అన్వేషించండి

Danger Paracetamol : పారాసిట్మాల్‌ అతిగా వాడుతున్నారా..? మీ కాలేయం ఖతమైనట్టే.!

Paracetamol Damaged Liver: పారాసిట్మాల్‌ అతిగా తీసుకోవడం వల్ల కాలేయంపై దుష్ప్రభావం పడుతుందని పరిశోధనలో తేలింది. సిరోసిస్‌, హెపటైటిస్‌, కేన్సర్‌ వంటి వ్యాధులు బారినపడొచ్చు.

Paracetamol Side Effects: కాస్త జ్వరం ఉంటే చాలు పార్మా సిట్మాల్‌ వేస్తుంటారు.. బాడీ పెయిన్స్‌ ఉన్నా మెడికల్‌ స్టోర్‌ నుంచి పారాసిట్మాల్‌ తెచ్చి వేసుకుంటారు. డాక్టర్‌ సలహా కూడా తీసుకోరు. జ్వరం, బాడీ పెయిన్‌ అని వైద్యుల వద్దకు వెళితే 90 శాతం మంది వైద్యులు ఇచ్చే మందులో పారాసిట్మాల్‌ తప్పక ఉంటోంది. ఇదే అదునుగా చాలా మంది వైద్యులతో సంబంధం లేకుండానే ఈ మందు వాడడాన్ని అలవాటుగా చేసుకుంటున్నారు. ఈ అలవాటు అత్యంత ప్రమాదకరమని ఓ పరిశోధనలో తేలింది. పారాసిట్మాల్‌ టాబ్లెట్‌ అతిగా తీసుకోవడం వల్ల కాలేయానికి డ్యామేజ్‌ అవుతుందని ఆ పరిశోధనలో వెల్లడైంది. స్కాట్లాండ్‌లోని ఎండినోబరో వర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. స్కాటిష్‌ నేషనల్‌ బ్లడ్‌ ట్రన్స్‌ఫ్యూజన్‌ సర్వీస్‌తో కలిపి ఎలుకలపై జరిపిన పరిశోధనలో.. అతిగా పారాసిట్మాల్‌ తతీసుకోవడం వల్ల ఆ డ్రగ్‌లోని హానికరమైన పదార్థాలు(టాక్సిన్స్‌) కాలేయానికి కీడు చేస్తాయని తేల్చారు. మనుషులపైనా ఇటువంటి ఇలాంటి దుష్ప్రభావాలనే కనుగొన్నట్టు వెల్లడించారు. ఈ పరిశోధనా పత్రాలు సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 

తీవ్రమైన వ్యాధుల ముప్పు

పారాసిట్మాల్‌ అతిగా తీసుకోవడం వల్ల కాలేయంపై దుష్ప్రభావం పడుతుందని పరిశోధనలో తేలింది. సిరోసిస్‌, హెపటైటిస్‌, కేన్సర్‌ వంటి వ్యాధులు బారినపడే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడించారు. కాలేయంలోని కణజాలం గోడలు ధృడంగా ఉండి.. కణాల మధ్య సంధులను పట్టి ఉంచుతాయి. పారాసిట్మాల్‌ను ఎక్కువగా వాడితే కాలేయంలోకి చేరే టాక్సిన్‌ కణాల పటుత్వానికి అంతరాయం కలిగిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. దీంతో కాలేయంలోని కణజాల నిర్మాణానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ కారణంతోనే హెపటైటిస్‌, సిరోసిస్‌, కేన్సర్‌ వ్యాధుల ముప్పు ఉంటుందని పరిశోధన బృందం వెల్లడించింది. 

కాలేయంపై ప్రభావం అందుకే

మందు(డ్రగ్స్‌) ఏది అయినా నాలుగు దశల్లో పని చేస్తుది. మొదటి దశ జీర్ణాశయంలో కరిగిపోవడం(డిసాల్వింగ్‌), రెండో దశలో ఔషదం కాలేయాన్ని చేరుతుంది(మెటబాలిజం), మూడో దశలో అక్కడి నుంచి శరీర భాగాలకు చేరుతుంది(డిస్ట్రిబ్యూషన్‌), మూడో దశలోనే అవసరమైన శరీర భాగానికి ఔషదం అందుతుంది. నాలుగో దశలో ఔషద వ్యర్థాలు మూత్రపిండాల ద్వారా బయటకు వెళతాయి (ఎక్సెర్షన్‌). ఔషద వ్యర్థాలు చెమట రూపంలోనూ అతి తక్కువ మోతాదులో బయటకు వెళతాయి. ఎక్కువ మోతాదులో ఏ ఔషదాన్ని తీసుకున్నా.. అది మెటబాలిజంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా పారాసిట్మాల్‌ మాత్ర 500 ఎంజీ మోతాదులో లభిస్తుంది. ఒకటి, రెండు మాత్రలు తీసుకోవడంతో ముప్పు ఉండదని ఎడిన్‌బరో పరిశోధకులు పేర్కొన్నారు. ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉన్నవారు రోజులో నాలుగు గ్రాముల దాకా పారాసిట్మాలను వాడవచ్చు. అంతకు మించితే కాలేయానికి ముప్పు తప్పదని పేర్కొన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget