలినాలో ట్రంప్ కాస్త వెనకపడగా .. మిషిగన్, విస్కిన్‌సన్‌లో హారిస్ 2 నుంచి 3 ఎలక్టోరల్ స్థానాలు ఆధిక్యంలో ఉన్నారు. ఈ సర్వేస్టాటిస్టిక్స్ ను బట్టి చూస్తే హోరాహోరీ తప్పదని తెలుస్తోంది. 2016 ఎన్నికల్లోనూ సర్వేలన్నీ ట్రంప్‌నకు వ్యతికేరంగా ఉన్నప్పటికీ ఆయనే విజయం సాధించారు. ఈక్ర మంలో నవంబర్ 5 ఎన్నికల్లో ఓటర్లు ఎవరి పక్షం వహిస్తారో అన్న ఉత్కంఠ డెమెక్రాట్లు, రిపబ్లికన్లతో పాటు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ ఎన్నికల్లో భారతీయ మూలాలున్న హారిస్ విజయం సాధిస్తే తొలి మహిళా అమెరికన్ ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టిస్తారు.
Also Read: సోషల్ మీడియా వాడకంపై భారీ ఆంక్షలు- కొత్త చట్టం తీసుకొస్తున్న ఆస్ట్రేలియా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)