By: ABP Desam | Updated at : 12 Jul 2022 04:05 PM (IST)
సూపర్ మ్యాన్‌ని చూసి ఉంటారు.. సూపర్ మూన్ చూస్తారా ? బుధవారమే ముహుర్తం !
‘Supermoon’ of the Year : మ్యాన్ వేరు.. సూపర్ మ్యాన్ వేరు అన్నట్లుగా.. మూన్ వేరు. సూపర్ మూన్ వేరు. మూన్ కంటే పెద్దగా ఉండటమే సూపర్ మూన్ స్టైల్. ఆకాశంలో మరోసారి సూపర్‌మూన్ కనువిందు చేయనుంది. ఈ నెల 13న అంటే బుధవారం చందమామ భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. భూమికి 3,57,264 దూరంలో చంద్రుడు రానున్నాడు. దీనిని బక్ మూన్ అని కూడా పిలుస్తారు. బుధవారం రాత్రి 12.07 గంటలకు ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది.
చంద్రుడు తన కక్ష్యలో తిరిగే క్రమంలో భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు సాధారణం కంటే 7 శాతం పెద్దగా, 15 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అందుకే ఆ రోజున కనిపించే చంద్రుడిని 'సూపర్‌మూన్ అని పిలుస్తారు. ఈ నెల 7వ తేదీన పౌర్ణమి కావడంతో చంద్రుడు సూపర్ మూన్‌గా కనిపించనున్నాడు. సూపర్ మూన్ అంటే చంద్రువుకు కొన్ని ప్రత్యేక శక్తులు ఉండవు. భూమి చుట్టు చంద్రుడు పరిభ్రమిస్తుంది. ఒక కక్ష్యలో తిరుగుతున్న సమయలో భూమికి దగ్గరి రావడమే సూపర్‌మూన్. దీనిని పెరిజీ అంటారు.
కొన్ని దేశాల్లో ఈ సూపర్ మూన్ ను రకరకాల పేర్లతో పిలుస్తారు. ఉత్తర అమెరికా ప్రాంతాల్లో దీనిని 'పింక్‌మూన్' అంటారు. ఇతర దేశాల్లో స్ర్పౌటింగ్ గ్రాస్ మూన్, ది ఎగ్ మూన్, ద ఫిష్‌మూన్ అని కూడా పిలుస్తుంటారు. ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దాన్ని బ్లూమూన్ అంటారు. భూమికి దగ్గరగా చంద్రుడు వస్తే దాన్ని సూపర్ మూన్ అంటారు. చం చంద్ర గ్రహణం, బ్లడ్ మూన్, సూపర్ మూన్.. ఈ మూడూ ఒకేరోజు వస్తే దాన్నే సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అని పిలుస్తారు.
ఒక సూపర్ మూన్, చంద్ర గ్రహణం మరియు ఒక బ్లూ మూన్ ఒకేసారి రావటం గత 150 సంవత్సరాలలో సంభవించలేదు. కాగా 2018 జనవరిలో సూపర్ మూన్, చంద్ర గ్రహణం మరియు ఒక బ్లూ మూన్ ఒకేసారి రావడంతో ఆ చంద్ర గ్రహణానికి ప్రత్యేకత ఏర్పడింది. అనేక దేశాల ప్రజలు ఈ అద్భుతాన్ని వీక్షించారు. అప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా దాన్ని స్పష్టంగా చూడగలిగారు. అయితే ఈసారి మాత్రం భారత దేశంలో ఈ సూపర్‌మూన్ కనపడదని, ఈ సారి చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు మన దేశంలో సమయం 8వ తేదీ ఉదయం 8.05గా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పైగా మనకు అసలు కనిపించదు.ఎందుకంటే చుట్టూ మబ్బు పట్టి ఉందని మీకు తెలుసు కదా !
Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు
Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ
Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్ ఎందుకు వివాదాస్పదమైంది?
Salman Rushdie: వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ, ఓ కన్ను కోల్పోక తప్పదేమో - న్యూయార్క్ టైమ్స్ కథనం
Salman Rushdie : ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై హత్యాయత్నం, కత్తితో దాడి చేసిన దుండగుడు
Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు
Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
ఇప్పుడు కుమారి ఒంటరే - బాయ్‌ఫ్రెండ్‌తో ఆ సినిమా విడుదలకు ముందు...