Nigeria Attack: నైజీరియాలో కాల్పుల కలకలం- బందిపోట్ల దుశ్చర్యకు 43మంది మృతి
కాల్పులతో నైజీరియా వణికిపోతోంది. బందిపోట్లు ఒకవైపు.. ఉగ్రవాదులు మరోవైపు రెచ్చిపోతూ ప్రజలను భయపడుతూ బతుకుతున్నారు. తాజాగా జరిగిన కాల్పుల్లో 43మంది మృతి చెందారు.
![Nigeria Attack: నైజీరియాలో కాల్పుల కలకలం- బందిపోట్ల దుశ్చర్యకు 43మంది మృతి At least 43 people killed in gunmen attack in North-Western Nigeria Nigeria Attack: నైజీరియాలో కాల్పుల కలకలం- బందిపోట్ల దుశ్చర్యకు 43మంది మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/24/9b1dd0bb52b54969dcf1e430a8db2a87_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నైజీరియాలోని ఓ మార్కెట్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో 43మంది మృతి చెందారు. స్థానికంగా జరుగుతున్న సంతలో ఈ ఘటన జరిగింది. నార్త్‌వెస్ట్‌లో ఉండే సకోటోలో ఈ దుర్ఘటన జరిగింది.
గొరొన్యో అనే పల్లెలో ఆదివారంక కొందరు బందిపోట్లు జరిపిన కాల్పుల్లో 43మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఘటనకు కారణాలపై ఎవరెవరు పాల్గొన్నారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు ప్రభుత్వ అధికార ప్రతినిధి.
ALSO READ: బస్టాండుల్లోని షాపుల్లో అధిక ధరలకు అమ్ముతున్నారా? ఈ నెంబర్లకు ఫోన్ చేయండి
ఆదివారం జరిగిన ఈ సంఘటనపై లోకల్ పోపర్లు కవర్ చేయడంతో ప్రపంచానికి ఈ విషయం తెలిసింది. 30 మంది చనిపోయారని... మరో 20 మంది గాయపడ్డారని లోకల్ మీడియా పేర్కొంది. ప్రభుత్వం మాత్రం 43మంది చనిపోయనట్టు ప్రకటించింది.
ALSO READ: అమెజాన్‌లో ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ.15 వేల వరకు తగ్గింపు!
సుమారు 200మందితో ఉన్న బందిపోట్ల టీం మార్కెట్‌పై విరుచుకు పడింది. బైక్స్‌పై మార్కెట్ గేట్లను విరగొట్టి సినిమా స్టైల్‌లో కాల్పులతో రెచ్చిపోయింది. వస్తూ వస్తూనే గన్స్‌కు పని చెప్పారు. ఆడా,మగా అనే తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్టుగానే కాల్పి పడేశారు.
ALSO READ: మోస్ట్ పవర్‌ఫుల్ యాపిల్ ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. ధర ఎంతో తెలుసా?
నైజీరీయాలో ఇలాంటి కాల్పులు చాలా కామన్. నిత్యం ఇలాంటి సంఘటనలు తరచూ స్థానిక మీడియాలో వస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలోనే అంటే అక్టోబర్8న కూడా ఓ మార్కెట్‌లో బందిపోట్లు కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 19మంది కన్నుమూశారు.
ALSO READ: కేరళలో క్రేజీ వివాహం.. వానలు , వరదలను లెక్కచేయకుండా..
నార్త్ నైజీరియా ఇలాంటి అరాచకాలతో వణికిపోతోంది. కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఇలాంటి అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయి. క్రిమినల్స్ గ్రూప్స్‌తోపాటు బోకోహరమ్ ఉగ్రవాదులు కూడా తరచూ ప్రజలపై తమ ప్రతాపం చూపిస్తుంటారు. దీంతో ప్రజలు నిత్యం భయబ్రాంతులతో బతుకుతున్నారు.
ALSO READ: కుర్రాళ్ల గుండెల్లో 'ఉప్పెన' సృష్టిస్తోన్న కృతి శెట్టి
ALSO READ: కొత్త ఎయిర్‌పోడ్స్ వచ్చేశాయ్.. ఎయిర్‌పోడ్స్ ప్రో కంటే తక్కువ ధరకే!
ALSO READ:రూ.1,000లోపు టాప్-5 బ్లూటూత్ స్పీకర్లు.. రూ.400లో కూడా!
ALSO READ: మీ చిన్నారుల కోసం స్ట్రోలర్ చూస్తున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో అతి తక్కువ ధరకే..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)