Afghanistan Crisis Impact: అఫ్గాన్ సంక్షోభంతో భారత్ కు వచ్చే కొత్త సమస్యలేంటి?
అఫ్గానిస్థాన్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. పూర్తిగా తాలిబన్ల అధీనంలో ఉన్న అఫ్గానిస్థాన్ లో విదేశీ ప్రజల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుత అఫ్గాన్ సంక్షోభంతో భారత్ కు కొత్త సమస్యలు రానున్నాయా?
అఫ్గానిస్థాన్.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏం చేస్తారో తెలియని దేశం. ఎక్కడ విన్నా బాంబుల శబ్దాలు, తుపాకీ మోతలే. అలాంటి అఫ్గాన్ ప్రస్తుతం తాలిబన్ల చేతుల్లో ఉంది. అమెరికా తన బలగాలను అఫ్గాన్ నుంచి వెనక్కి పిలవడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. పాకిస్థాన్ నుంచి వారికి మద్దతు లభించడంతో తాలిబన్లు ఏకంగా దేశాన్నే హస్తగతం చేసుకున్నారు. మరి దీని వల్ల భారత్ కు ఏమైనా సమస్య ఉందా? తాలిబన్లతో భారత్ కు ఎదురయ్యే సమస్యలేంటి?
ఉద్రిక్త పరిస్థితులు..
అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లడం వల్ల భారత్‌కు కొత్త సమస్యలను రావొచ్చు. ఇప్పటికే చైనా, పాకిస్థాన్ సరిహద్ధుల వద్ద భారత్ సమస్యలను ఎదుర్కొంటోంది. తాజాగా అఫ్గాన్ తో స్నేహ సంబంధాలు భారత్‌కు ఇప్పుడు క్లిష్టతరంగా మారాయి.
ALSO READ:
అదే పెద్ద సమస్య..
అఫ్గానిస్థాన్ లో ఉన్న భారతీయ దౌత్యవేత్తలు, సిబ్బంది, పౌరులకు రక్షణ కల్పించడం భారత్ ముందున్న ప్రధాన సమస్య. అమెరికా తన బలగాలను అఫ్గాన్ నుంచి వెనక్కి రప్పిస్తుందనే వార్తలతో ఏడాది కాలంగా భారత్.. కాబుల్‌తో దౌత్యపరమైన సంబంధాలను తగ్గించుకుంది. 2021 ఏప్రిల్‌లో కొవిడ్-19 ప్రభావం, భద్రతను దృష్టిలో ఉంచుకొని హేరాత్, జలాలాబాద్‌లో మిషన్లలో ఉన్న భారత సిబ్బందిని స్వదేశానికి రప్పించింది. గత నెలలో కాందహార్, మజార్‌లో కాన్సులేట్లు కూడా మూసివేశారు. ప్రస్తుతం కాబూల్ రాయబార కార్యాలయం మాత్రమే అక్కడ పనిచేస్తోంది. భారతీయ పౌరులందరూ వాణిజ్య విమానాల ద్వారా వీలైనంత త్వరగా అక్కడి నుంచి రావాలని మన దేశం ఆదేశించింది.
ప్రస్తుతం అఫ్గానిస్థాన్ తాలిబన్ల ఆధిపత్యంలో ఉంది. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న దక్షిణ ప్రావిన్సుల(అఫ్గాన్) వద్ద స్థావరాలు, శిక్షణ మైదానాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఫలితంగా భారత్‌కు వ్యతిరేకంగా దాడులు చేయడానికి అపరిమిత ప్రదేశాలు ఉండే అవకాశముంది.
ALSO READ:
Kabul Airport: కాబుల్ ఎయిర్ పోర్టులో కిక్కిరిసిన ప్రయాణికులు... ఎయిర్ పోర్టులో తొక్కిసలాట
తాలిబన్ల చేతిలో..
తాలిబన్ల పాలనలో పాకిస్థాన్‌కు అడ్డుకట్ట వేసేందుకు చౌబహార్ ఎయిర్ పోర్టులో భారత్ పెడుతున్న పెట్టుబడులకు ప్రతిఫలం లేకుండా పోతుంది. ఈ కారణంగానే అమెరికా, చైనా రెండు సొంత ప్రాజెక్టులపై దృష్టి సారించాయి. అమెరికా.. పాకిస్థాన్-ఉజ్బెకిస్థాన్-అఫ్గానిస్థాన్ క్వాడ్రలేటరల్ ప్రాజెక్ట్‌ను, డ్రాగన్ దేశం.. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారీడార్ (సీపీఈసీ)ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటికే జరాంజ్-దేలారం హైవే, సల్వా డ్యాంతో సహా భారత్ నిర్మించిన ప్రాజెక్టులు తాలిబన్ల నియంత్రణలోకి వచ్చాయి.
టెర్రర్ గ్రూపులతో..
తాలిబన్ల ప్రభావంతో భారత్ పరిసర ప్రాంతాల్లో పాన్- ఇస్లామిక్ టెర్రర్ గ్రూపులతో రాడికలైజేషన్ ముప్పు ఏర్పడనుంది. 1980వ దశకంలో సోవియట్‌పై పట్టుసాధించేందుకు అఫ్గానిస్థాన్‌లో ముజాహిదీన్లకు అమెరికా మద్దతు ఇచ్చింది. దీంతో ముజాహిదీన్.. సోవియట్ ఆర్మీపై విజయం సాదించింది. ఫలితంగా అల్ ఖైదా, ఐఎస్ లాంటి ఉగ్రసంస్థల ఆవిర్భావానికి దోహదం చేసింది. అంతేకాకుండా తదనంతర కాలంలో అమెరికా-ఇరాక్ యుద్ధంతో పాటు 2011 తర్వాత పశ్చిమాసియా దేశాల్లో సంక్షోభానికి దారితీసింది. చివరగా అఫ్గాన్ సంక్షోభం ప్రభావం భారత్‌పై పడనుంది. మహిళల, మైనార్టీ హక్కుల క్షీణత, ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేయడం, తాలిబన్ల క్రూరమైన న్యాయ విధానాలు లాంటి ఆందోళనలు భారత్ ముందున్నాయి.
యూఎస్ కలవరం..
అమెరికా తన బలగాలను.. అఫ్గాన్ నుంచి ఉపసంహరించడం వల్ల తాలిబన్లు రెచ్చిపోతున్నారన్నది జగమెరిగిన సత్యం. అయితే తాలిబన్లు అఫ్గాన్ ను ఆక్రమించడం వల్ల అమెరికాకు సమస్యలు రానున్నాయి. తాలిబన్ల కారణంగా భద్రతా పరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అఫ్గానిస్థాన్ ప్రస్తుత పరిస్థితికి అమెరికానే కారణమనే ఆరోపణలను ఎదుర్కోక తప్పదు.