అన్వేషించండి

China : చైనాలో సంచలనం.. ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష - అవినీతిపై చేశారనే !

China death sentence:చైనాలో ఇద్దరు మాజీ రక్షణ మంత్రులు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వారు అవినీతికి పాల్పడటమే కారణం.

China sentences two ex-defence ministers to death for corruption: చైనా రక్షణ రంగంలో భారీ కుంభకోణాలు , అవినీతి ఆరోపణలతో ఆ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు మాజీ రక్షణ మంత్రులు వీ ఫెంఘే , లీ షాంగ్‌ఫులకు చైనా కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే, దీనిని రెండు సంవత్సరాల నిలిపివేత కాలంతో ప్రకటించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి సైన్యంలో సాగిస్తున్న సుదీర్ఘ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో  భాగంగా ఈ కఠినమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

 ఈ ఇద్దరు మాజీ మంత్రులు తమ పదవులను అడ్డం పెట్టుకుని భారీగా ముడుపులు స్వీకరించినట్లు,  వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువైంది. సాధారణంగా చైనా చట్టాల ప్రకారం, రెండేళ్ల రీప్రీవ్ పీరియడ్ తర్వాత, వీరి ప్రవర్తనను బట్టి మరణశిక్షను పెరోల్ లేని జీవిత ఖైదుగా మార్చే అవకాశం ఉంది. చైనా సాయుధ దళాల చరిత్రలో ఉన్నత స్థాయి అధికారులపై తీసుకున్న అత్యంత కఠినమైన చర్యలలో ఇది ఒకటిగా నిలిచిపోనుంది.                                           

చైనా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించిన వీ ఫెంఘే, లీ షాంగ్‌ఫులను శిక్షించడం ద్వారా సైన్యంలో క్రమశిక్షణను కఠినతరం చేయాలని జిన్‌పింగ్ భావిస్తున్నారు. ముఖ్యంగా అణు క్షిపణి వ్యవస్థలను పర్యవేక్షించే ఎలైట్ యూనిట్లలో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. సైనిక సామర్థ్యాన్ని ,  విశ్వసనీయతను దెబ్బతీసే అవినీతి మూలాలను తొలగించడం దేశ భద్రతకు అత్యవసరమని చైనా అధికారులు స్పష్టం చేస్తున్నారు.          

ఈ పరిణామం భారతదేశం కూడా షాక్‌కు గురయింది. ఎందుకంటే మరణశిక్ష పడ్డ వారిలో ఒకరైన జనరల్ లీ షాంగ్‌ఫు, 2023లో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఢిల్లీలో భేటీ అయ్యారు. 2020 గాల్వన్ లోయ ఘర్షణల తర్వాత భారత్-చైనా రక్షణ మంత్రుల మధ్య జరిగిన తొలి ఉన్నత స్థాయి సమావేశం అది. షాంఘై సహకార సంస్థ  రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా జరిగిన ఆ చర్చల్లో లీ షాంగ్‌ఫు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే నేత అవినీతి కేసులో మరణశిక్షకు గురికావడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన పదేళ్ల పాలనలో సైన్యాన్ని తన పూర్తి నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఇటువంటి ప్రక్షాళనలను ఆయుధంగా వాడుకుంటున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ పట్ల విధేయతను విస్మరించి, అధికార దుర్వినియోగానికి పాల్పడే ఏ అధికారినికైనా ఇవే శిక్షలు ఉంటాయని సైనిక కేడర్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ భారీ శిక్షల ద్వారా చైనా మిలిటరీలో అవినీతికి చరమగీతం పాడాలని జిన్‌పింగ్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget