Viral News: భార్య లవర్ నుంచి భర్తకు 37 లక్షల పరిహారం ఇప్పించిన కోర్టు - భార్యాబాధితులకు మంచి రోజులొస్తున్నాయా ?
Couple Court: ఓ భార్య తన ఆఫీసులో పని చేసే భర్తతో వివాహేతర బంధం పెట్టుకుంది. ఇది తనను మానసికవేదనకు గురి చేసింది ఆ భర్త కోర్టుకెళ్లి పరిహారం సాధించుకున్నారు.

Court orders wife lover to pay Rs 37 lakh after husband: మన దేశంలో చట్టాలన్నీ మహిళలకు అనుకూలంగా ఉంటాయి. తప్పు చేసేది భర్తే అయి ఉంటాడని తేలుస్తూ ఉంటాయి. కానీ విదేశాల్లో అలా కాదు. తప్పు చేసే భార్యలకూ శిక్షలు ఉంటాయి.
తైవాన్ కోర్టు ఒక భార్య.. తన ప్రియుడితో కలిసి తన భర్తను మానసికంగా హింసించినందుకు రూ. 37 లక్షలు (సుమారు 3,00,000 యువాన్) పరిహారం చెల్లించాలని ఆదేశించింది. భర్త 8,00,000 యువాన్ నష్టపరిహారం డిమాండ్ చేస్తూ కోర్టుకెళ్లారు. విచారణ జరిపిన కోర్టు మూడు లక్షల యువాన్లు ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసు "మూడవ వ్యక్తి జోక్యం" అనే అంశాన్ని న్యాయపరంగా గుర్తించడంలో కీలకమైనదిగా నిలిచింది.
ఈ కేసులో వీ అనే వ్యక్తి తన భార్య సహోద్యోగి, ప్రియుడు యాంగ్‌పై సివిల్ దావా వేశాడు. వీ , అతని భార్య జీ ) 2006 నుంచి వివాహం చేసుకుని 15 సంవత్సరాలకు పైగా స్థిరమైన జీవితాన్ని గడిపారు. జీ, ఒక స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ, 2022లో స్కూల్ అకౌంటింగ్ డైరెక్టర్ అయిన యాంగ్‌తో వివాహేతర బంధం పెట్టుకుంది. ఈ సంబంధంలో శారీరక సాన్నిహిత్యం, హోటళ్లలో తరచూ సమావేశాలు జరిపేేవారు. అలాగే భార్య,భర్తలుగా ఒకరినొకరు వ్యవహరించేవారు.
2023 నవంబర్‌లో జీ ఫోన్‌లోని సందేశాలను వీ చూసినప్పుడు ఈ అక్రమ సంబంధం బయటపడింది. ఇది తన వ్యక్తిగత ప్రపంచాన్ని నాశనం చేసిందని, తీవ్రమైన భావోద్వేగ గందరగోళానికి గురిచేసిందని వీ తెలిపాడు. ఈ బాధ తన జీవన హక్కులను ఉల్లంఘించిందని వాదిస్తూ, వీ 8,00,000 యువాన్ (సుమారు ₹99.7 లక్షలు) నష్టపరిహారం కోసం దావా వేశాడు. ఈ మొత్తం విశ్వాసం కోల్పోవడం, మానసిక వేదన, వైవాహిక సామరస్యం కోల్పోవడం వంటి నష్టాలకు సంబంధించినదని వదించాడు.
విచారణ సమయంలో, కోర్టు ఈ సంబంధం సూక్ష్మ వివరాలను పరిశీలించింది. యాంగ్, వీ కంటే ఎక్కువ ఆదాయం ఉన్న సీనియర్ ఉద్యోగి, జీ వివాహితురాలని తనకు తొలుత తెలియదని వాదించాడు. అయితే, సందేశాల ఆధారాలు ఉద్దేశపూర్వకమైన , నిరంతర రొమాంటిక్ సంబంధం వెల్లడయింది. జడ్జి, వీకి ఈ వ్యవహారానికి సంబంధం లేని కొన్ని భావోద్వేగ సమస్యలు ఇంతకు ముందే ఉన్నాయని గుర్తించినప్పటికీ, యాంగ్ "తెలిసి" వీ వివాహంలో జోక్యం చేసుకున్నాడని స్పష్టంగా తీర్పు ఇచ్చారు.
తైవాన్‌లో వివాహేతర సంబంధాలకు "వ్యభిచార నష్టపరిహారం" కోసం దాఖలైన దావాలలో ఈ కేసు ప్రముఖమైనదిగా నిలిచింది. 2020లో తైవాన్‌లో వ్యభిచారం నేరం నుంచి తొలగించారు. కానీ భావోద్వేగ బాధకు సివిల్ పరిహారాలు లభిస్తాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇ ఈ తీర్పు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఇలాంటి కేసులను గుర్తు చేస్తుంది.





















