భూమ్మీద కొన్ని రహస్య ప్రదేశాలు ఉన్నాయి..వాటి దగ్గరకు వెళ్లేంత సాహసం చేయొద్దు
చాలా యేళ్ల నుంచి అమేరికాలో కొన్ని ప్రదేశాలకు మనుషులు వెళ్లటం నిషిద్ధం. కనీసం ఆ దరిదాపుల్లో అడుగు కూడా పెట్టనివ్వరు. ఎన్నో యేళ్ల నుంచి మిస్టరీగా ఉండిపోయిన ఆ ప్రదేశాలివే.
Forbidden Places In The World: సాహసయాత్రలంటే ఇష్టపడే వారు చాలామందే ఉంటారు. కానీ ఎవరూ వెళ్లకూడని రహస్య ప్రదేశాలు భూమ్మీద కొన్ని ఉన్నాయి. ఎందుకు వెళ్ళలేమో చూద్దామని వెళ్లటం ప్రమాదకరమే. ఆ రహస్య ప్రదేశాలేమిటో, ఎందుకు అక్కడికి వెళ్లకూడదో తెలుసుకుందాం.
అడుగు పెట్టలేం
ఆ ప్రాంత చరిత్రను బట్టి, మనుషుల్ని అటు వైపుగా వెళ్ళనివ్వకపోవటానికి అనేక కారణాలున్నాయి. కొన్ని కారణాలు మనుషులు గుర్తించగలిగినవి అయితే, మరికొన్ని ప్రదేశాలకు సంబంధించిన రహస్యాలు శతాబ్దాలుగా అంతు చిక్కట్లేదు. చాలా యేళ్ల నుంచి అమెరికాలో కొన్ని ప్రదేశాలకు మనుషులు వెళ్లటం నిషిద్ధం. కనీసం ఆ దరిదాపుల్లో అడుగు కూడా పెట్టనివ్వరు. ఎన్నో యేళ్ల నుంచి మిస్టరీగా ఉండిపోయిన ఆ ప్రదేశాలివే.
నార్త్ బ్రదర్ ఐలాండ్
న్యూయార్క్ సిటీ( New York City)లోని నార్త్ బ్రదర్ ఐలాండ్ (North Brother Island)దరిదాపుల్లోకి కూడా ఎవర్నీ వెళ్ళనివ్వరు. గతంలో ఈ ప్రదేశాన్ని అంటువ్యాధులు గల రోగుల కోసం హాస్పిటల్ గా ఉపయోగించారట. ఆ తర్వాత డ్రగ్స్‌కు బాాని అయిన వారి కోసం వాడారట. కొన్నేళ్ల తరవాత మిలటరీలో గాయపడ్డ వారి కోసం ఈ ప్రదేశాన్ని వాడారు. ప్రదేశం ఇపుడు మూతపడి ఎన్నో యేళ్లయింది. కానీ ఇప్పటికీ మనుషుల్ని అటు వైపుగా వెళ్ళనివ్వకపోవటానికి బలమైన కారణం ఇంకా ఏదో ఉండి ఉండాలి. అదేమిటన్నది ఎవరికీ తెలియదు.
ది వాటికన్ సీక్రెట్ లైబ్రరీ( Secrets Of The Vatican Library)
వాటికన్ సిటీ(Vatican City )లోని ది వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్ గురించి తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఈ లైబ్రరీ 50 మైళ్ల పొడవుతో కట్టిన బుక్ షెల్ఫ్ లలో, ఒక్కో విషయానికి సంబంధించి 35,000 వేల క్యాటలాగులతో పుస్తకాలు నిండి ఉంటాయి. ఈ పుస్తకాల్లో అమెరికా చరిత్రకు సంబంధిచిన రహస్య విషయాలు ఉన్నాయి. 12 శతాబ్దాల చరిత్ర డాక్యుమెంట్లు ఈ ఆర్కైవ్ నిండా ఉన్నాయి. ఈ రహస్యాలు తెలుసుకోవటానికి పబ్లిక్ కు అనుమతి లేదు. రీసెర్చ్ స్కాలర్లు కూడా ఇందులో విషయాన్ని చదవాలంటే 75 సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది.
బొహేమీయన్ రెడ్ వుడ్ అడవుల్లో ప్రతీ ఎండాకాలం ఏం జరుగుతోంది?
బొహేమియన్ గ్రోవ్(Bohemian Groove) అనేది నార్త్ కాలిఫోర్నియా(North California)లో కొందరు సొసైటీలో ఉన్నతస్థానంలో ఉన్న పురుషులతో ఏర్పాటు చేసుకున్న ఒక ప్రైవేట్ క్లబ్. ఇక్కడికి అనుమతి ఉన్నవారు మాత్రమే వెళ్తారు. ఈ క్లబ్ ప్రతీ సంవత్సరం ఎండాకాలంలో మాత్రమే ఓపెన్ చేస్తారు. ఇది సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి సీక్రెట్లు మాట్లాడుకోవటానికి అక్కడి రైట్ వింగ్ రాజకీయ సపోర్టర్లు ఏర్పాటు చేసుకున్న ఒక క్లబ్ అని రూమర్ కూడా వినిపిస్తూ ఉంటుంది.
ఆ వారియర్ల రక్షణ దేని కోసం?
చైనా(China)కు తొలి రాజైన ఖిన్ షీ హువాంగ్(Khin Shi Huang) సమాధిని టెర్రకోట వారియర్ల శిల్పాలను రక్షణగా ఏర్పాటు చేసిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. చైనాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంతాన్ని తవ్వినపుడు వారియర్లవి దాదాపు 7000 శిల్పాలు బయటపడ్డాయి. ఇందులో ఒక శిల్పానికి ఇంకో దానితో పోలిక ఉండదు. ఒక్కోటి ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఈ శిల్పాలు రక్షణగా ఉన్నది కేవలం సమాధికి మాత్రమే కాదు. లోపల ఇంకా ఏదొ రహస్యం ఉండే ఉంటుంది అని అక్కడి ప్రజలు చెప్పుకుంటారు.