Boston Train On Fire: బ్రిడ్జిపై రైలు వెళ్తుండగా చెలరేగిన మంటలు- భయంతో నదిలో దూకేసిన పాసింజర్లు!
Boston Train On Fire: అమెరికాలో ఓ వంతెనపై రైలు వెళ్తోన్న సమయంలో మంటలు వ్యాపించాయి. దీంతో పాసింజర్లు కొంతమంది నదిలో దూకేశారు.
Boston Train On Fire: అమెరికాలోని బోస్టన్ శివార్లలో ఓ రైలులో మంటలు చెలరేగాయి. బ్రిడ్జిపై రైలు వెళ్తోన్న సమయంలో ఒక్కసారిగా ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు హడలిపోయారు. కొంతమంది వంతెన కింద ఉన్న నదిలోకి దూకేశారు.
Breaking: Fire Crews on scene of Orange line train fire. #boston25 https://t.co/XvIFJB3dI1 pic.twitter.com/n5tcIlQA6e
— Ted Daniel (@tvnewzted) July 21, 2022
ఇదీ జరిగింది
వెల్లింగ్‌టన్, అసెంబ్లీ స్టేషన్‌ల మధ్య ఉన్న వంతెన మీదుగా ప్రయాణిస్తోన్న ఆరెంజ్ లైన్ రైలుకే ఈ ప్రమాదం జరిగింది. రైలు హెడ్ కార్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. కానీ మంటలను చూసి కొంతమంది పాసింజర్లు భయపడి నదిలోకి దూకేశారు.
This morning, an Orange Line train reported flames & smoke coming from its head car as it traveled across the bridge between Wellington & Assembly stations. MBTA & emergency personnel quickly responded, shutting down power, and safely assisting ~200 passengers from the train.
— MBTA (@MBTA) July 21, 2022
This was my morning. pic.twitter.com/shKkLYE6kT
— Glen Grondin (@odievk) July 21, 2022
మరి కొంతమంది కిటికీలో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దాదాపు 200 మంది ప్రయాణికులను ఈ ప్రమాదం నుంచి కాపాడినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ రైలు ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ పాసింజర్లు మాత్రం ప్రమాద సమయంలో గందరగోళానికి గురయ్యారు. కొంతమంది నదిలోకి దూకి పారిపోయారు.
Also Read: Polio Case In USA: మళ్లీ పుట్టుకొచ్చిన పోలియో- దశాబ్దం తర్వాత అమెరికాలో మళ్లీ కలకలం!
Also Read: Monkeypox Cases India: దేశంలో మూడో మంకీపాక్స్ కేసు- మళ్లీ కేరళలోనే!