అన్వేషించండి

Aliens Latest News: గ్రహాంతరవాసులు ఉన్నారా? ఏలియన్ ఫైల్స్ విడుదల చేసిన ట్రంప్ ప్రభుత్వం.. సినీ నిర్మాతకు అనుమానాలు

Does Aliens Exist: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రహాంతరవాసులు, UFO ల గురించి అప్డేడ్ ఇచ్చారు. కానీ ఏలియన్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా విడుదల కాలేదు.

అమెరికా ప్రభుత్వం UFOలు, గ్రహాంతరవాసుల గురించి పలు రహస్యాలను బయటపెట్టింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గ్రహాంతరవాసులకు సంబంధించిన అనేక ఫైల్స్ బహిర్గతం చేసింది. ఏరియా-51, గ్రహాంతరవాసులకు సంబంధించిన అనేక రహస్యాలను బయటపెట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా UFOలకు సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే, అమెరికా ప్రభుత్వం విడుదల చేస్తున్న ఫైళ్ల గురించి పలు దేశాల్లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 

అదే సమయంలో, ట్రంప్ గ్రహాంతర వాసులకు సంబంధించిన మొత్తం రహస్యాలను బయటపెట్టరని చాలా నివేదికలు చెబుతున్నాయి. దీనిపై సినీ నిర్మాత లూయిగి ప్రశ్నలు లేవనెత్తారు. లూయిగి S4: ది బాబ్ లేజర్ స్టోరీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అతడి ప్రకారం, అమెరికా ప్రభుత్వం UFOలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికీ షేర్ చేయదు. అలా చేయడం ఏ విధంగానూ కరెక్ట్ కాదని పేర్కొన్నారు. 

ప్రజలు UFOలకు సంబంధించిన సమాచారం కోరుతున్నారు 

ఒక ఇంటర్వ్యూలో లూయిగి మాట్లాడుతూ, ప్రజలు UFOలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారని అన్నారు. అలాంటి పరిస్థితిలో, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని అమెరికా ప్రభుత్వం ఈ ఫైల్‌లను విడుదల చేయకూడదు. దీంతో పాటు ట్రంప్‌ను దీని గురించి అడిగితే, అతను దాని గురించి బహిరంగంగా మాట్లాడడని పేర్కొన్నారు. బహుశా అతనికి అలాంటిది ఏమైనా తెలిసి ఉండవచ్చు, ఇది ప్రత్యర్థి దేశాలకు కొత్త మార్గాలను తెరుస్తుంది. 

లూయిగి తన డాక్యుమెంటరీలో ఏం తెలిపాడు  

ఇటీవల, లూయిగి తన డాక్యుమెంటరీలో లాజర్ ప్రభుత్వ రహస్య గ్రహాంతర వ్యోమనౌకను కలిగి ఉన్నాడని చూపించాడు.  దీనిలో గ్రహాంతరవాసులపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే, ట్రంప్ స్వయంగా గ్రహాంతరవాసులు, UFOలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవాలి అనుకుంటున్నానని చెప్పారు. దీనికి ఎంత టైం పడుతుందో తెలియదు. 

అంతకుముందు, ఈ రహస్యాన్ని తొలగించడంపై ట్రంప్ మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమూ గ్రహాంతరవాసులకు సంబంధించిన రహస్యాలను దాచడంలో మంచిదని అనుకోవడం లేదు. ఒకవేళ గ్రహాంతరవాసులు నిజంగానే ఉంటే, అప్పటికే ఒక గార్డు ఆ ప్రదేశం నుండి సెల్ఫీ తీసుకుని తన స్నేహితురాలికి పంపి ఉంటాడు. అలాగే ఈ సమాచారం ఇప్పటికే లీక్ అయి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇప్పటివరకూ ఏలియన్లపై అమెరికా ఏమంటోంది..

గ్రహాంతర వాసులు, గుర్తుతెలియని ఎగిరే వస్తువుల (UFOs/UAPs) గురించి దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం, సైన్యం, నాసా (NASA) ఈ విషయంలో చేస్తున్న పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

 పెంటగాన్, UAP నివేదికలు..   గతంలో వీటిని UFOలు అనేవారు. కానీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం వీటిని UAP (Unidentified Anomalous Phenomena) అని పిలుస్తోంది.  అమెరికా రక్షణ శాఖ ప్రత్యేకంగా 'ఆల్-డొమైన్ అనోమలీ రిజల్యూషన్ ఆఫీస్'ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు లభించిన వీడియోలు, సాక్ష్యాలను బట్టి అవి గ్రహాంతర వాసులవే అనడానికి ఎలాంటి పక్కా ఆధారాలు దొరకలేదని అమెరికా గతంలో ప్రకటించింది. అయితే, ఆ వస్తువులు ఏంటో కూడా వారు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

 నాసా (NASA) పరిశోధనలు.. గ్రహాంతర జీవం కోసం నాసా రెండు రకాలుగా వెతుకుతోంది. అంగారకుడి మీద నీటి జాడలు, బృహస్పతి చంద్రుడైన 'యూరోపా' మీద జీవం ఉండే అవకాశం ఉందని పరిశోధిస్తోంది. విశ్వంలో ఎక్కడైనా రేడియో సంకేతాలు పంపుతున్నారా అని వెతుకుతోంది. ఇప్పటివరకు గ్రహాంతర వాసుల నుండి ఎలాంటి స్పష్టమైన సిగ్నల్ అందలేదు.

 డేవిడ్ గ్రుష్ సంచలన వ్యాఖ్యలు.. 2023లో అమెరికా ఇంటెలిజెన్స్ మాజీ అధికారి డేవిడ్ గ్రుష్ అమెరికా పార్లమెంటు సాక్షిగా కొన్ని సంచలన విషయాలు చెప్పారు. అమెరికా ప్రభుత్వం దగ్గర కొన్ని కూలిపోయిన గ్రహాంతర నౌకలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. వాటితో పాటు మనిషి కాని జీవుల (Non-human biologics) అవశేషాలు దొరికాయని పేర్కొన్నారు. అయితే, ఆయన ఎటువంటి ఫోటోలు లేదా భౌతిక ఆధారాలను బహిరంగంగా చూపలేదు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
AP Municipal Election Results: ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
AP Municipal Election Results: ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Embed widget