Afghanistan Crisis: అఫ్గాన్ మహిళలు.. టీవీ చూడొద్దట..హై హీల్స్ వేసుకోవద్దట.. ఇవేమి 'తాలిబన్' రూల్స్ రా నాయనా
తాలిబన్లు.. అఫ్గానిస్థాన్ ను ఆక్రమించేస్తుంటే.. ప్రపంచమంతా మౌనంగా చూసింది. ఏమీ చేయలేని పరిస్థితి.. అందరిలో.. ఆ దేశ మహిళల పరిస్థితి ఇకపై ఎలా ఉంటుందోనని ఆలోచన మెుదలైంది.
ఎలాంటి విపత్తు వచ్చినా.. మెుదట సమస్య ఎదుర్కొనేది మహిళలే. ఆకలి, అత్యాచారం, బాధ.. ఏదైనా ముందు వారే బలి అయ్యేది. ఇప్పుడు ఆఫ్గాన్ మహిళ కూడా తాలిబన్ల అరాచకం ఎలా ఉంటుందోనని వణికిపోతోంది. వారి దారుణాలు అలా ఉంటాయి మరి. తాలిబన్ల పాలన మొదలైతే అఫ్గానిస్తాన్‌లో మహిళల జీవితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. అంత కఠినంగా ఉంటాయి తాలిబన్ల రూల్స్. అఫ్గాన్ లో మళ్లీ.. హీనమైన పాలనను ఇకపై ప్రపంచం మౌనంగా.. చూస్తుంది. అఫ్గాన్ మహిళలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటారనేవార్తలు ఇప్పటికే వచ్చేస్తున్నాయి.
Also Read: Afghanistan Crisis Impact: అఫ్గాన్ సంక్షోభంతో భారత్ కు వచ్చే కొత్త సమస్యలేంటి?
వయసులో ఉన్న ఆడపిల్లలు, వితంతువులు తాలిబన్లను పెళ్లి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఇటీవలే వార్తలొచ్చాయి. 2001లో అఫ్గాన్ లో తాలిబన్లు ప్రభుత్వం కూలిపోయింది. అమెరికా మద్దతుతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి 20 ఏళ్లుగా స్వేచ్ఛ ఊపిరి పీల్చుకున్న మహిళలు.. ఇప్పుడు మళ్లీ అదే జీవితంలోకి వెళ్లబోతున్నారు. అవును.. ఎవరు కాదు అని చెప్పిన జరిగేది అదే. ఆ జీవితం ఎంత నరకమో.. వారికి తెలుసు కాబట్టే.. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. దేశ ప్రధాని దేశం విడిచి వెళ్లారంటే.. ఇక సగటు ఆడ పిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే.. విమానాశ్రయాల్లో జనాలు కిక్కిరిసిపోతున్నారు. అందులో ఎక్కువగా ఉన్నది మహిళలే.
మహిళలు బుర్ఖాలు ధరించాలని, పురుషులు గడ్డాలు పెంచాలి లాంటి చిన్న చిన్న రూల్స్ ను కూడా తాలిబన్లు వదిలిపెట్టరు. ఒకవేళ పాటించకుంటే ప్రాణాలతో విడిచిపెట్టరు. 10 ఏళ్లు దాటిన బాలికలు చదువుకోవడానికి వీల్లేదని బాలికల విద్య పై ఆంక్షలు. సంగీతం, టీవీ, సినిమాల వంటి వినోద కార్యక్రమాలపై నిషేధం. ఇలా ఉంటాయి.. వారి ఆదేశాలు..
Also Read: Kabul Airport: కాబుల్ ఎయిర్ పోర్టులో కిక్కిరిసిన ప్రయాణికులు... ఎయిర్ పోర్టులో తొక్కిసలాట
వాళ్లు కొన్ని ప్రావిన్సులను స్వాధీనం చేసుకుంటూ వస్తూనే అక్కడ మహిళ పట్ల చేసిన అరాచకాలు మామూలుగా లేవు. ఆ ప్రాంతాల్లో తాలిబన్లను వివాహం చేసుకోవడానికి 12 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల అవివాహిత మహిళల జాబితాలను తీసుకురావాలని స్థానిక ఇమామ్‌లను ఆదేశించారట. వయసుకనుగుణంగా.. తాలిబన్లు మహిళలను విభజించుకోవాలని ప్రణాళికలు చేసుకుంటున్నారట. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ మీడియా తెలిపింది.
తాలిబన్ల రూల్స్ ఎలా ఉంటాయంటే..
- మహిళలు మోకాళ్లు కనిపించేలా దుస్తులు వేయడం నిషేధం
- ఆడపిల్లలకు చదువు నిషిద్ధం
- తండ్రి, భర్త, సోదరుడు తోడులేకుండా బయటికి వస్తే కఠిన శిక్షలు ఉంటాయి.
- ఇళ్ల ముందు గానీ, బాల్కనీల్లో గానీ అస్సలు నిలబడొద్దు.
- ఎలాంటి పరిస్థితులోనైనా మగ డాక్టర్ల దగ్గరకు వెళ్లొద్దు.
- మగాళ్ల కలిసి బయటకు రావొద్దు, కనిపించొద్దు, కనిపిస్తే.. రాళ్లతో కొట్టి మరణ శిక్ష
- హైహీల్స్, టైట్ జీన్స్ వేసుకోవద్దు
- రేడియో, టీవీ, పబ్లిక్ ప్రోగ్రామ్స్ కు దూరంగా ఉండాలి
- సైకిళ్ల మీద తిరగొద్దు.
అయితే... తమ ప్రభుత్వంలో మహిళలకు ఉద్యోగం చేయడానికి, చదువుకోడానికి స్వేచ్ఛ ఉంటుందని తాలిబన్లు చెపుతున్నా.. ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వారు చేసే అరాచకం అందరికీ తెలిసిందే. ప్రపంచమంతా ఇప్పుడు అఫ్గాన్ మహిళ వైపు జాలిగా చూస్తోంది.