అన్వేషించండి

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో నేటి నుంచి కొత్త ప్రభుత్వ పాలన- ఎదుర్కొనే సవాళ్లు ఇవే

Mohammad Yunus: బంగ్లాదేశ్‌లో నేడు తాత్కాలిక ప్రభుత్వం కొలువు దీరనుంది. ఇంకా అదుపులోకి రాని హింసాత్మక పరిస్థితులను కొత్త ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో అన్న ఆసక్తి నెలకొంది.

Bangladesh Crisis : రాజకీయ సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చక్కదిద్దేందుకు ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్‌ యూనస్‌ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం రాత్రి 8 గంటలకు కొలువు దీరనుంది. పారీస్‌లో ఉన్న యూనర్‌ స్వదేశానికి చేరుకుంటున్నారు. ఆయన చేరుకున్న తర్వాత 15 మందితో సలహా మండలి ఏర్పాటు చేయనున్నారు. వీళ్లకు సైన్యం కూడా సహకరించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. 

పారిస్ నుంచి బంగ్లాదేశ్ ప్రజలకు సందేశం

బంగ్లాదేశ్‌ ప్రజలకు యూనస్‌ ఓ సందేశాన్ని పంపించారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని సూచించారు. దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు ఇదో గోప్ప అవకాశమని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితిల్లో హింసను ప్రేరేపిస్తే బాగోదని హితవు పలికారు. సామాన్య ప్రజలకు విద్యార్థులు, పార్టీలు అన్నీ శాంతియుతంగా ఉండి దేశాభివృద్ధిలో భాగమవ్వాలని కోరారు. 

బంగ్లాదేశ్‌లో ఆగని హింస

మరోవైపు బంగ్లాదేశ్‌లో హింస మాత్రం ఆగడం లేదు. సైనిక పాలన సాగుతున్న వేళ లూటీలు జరుగుతున్నాయి. అవామీ లీగ్ నాయకులను టార్గెట్ చేసుకుంటున్నారు ఆందోళనకారులు. వారిని వెతికిపట్టుకొని దాడులు చేస్తున్నారు. చిత్రవధ చేసి చంపేస్తున్నారు. ఇలా డజన్ల మందిని హత్య చేసినట్టు మీడియా చెబుతోంది. కొన్ని రోజులుగా హింసకు బలైన వారి సంఖ్య దాదాపు ఐదు వందలకు చేరుకుంది. భారతీయులతోపాటు ఇతర దేశీయులను టార్గెట్ చేసుకుంటున్నారు అల్లరి మూకలు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

రాహుల్ ఆనంద ఇంటిని ధ్వంసం చేసిన అల్లరి మూకలు

జానపద కళాకారుడు రాహుల్ ఆనంద ఇంటిని నేల మట్టం చేశాయి అల్లరి మూకలు. లూటీ చేసి ఆయన ఇంట్లో ఉన్న వస్తువులను ఎత్తుకుపోయారు. సంగీత పరికరాలకు నిప్పు పెట్టారు. విషయాన్ని ముందే తెలుసుకున్న ఆయన కుటుంబంతో కలిసి ఎటో వెళ్లిపోయారు. ఇలా ఇళ్లపైనే కాదు పోలీసు స్టేషన్లపై కూడా దాడులు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి భయానక వాతావరణంలో పని చేసేందుకు పోలీసులు రావడం లేదు. 

యూనస్ ఎలా కంట్రోల్  చేస్తారు?

ఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మహమ్మద్‌ యూనస్‌కు కఠిన సవాళ్లు ఎదుర్కోనున్నాయి. పేదల బ్యాంకర్‌గా పేరున్న ఆయన ఏం చేస్తారని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. లక్షల మందిని పేదరికం నుంచి తప్పించిన యూనస్ ఇప్పుడు దేశాన్ని ఎలా గట్టెక్కిస్తారనే ప్రశ్న చాలా మందిలో ఉంది. 

భారత్ సరిహద్దు వద్ద బంగ్లాదేశీయుల బారులు 

మరోవైపు హింసాత్మక పరిస్థితులు ఉన్నందున చాలా మంది బంగ్లాదేశీయులు ఆ దేశం విడిచిపెట్టి భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది భారత్‌, బంగ్లాదేశ్ సరిహద్దు వద్దకు చేరుకొని తమ రాకకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. బెంగాల్‌లోని జల్‌పాయిగుడీ జిల్లాకు వందల మంది బారులు తీరారు. అక్కడ జరుగుతున్న దారుణాలు వివరిస్తున్నారు. ఎవర్నీ అనుమతి ఇచ్చేది లేదని భారత్ సైన్యం స్పష్టం చేస్తోంది. 4,096 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం వెంబడి భారత్‌ కట్టిదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. సరిహద్దు వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రం పర్యవేక్షిస్తోంది. 

Also Read: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఎందుకీ దాడులు? కోటి మంది బెంగాల్‌కి వలస వస్తున్నారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget