China New Map: చైనాకు ఎదురుదెబ్బ, కొత్త మ్యాప్‌ను తిరస్కరించిన మరో నాలుగు దేశాలు
China New Map: చైనాకు మరో నాలుగు దేశాలు షాక్ ఇచ్చాయి. చైన ప్రకటించిన కొత్త మ్యాప్‌ను తిరస్కరించాయి.
China New Map: చైనాకు మరో నాలుగు దేశాలు షాక్ ఇచ్చాయి. చైన ప్రకటించిన కొత్త మ్యాప్‌ను తిరస్కరించాయి. చైనా కొత్త అధికారిక మ్యాప్ స్ప్రాట్లీ, పారాసెల్ దీవులపై దాని సార్వభౌమాధికారాన్ని, దాని జలాలపై అధికార పరిధిని ఉల్లంఘిస్తోందని వియత్నాం పేర్కొంది. మ్యాప్‌లోని తొమ్మిది చుక్కల రేఖ ఆధారంగా చైనా ప్రకటించిన సార్వభౌమాధికారం, సముద్రయాన ప్రకటనలు చెల్లవని వియత్నాం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫామ్ థు హాంగ్ అన్నారు. చుక్కల రేఖ ఆధారంగా దక్షిణ చైనా సముద్రంలో చైనా చేస్తున్న అన్ని వాదనలను వియత్నాం గట్టిగా వ్యతిరేకిస్తుందని హాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇతర దేశాలు సైతం చైనా మ్యాప్‌ను తిరస్కరించాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని విభాగాలను తమ భూభాగంలో చూపుతూ చైనా ప్రచురించిన మ్యాప్‌ను భారతదేశం మంగళవారం తప్పుబట్టింది. అలాగే దక్షిణ చైనా సముద్రంలో చైనా వాదనలను గుర్తించలేదని ఫిలిప్పీన్స్ పేర్కొంది. మలేషియా, తైవాన్ ప్రభుత్వాలు కూడా చైనా తమ భూభాగాన్ని క్లెయిమ్ చేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రకటనలు జారీ చేశాయి.
బుధవారం బీజింగ్‌లో జరిగిన సాధారణ విలేకరుల సమావేశంలో మ్యాప్ ప్రకటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పందించారు. మ్యాప్‌పై ఇతర దేశాలు మ్యాప్ గురించి రాద్దాంతం చేయకుండా, అతిగా వ్యాఖ్యానించకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉండగలవన్నారు. చైనా కొత్త మ్యాప్ ప్రకటించిన నేపథ్యంలో ప్రచురణకర్తలు, కంపెనీలు ఆయా వివరాలను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చైనా తీసకునే నిర్ణయంంతో విదేశీ సంస్థలు మ్యాప్‌లను ఎలా ఉపయోగించాలో తెలియక కొన్నిసార్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
1947 నాటి మ్యాప్‌లో అస్పష్టమైన గీతలు - తొమ్మిది - డ్యాష్ లైన్‌ను చూపుతూ చైనా దక్షిణ చైనా సముద్రంలో హైనాన్ ద్వీపానికి దక్షిణంగా 1,100 మైళ్ల (1,800 కిలోమీటర్లు) దూరంలో ఉన్న బిందువు వరకు 80% కంటే ఎక్కువ భాగాన్ని తమ దేశానికి చెందినదిగా ప్రకటించుకుంది. వియత్నాం, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, తైవాన్ సైతం అదే సముద్రంలో కొన్ని భాగాలను తమ దేశాలకు చెందినవిగా ప్రకటించుకున్నాయి. దీంతో చైనాకు ఆయా దేశాల మధ్య సరిహద్దుల వివాదం నడుస్తోంది.
వివాదం ఇదీ..
చైనా తాజాగా తమ దేశ అధికార మ్యాప్ 2023 ఎడిషన్‌ను ఆగస్టు 28న విడుదల చేసింది. అయితే ఇందులో భారత్ భూభాగాలను తమవిగా చూపిస్తోంది. సోమవారం చైనా అధికారికంగా విడుదల చేసిన మ్యాప్‌లో భారత్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్‌లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాలను చైనా తమ భూభాగాలుగా పేర్కొంది. అలాగే తైవాన్, వివాదాస్పద సౌత్ చైనా సముద్రాన్ని కూడా తమ స్టాండర్డ్ మ్యాప్‌లో చూపించింది. ఇంతకుముందు కూడా చైనా ఇలా పలుమార్లు భారత్‌ను రెచ్చగొట్టే విధంగా మ్యాప్‌లు విడుదల చేసింది. తాజాగా మరోసారి పొరుగుదేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాగా అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని, ముందు నుంచీ అలాగే ఉందని.. ఇక ముందు కూడా అలాగే ఉంటుందని భారత్ పలుమార్లు వెల్లడించింది.
చైనా విడుదల చేసిన మ్యాప్ ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌ను సౌత్ టిబెట్‌గా, అక్సాయిచిన్‌ను 1962 యుద్ధంలో చైనా ఆక్రమించుకున్నట్లుగా చూపిస్తోంది. తాజా ఎడిషన్ మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలు తమవేనని చూపించింది . అలాగే వివాదాస్పద వివాదాస్పదమైన తొమ్మిది డ్యాష్ లైన్స్ కూడా చైనా మ్యాప్‌లో చూపించింది. దీని ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో చాలా భాగాన్ని చైనా భూభాగంగా పేర్కొంటోంది. ఈ చర్య కారణంగా వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, తైవాన్ వంటి దేశాల నుంచి కూడా డ్రాగన్ వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఈ దేశాలు కూడా సముద్రంలోని కొన్ని ప్రాంతాలను తమవంటే తమవి అని పోటీ పడుతున్నాయి.